ఇన్నోవా కంటే ఫీచర్లు ఎక్కువ..అయినా ఈ కారును కొనడానికి ముందుకు రావడం లేదు..కారణం అదేనా ?

హ్యుందాయ్, భారతదేశంలో మారుతి సుజుకి తర్వాత అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీదారుగా ఉంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మోడళ్లను విడుదల చేయడంలో హ్యుందాయ్ ముందుంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన 7-సీటర్ మోడల్ హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar), టయోటా ఇన్నోవా (Toyota Innova) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. ముఖ్యంగా ఫీచర్ల విషయంలో అల్కజార్ ఇన్నోవా కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ అల్కజార్‌కు మార్కెట్‌లో ఆశించినంత స్పందన లభించడం లేదు.

2025 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. అల్కజార్ అమ్మకాలు భారీగా తగ్గాయి. గత నెలలో ఈ SUV కేవలం 840 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2024 నవంబర్‌లో అమ్ముడైన 2,134 యూనిట్లతో పోలిస్తే, వార్షిక అమ్మకాల్లో 60.64 శాతం పతనం నమోదైంది. ఈ కారు MPV ప్రాక్టికాలిటీ, SUV స్టైల్‌ను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. అయితే ఇదే విభాగంలో కియా కారెన్స్ (Kia Carens) వంటి కొత్త పోటీదారులు రావడంతో అమ్మకాలు తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Hyundai Alcazar Sales Dip 60 Despite Being Feature-Rich Sales Hit Hard by Increased Competition

హ్యుందాయ్ అల్కజార్ కారు 6-సీటర్ (కెప్టెన్ సీట్లతో), 7-సీటర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది, కానీ పొడవు, వీల్‌బేస్ పెరిగింది. ఈ కారు మొత్తం పొడవు 4,560 మిమీ, వెడల్పు 1,800 మిమీ, ఎత్తు 1,700 మిమీ, వీల్‌బేస్ 2,760 మిమీ. దీనివల్ల మూడవ వరుసలో కూడా ప్రయాణికులకు తగినంత స్పేస్ లభిస్తుంది.

దీని ఎక్స్‌-షోరూమ్ ధర రూ.14.47 లక్షల నుంచి రూ.21.10 లక్షల వరకు ఉంది. ఈ మధ్యకాలంలో జీఎస్టీ తగ్గింపు కారణంగా ధరలో స్వల్ప తగ్గింపు కూడా లభించింది. డిజైన్ పరంగా, H-ఆకారపు LED DRLలు, పవర్ఫుల్ క్వాడ్ బీమ్ LED హెడ్‌లైట్‌లు, క్లియర్ గ్రిల్, మందపాటి స్కిడ్ ప్లేట్లు, 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

Hyundai Alcazar Sales Dip 60 Despite Being Feature-Rich Sales Hit Hard by Increased Competition

ఫీచర్ల విషయానికి వస్తే అల్కజార్ తన విభాగంలోనే అత్యుత్తమమైనదిగా నిలుస్తుంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండవ వరుసలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు ఇన్నోవాతో పోలిస్తే చాలా ఎక్కువ, ఆకర్షణీయమైనవి.

హ్యుందాయ్ అల్కజార్ రెండు పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది, ఇవి పర్ఫామెన్స్, ఇంధన సామర్థ్యం రెండింటిలోనూ అద్భుతంగా ఉన్నాయి:
1.5 లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్: ఇది 158 bhp శక్తిని, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఈ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 17.5 కి.మీ నుంచి 18 కి.మీ వరకు ఉంటుంది.

Hyundai Alcazar Sales Dip 60 Despite Being Feature-Rich Sales Hit Hard by Increased Competition

1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్: ఇది 114 bhp శక్తిని, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. డీజిల్ మాన్యువల్ వేరియంట్‌కు 20.4 కి.మీ అత్యుత్తమ మైలేజ్ వస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. ఇది డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో 18.1 కి.మీగా ఉంది.

అధిక మైలేజ్, మంచి పవర్, ఫీచర్లు ఉన్నప్పటికీ అల్కజార్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. కియా కారెన్స్ (Kia Carens), మహీంద్రా XUV700, ఎంజీ హెక్టార్ ప్లస్ (MG Hector Plus),టాటా సఫారి (Tata Safari) వంటి మోడళ్లతో ఇది నేరుగా పోటీ పడుతోంది. ఈ పోటీ కారణంగానే అల్కజార్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 16, 2025, 11:55 [IST]
English summary
Hyundai alcazar sales dip 60 despite being feature rich sales hit hard by increased competition
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+