పిడుగుపడ్డా, భూకంపం వచ్చినా ఫుల్ సేఫ్.. మీరు భద్రంగా ఉండాలంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ కార్లే కొనండి

కొత్త కార్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రస్తుతం చాలా మంది డిజైన్, మైలేజీ, ఫీచర్లతో పాటు ఇప్పుడు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసమే కార్ల తయారీ కంపెనీలు తమ వాహనాలలో సేఫ్టీ ప్రమాణాలను పెంచుతున్నాయి. గతంలో సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మారుతి సుజుకీ లాంటి టాప్ కంపెనీ కూడా ప్రస్తుతం క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగులు సాధిస్తోంది.

కాబట్టి మీరు కూడా సేఫ్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇటీవల జీఎస్టీ సంస్కరణలలో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి మీకు నచ్చిన మోడళ్లకు మీరు అనుకున్న దానికంటే కూడా ధరలు తగ్గుతాయి.

From Maruti to Mahindra How Indian Cars Are Achieving 5-Star Safety

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)
సెడాన్ కార్లలో అందరికీ నచ్చిన మోడల్ మారుతి సుజుకి డిజైర్. కొత్త మోడల్ విడుదలైన తర్వాత దీని ప్రజాదరణ మరింత పెరిగింది. డిజైర్ బేస్ స్పెక్ LXI 1.2L 5MT వేరియంట్‌ను భారత్ NCAP టెస్ట్ చేసింది. ఈ పరీక్షలో డిజైర్‌కు పెద్దల, పిల్లల భద్రతలో 5-స్టార్ రేటింగ్ లభించింది.

పెద్దల భద్రతలో 32కి 29.46 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 41.57 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రత కోసం ISOFIX యాంకర్లు, ఇంటిగ్రేటెడ్ సీఆర్‌ఎస్, ఎయిర్‌బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీల విషయంలో డిజైర్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఇతర సిస్టమ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి.

From Maruti to Mahindra How Indian Cars Are Achieving 5-Star Safety

మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx)
భారతీయ బ్రాండ్ మహీంద్రా విషయానికి వస్తే.. ఆఫ్ రోడ్ ప్రియుల ఫేవరేట్ మోడల్ థార్ రాక్స్. ఇది ఆఫ్ రోడ్ లోనే కాదు.. క్రాష్ టెస్టులో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. పెద్దల భద్రతలో 32కి 31.09 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.

భారత్ NCAPలో థార్ రాక్స్ AX5L, MX3 వేరియంట్‌లను టెస్ట్ చేసి చూశారు. ఇందులో ఫ్రంటల్ ఆఫ్-సెట్ టెస్ట్‌లో 16కి 15.09 పాయింట్లు, సైడ్ మూవబుల్ టెస్ట్‌లో 16కి 16 పాయింట్లు సాధించింది. ఈ కారు డ్రైవర్ ఛాతీ, కాళ్ళకు మంచి రక్షణ అందిస్తుందని, ప్రమాద సమయంలో అన్ని శరీర భాగాలకు మంచి రక్షణ ఇస్తుందని రుజువైంది.

4X2, 4X4 డ్రైవ్ ఆప్షన్లతో వచ్చే ఈ 5-డోర్ ఎస్‌యూవీ ధర రూ.12.99 లక్షల నుండి రూ.22.49 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

From Maruti to Mahindra How Indian Cars Are Achieving 5-Star Safety

స్కోడా కుషాక్ (Skoda Kushaq)
చెక్ రిపబ్లిక్ కంపెనీ స్కోడా దగ్గర కూడా సేఫ్టీలో ముందుండే మోడల్ ఉంది. భారత్ NCAP సేఫ్టీ టెస్టుల్లో స్కోడా కుషాక్, పెద్దల, పిల్లల భద్రతలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. పెద్దల భద్రతలో 32కి 30.88 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌లు కుషాక్ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి.

ఈ కారు AIS-100 పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ ప్రమాణాలను కూడా పాటిస్తుంది. ఇందులో ADAS టెక్నాలజీ లేనప్పటికీ, క్రాష్ టెస్టులో ఇది అద్భుతమైన ప్రదర్శన చేసింది. కుషాక్ ధర రూ. 7.89 లక్షల నుండి రూ. 14.40 లక్షల వరకు ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : భారత మార్కెట్లో భద్రతకు ప్రాధాన్యత పెరిగింది. మారుతి సుజుకి, మహీంద్రా, స్కోడా వంటి కంపెనీలు 5-స్టార్ రేటింగ్‌తో కార్లను అందిస్తున్నాయి. ఇది వినియోగదారులకు ఒక శుభవార్త. ధర తగ్గుదల కూడా ప్రజలను సురక్షితమైన కార్లను కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. భద్రత విషయంలో రాజీపడకుండా మీ అవసరాలకు తగిన కారును ఎంచుకోవడం మంచిది.

More from DriveSpark

Article Published On: Monday, September 22, 2025, 7:19 [IST]
English summary
From maruti to mahindra how indian cars are achieving 5 star safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+