ఇందుల పోతే విమానంలో పోయినట్లే ఉంటుంది.. ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 460కిమీ.. ఎంజీ కొత్త కారు వచ్చేస్తోంది

ఎలక్ట్రిక్ వాహనాలతో భారతదేశంలో సంచలనాలు సృష్టిస్తున్న ఎంజీ మోటార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా మూలాలు ఉన్నప్పటికీ, బ్రిటిష్ వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ బ్రాండ్‌ను భారతీయులు సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ZS EV, కామెట్ EV, విండ్‌సర్ EV అనే మూడు ఎలక్ట్రిక్ కార్లు కంపెనీ శ్రేణిలో ఉన్నాయి.

వీటిలో విమానంలోని బిజినెస్ క్లాస్ తరహా ప్రయాణ అనుభూతినిచ్చే విండ్‌సర్ SUV భారీ విజయాన్ని సాధించింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న EVగా ఇది వరుసగా ఆరో నెల కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు MG విండ్‌సర్ EVకి సరికొత్త మోడల్‌ను అందించడానికి సిద్ధమవుతోంది. అదే విండ్‌సర్ ప్రో. ఈ వేరియంట్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే అన్ని విషయాల్లోనూ 'ప్రో'గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

MG Windsor EV Pro Side

కొత్త బ్యాటరీ ప్యాక్, స్టైల్, ఎక్కువ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో రాబోతున్న ఈ మోడల్‌ను మే 6న భారతదేశంలో విడుదల చేయనున్నారు. కొత్త ప్రో వేరియంట్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొన్ని ప్రీమియం టెక్నాలజీలను ఇందులో చేర్చవచ్చు.

ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లలో స్వల్పంగా స్టైలింగ్ మెరుగుదలలతో పాటు, కొత్త విండ్‌సర్ EV ప్రోలో వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్ సిస్టమ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది చిన్న పరికరాలను ఛార్జ్ చేయడమే కాకుండా, ఇంటికి ఒక జనరేటర్‌గా కూడా పనిచేయగలగడం విశేషం. అంతేకాకుండా, ప్రస్తుత స్టాండర్డ్ వేరియంట్‌లలో లేని ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీటు, లెవెల్ 2 ADAS వంటి ప్రత్యేకతలను కూడా MG విండ్‌సర్ EV ప్రోలో కంపెనీ అందించనుంది.

MG Windsor EV Pro Price

కొత్త MG విండ్‌సర్ ప్రో ప్రస్తుత టాప్-స్పెక్ ఎసెన్స్ వేరియంట్ కంటే పైన స్థానం పొందుతుంది. కాబట్టి డిజిటల్ కన్సోల్, 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, రిక్లైనబుల్ వెనుక సీటు, 9-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో కూడా ఉంటాయి.

కొత్త విండ్‌సర్ ప్రో వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందిస్తుందని MG చెబుతోంది. ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ వాహనం రానుంది. ఇండోనేషియాలో క్లౌడ్ EV పేరుతో విక్రయిస్తున్న విండ్‌సర్‌కు ఒకే ఛార్జ్‌పై 460 కిలోమీటర్ల (CLTC) రేంజ్ ఇవ్వగల 50.6 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కొత్త ప్రో వేరియంట్‌తో ఈ బ్యాటరీని విడుదల చేసే అవకాశం ఉంది.

MG Windsor EV Pro Teaser

ప్రస్తుత విండ్‌సర్ EVలోని 38 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 332 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే ఇవ్వగలదు. కొత్త బ్యాటరీ ప్యాక్ వస్తున్నప్పటికీ, పనితీరు గణాంకాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 134 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను కంపెనీ యథాతథంగా కొనసాగించనుంది.

విండ్‌సర్ ప్రో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BaaS) స్కీమ్ కింద విక్రయానికి వస్తుందా లేదా పూర్తి ధరకే విక్రయిస్తారా అనేది వేచి చూడాలి. BaaS ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే ప్రస్తుత విండ్‌సర్‌కు 10లక్షల నుండి 12 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. బదులుగా, మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటర్‌కు డబ్బు చెల్లించవచ్చు. అదే సమయంలో, మీరు బ్యాటరీని కూడా కొనుగోలు చేస్తే కారు ధర 14 లక్షల నుండి 16 లక్షల వరకు ఉంటుంది.

MG విండ్‌సర్ EV అమ్మకాలు ఇటీవల భారతదేశంలో 20,000 యూనిట్లను దాటాయి. విడుదలైన ఆరు నెలల్లోనే ఈ వాహనం ఈ మైలురాయిని చేరుకుంది. కొత్తగా ప్రారంభించిన 'MG సెలెక్ట్' ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా తమ శ్రేణిని బలోపేతం చేయడానికి MG ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, సైబర్‌స్టర్ టూ-డోర్ ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కార్, M9 ప్రీమియం MPV రాబోయే నెలల్లో మార్కెట్‌లోకి రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, May 4, 2025, 10:50 [IST]
English summary
Go further on a single charge mgs electric car with 460km range and pro features is coming
Read more on: #mg motor #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+