పండుగకు దుమ్ములేపిన రతన్ టాటా కంపెనీ.. షోరూమ్‌లో సిబ్బందికి తినడానికి కూడా టైం ఇవ్వని కస్టమర్లు
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్(Tata Motors) సంచలనం సృష్టిస్తోంది. సేఫ్టీ, క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న టాటా కార్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడుతున్నారు. ఈ పండుగ సీజన్ (నవరాత్రి నుంచి దీపావళి వరకు) టాటా మోటార్స్‌కు భారీ విజయాన్ని అందించింది. ఈ కాలంలో కంపెనీ దేశవ్యాప్తంగా ఏకంగా 1,00,000 (లక్ష) యూనిట్లకు పైగా కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 33శాతం మేర పెరగడం విశేషం. ముఖ్యంగా రూ.7 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న నెక్సాన్ (Nexon) ఎస్‌యూవీకి, పంచ్ (Punch) మైక్రో ఎస్‌యూవీకి భారీగా డిమాండ్ వచ్చింది. ఈ అమ్మకాల విజయం, ఆ కార్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

నవరాత్రి నుంచి దీపావళి వరకు ఉన్న పండుగ సీజన్లో టాటా మోటార్స్ తమ డీలర్‌షిప్‌ల ద్వారా దాదాపు 1,00,000 యూనిట్ల కంటే ఎక్కువ కార్లను అమ్మినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలతో పోలిస్తే ఇది 33 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఈ విజయంలో కంపెనీ ప్రముఖ ఎస్‌యూవీలు కీలక పాత్ర పోషించాయి. ఈ సీజన్‌లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాప్ పొజిషన్లో నిలిచింది. మొత్తం 38,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 73శాతం వృద్ధి.
దీని తర్వాత పంచ్ మైక్రో ఎస్‌యూవీ 32,000 యూనిట్లు అమ్ముడై, 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, టాటా మోటార్స్ ఈ పండుగ సీజన్‌లో 10,000 ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయించింది.

నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలలో టాటా మోటార్స్‌కు గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.32 లక్షల నుండి గరిష్ఠంగా రూ.14.05 లక్షల వరకు ఉంటుంది. ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్, కార్బన్ బ్లాక్, గ్రాస్‌ల్యాండ్ బీజ్, ఓషన్ బ్లూ వంటి రంగులలో ఇది లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఇది 17 కి.మీ నుండి 24 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9 స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. 5 సీట్ల కెపాసిటీ, 382 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

నెక్సాన్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 30, 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 275 కి.మీ నుండి 489 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.
నెక్సాన్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పంచ్ మైక్రో ఎస్‌యూవీ కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తోంది. పంచ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.50 లక్షల నుండి గరిష్ఠంగా రూ.9.30 లక్షల వరకు ఉంటుంది. ట్రాపికల్ మిస్ట్, ఆర్కస్ వైట్, డేటోనా గ్రే, టోర్నాడో బ్లూ, కాలిప్సో రెడ్ వంటి రంగులలో లభిస్తుంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 18 కి.మీ నుండి 27 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, సన్‌రూఫ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. పంచ్ ఈవీ ధర రూ.9.99 లక్షల నుండి రూ.14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 25, 35 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 315 కి.మీ నుండి 421 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








