మేడ్ ఇన్ ఇండియా కార్లే కావాలంటున్న విదేశీయులు.. గ్లోబల్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్న నిస్సాన్

నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో కేవలం ఒకే ఒక కారును అమ్ముతోంది. అదే నిస్సాన్ మాగ్నైట్. ఈ కారు భారత మార్కెట్‌లో హిట్‌ అయ్యి, మంచి అమ్మకాలను సాధిస్తున్నప్పటికీ ఈ సంస్థ ఇప్పుడు ఎగుమతులలో కొత్త రికార్డు సృష్టించింది. భారత ప్రజలే కాకుండా విదేశీయులు కూడా ఈ కారును వెతికి వెతికి కొనుక్కుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

ఎగుమతుల్లో నిస్సాన్ కొత్త రికార్డు
నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ ఇండియాలో మాగ్నైట్ అనే కారును మాత్రమే అమ్ముతోంది. ఇండియాలో తయారవుతున్న ఈ కారు ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. దీని ద్వారా విదేశీయులు కూడా ఈ ప్రొడక్ట్‌ను ఇష్టపడి కొనుక్కుంటున్నారు. విదేశీ ఎగుమతులలో ఈ కంపెనీ కొత్త రికార్డు సృష్టించింది.

Foreigners Insist on Made-in-India Cars Nissan Sells 1 2 Million Units Globally

ఈ కంపెనీ మొత్తం 12 లక్షల వాహనాలను ఎగుమతి చేసి రికార్డు సాధించింది. ఈ ఎగుమతులన్నీ చెన్నైలోని కామరాజర్ పోర్ట్ ద్వారానే విదేశాలకు వెళ్తున్నాయి. ఈ కంపెనీ ఇండియాలో మాగ్నైట్ కారును మాత్రమే తయారు చేసి అమ్ముతున్నప్పటికీ, ఎగుమతుల కోసం ఇతర కార్లను కూడా తయారు చేస్తుంది.

65 దేశాలకు నిస్సాన్ కార్ల ఎగుమతి
ఈ కంపెనీ మాగ్నైట్ బి, సన్నీ సెడాన్, కిక్స్ ఎస్‌యూవీ, మైక్రా హ్యాచ్‌బ్యాక్ వంటి కార్లను ఎగుమతి కోసం తయారు చేస్తుంది. ఈ కార్లు వివిధ దేశాలకు ఎగుమతి అవుతాయి కాబట్టి ఈ కార్లలో కుడి, ఎడమ వైపు డ్రైవ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రస్తుతం 65 దేశాలకు తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఇందులో ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలు, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా ప్రాంతాలు ఉన్నాయి.

Foreigners Insist on Made-in-India Cars Nissan Sells 1 2 Million Units Globally

మాగ్నైట్‌కు 5 స్టార్ రేటింగ్
ఈ కంపెనీ అధిక సంఖ్యలో మాగ్నైట్ కారునే ఎగుమతి చేస్తోంది. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. మొత్తం 55 రకాల ఫీచర్లను అభివృద్ధి చేశారు. ఈ కంపెనీ త్వరలో టెగ్టాన్ అనే పేరుతో కొత్త ఎస్‌యూవీ కారును మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇది రెనాల్ట్ డస్టర్ కారు ఆధారంగా తయారు అవుతోంది.

రెనాల్ట్, నిస్సాన్ టెక్నాలజీ షేరింగ్
రెనాల్ట్, నిస్సాన్ కంపెనీల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. ఈ రెండు బ్రాండ్ కార్లు ఒకే ప్లాంట్‌లో తయారవుతాయి. ఈ రెండు కంపెనీలు తమ టెక్నాలజీలను పంచుకుంటాయి. దీని వల్ల రెనాల్ట్ బ్రాండ్‌లో వచ్చే కారు నిస్సాన్ బ్రాండ్‌లోనూ, నిస్సాన్ బ్రాండ్‌లో వచ్చే కారు రెనాల్ట్ బ్రాండ్‌లోనూ తయారవుతాయి.

Foreigners Insist on Made-in-India Cars Nissan Sells 1 2 Million Units Globally

ప్రస్తుతం రెనాల్ట్ కంపెనీ డస్టర్ అనే కారును తయారు చేసి అమ్మకాల కోసం తీసుకురాబోతోంది. వచ్చే జనవరి 26న ఈ కారు అమ్మకాల కోసం పరిచయం అవుతుంది. ఇదే కారును కొద్దిగా మార్పులు చేసి టెగ్టాన్ అనే పేరుతో ఇండియాలో నిస్సాన్ కంపెనీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని వల్ల ప్రజలు ఈ రెండు కార్లను ఇష్టపడి కొనే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఇండియాలో ప్రస్తుతం వాహనాల తయారీ అద్భుతంగా ఉంది కాబట్టి, ఇండియన్ ప్రొడక్ట్స్‌పై ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంది. భవిష్యత్తులో ఈ కార్లన్నీ అద్భుతంగా అమ్ముడవుతాయని ఆశించవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, October 31, 2025, 10:06 [IST]
English summary
Foreigners insist on made in india cars nissan sells 1 2 million units globally
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+