సూపర్ మైలేజ్ ఇస్తుంది..రూ.2.67లక్షల తగ్గించారు..అయినా ఈ కారును అక్టోబర్లో కేవలం ఇద్దరే కొన్నారు

ఫ్రాన్స్‌కు చెందిన సిట్రోయెన్ (Citroen) సంస్థ ఎన్నో ఆశలతో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం తమ లోపాలను సరిదిద్దుకుని, కొత్తగా వచ్చిన కూపే ఎస్‌యూవీ బసాల్ట్ (Basalt) వంటి మోడళ్లతో తమ బ్రాండ్ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, కంపెనీ మొదట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్‌యూవీ... సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అది అద్భుతమైన సస్పెన్షన్, మైలేజ్ ఇచ్చినా, దాని అమ్మకాలు మాత్రం నిరాశపరిచాయి.

సిట్రోయెన్ ఇటీవల అక్టోబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 1,426 కార్లను విక్రయించి, ఈ ఏడాది అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో ఎంట్రీ-లెవల్ మోడల్ C3 (897 యూనిట్లు) కంపెనీకి మంచి అమ్మకాలను తెచ్చిపెట్టింది. అయితే, ప్రీమియం ఎస్‌యూవీ అయిన C5 ఎయిర్‌క్రాస్ మాత్రం అక్టోబర్‌లో కేవలం 2 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Citroen C5 Aircross Sales Crash Only 2 Units Sold in October Despite Premium Features and Mileage

అయినప్పటికీ ఇందులో ఓ సానుకూల అంశం ఉంది. అదేంటంటే ఈ మోడల్ గత 4 నెలల తర్వాత మొదటిసారిగా అకౌంట్ ఓపెన్ చేసింది. అంతకుముందు ఈ కారును ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో షోరూమ్‌లలో ఒంటరిగా ఉండిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో కొత్త జీఎస్‌టీ (GST) నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత సిట్రోయెన్ ఈ ప్రీమియం ఎస్‌యూవీ ధరను భారీగా తగ్గించింది.

గతంలో C5 ఎయిర్‌క్రాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.39.99 లక్షలుగా ఉండేది.జీఎస్‌టీ తగ్గింపు తర్వాత దీని ధర ఏకంగా రూ.2.67 లక్షలు తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.37.32 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరలో మార్పు వచ్చినా ఎస్‌యూవీకి వేరే ఎలాంటి మార్పులూ చేయలేదు. ప్రస్తుతం ఈ కారు షైన్ (Shine) అనే సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది.

Citroen C5 Aircross Sales Crash Only 2 Units Sold in October Despite Premium Features and Mileage

C5 ఎయిర్‌క్రాస్ ధర ఎక్కువైనా, ఇది అందించే ఫీచర్లు, పవర్ చాలా అద్భుతం. ఈ కారుకు శక్తినిచ్చేది 1997 సీసీ, DW10FC 4-సిలిండర్ డీజిల్ ఇంజన్. ఇది 177 bhp పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మాన్యువల్ ఆప్షన్ లేదు. ఈ 5-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ లీటరుకు ఏకంగా 17.5 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

ఇందులో స్నో, ఆల్-టెరైన్ ఆప్షన్లతో పాటు వివిధ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. దీనికి 52.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉంది. ఈ కారు 4500 mm పొడవు, 1969 mm వెడల్పు, 1710 mm ఎత్తు, 2730 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీంతో రోడ్ మీద దీని ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Citroen C5 Aircross Sales Crash Only 2 Units Sold in October Despite Premium Features and Mileage

C5 ఎయిర్‌క్రాస్ లోపలి భాగం, సేఫ్టీ ఫీచర్లు ఈ ధర విభాగంలో అద్భుతంగా ఉన్నాయి. ఇంటీరియర్ హైలైట్స్ విషయానికి వస్తే.. 31.24 సెం.మీ కస్టమైజ్ చేయగలిగే టీఎఫ్‌టీ (TFT) ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 25.4 సెం.మీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ (ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో), ఎలక్ట్రిక్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, హ్యాండ్స్-ఫ్రీ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.

సేఫ్టీ, ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్‌లు, 580 లీటర్ల బూట్ స్పేస్ ఉన్నాయి. అన్ని రకాలుగా మంచి డీల్ అయినప్పటికీ, కొనుగోలుదారులు ఈ కారు వైపు ఆసక్తి చూపకపోవడం సిట్రోయెన్‌కు పెద్ద సవాల్‌గా మారింది.

More from DriveSpark

Article Published On: Sunday, November 16, 2025, 13:30 [IST]
English summary
Citroen c5 aircross sales crash only 2 units sold in october despite premium features and mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+