బ్రెజ్జా, నెక్సాన్ అన్నీ ఈ ఎస్యూవీ ముందు గులాంలే.. నంబర్ 1 SUVగా మరోసారి చరిత్ర సృష్టించిన క్రెటా మోడల్

భారతదేశంలో కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. జూలై 2025 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితా బయటికి వచ్చింది. ఈ జాబితాలో మరోసారి హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ జాబితాలో బ్రెజా, నెక్సాన్, పంచ్ వంటి పాపులర్ ఎస్‌యూవీలు ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. టాప్-10లో కేవలం నాలుగు మోడళ్లకు మాత్రమే అమ్మకాల్లో వృద్ధి కనిపించింది.

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు చాలా మంది చిన్న కార్లకు బదులుగా, SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ SUV సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వచ్చినా, ఒక మోడల్ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అదే హ్యుందాయ్ క్రెటా. జూలై 2025 నెల అమ్మకాలలో కూడా క్రెటా తన ఆధిపత్యాన్ని చాటుకుని, మళ్ళీ నంబర్ 1 స్థానంలో నిలిచింది.

Hyundai Creta Dominates SUV Segment Surpasses Brezza Scorpio and Nexon

ఈ జాబితాలో టాటా, మారుతి, మహీంద్రా, కియా వంటి ప్రముఖ కంపెనీల కార్లు కూడా ఉన్నాయి. అయితే, చాలా కార్లు అమ్మకాలలో తగ్గుదల చూపిస్తే, కేవలం నాలుగు మోడల్స్‌కి మాత్రమే మంచి వృద్ధి లభించింది. జూలై 2025లో హ్యుందాయ్ క్రెటా ఏకంగా 16,898 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే, జూలై 2024లో దీని అమ్మకాలు 17,350 యూనిట్లుగా ఉన్నాయి. అంటే, దీనికి సంవత్సరానికి 3% క్షీణత ఎదురైంది.

అమ్మకాలలో తగ్గుదల ఉన్నప్పటికీ, నంబర్ 1 స్థానాన్ని మాత్రం క్రెటా వదులుకోలేదు. క్రెటా తర్వాత రెండో స్థానంలో మారుతి సుజుకి బ్రెజా నిలిచింది. దీని అమ్మకాలు 14,065 యూనిట్లు. ఇక మూడో స్థానంలో మహీంద్రా స్కార్పియో ఉంది, దీని అమ్మకాలు 13,747 యూనిట్లుగా నమోదయ్యాయి. స్కార్పియోకి 12% వృద్ధి లభించింది.

Hyundai Creta Dominates SUV Segment Surpasses Brezza Scorpio and Nexon

ఈ టాప్ 10 జాబితాలో నాలుగు కార్లకు మాత్రమే వృద్ధి లభించింది. వాటిలో, మహీంద్రా థార్ అత్యధికంగా 125% వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జూలై 2025లో దీని అమ్మకాలు 9,845 యూనిట్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే సమయంలో కేవలం 4,385 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రికార్డుతో థార్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.

ఇక మారుతి సుజుకి ఫ్రాంక్స్ 18% వృద్ధితో 12,872 యూనిట్లు అమ్ముడై నాలుగో స్థానంలో, టయోటా హైరైడర్ 19% వృద్ధితో 8,814 యూనిట్లు అమ్ముడై ఎనిమిదో స్థానంలో నిలిచాయి. టాటా మోటార్స్ నుంచి నెక్సన్ ఐదో స్థానంలో, పంచ్ ఆరో స్థానంలో ఉన్నాయి. అయితే, ఈ రెండు మోడల్స్ అమ్మకాలలో తగ్గుదల చూశాయి. టాటా నెక్సన్ అమ్మకాలు 8% తగ్గి 12,825 యూనిట్లుగా, టాటా పంచ్ అమ్మకాలు ఏకంగా 33% తగ్గి 10,785 యూనిట్లుగా నమోదయ్యాయి.

Hyundai Creta Dominates SUV Segment Surpasses Brezza Scorpio and Nexon

కియా మోటార్స్ నుంచి సోనెట్ 19% తగ్గుదలతో 7,627 యూనిట్లు అమ్ముడై పదో స్థానంలో నిలిచింది. మొత్తం మీద చూసుకుంటే, ఈ జాబితాలో ఉన్న పది మోడల్స్‌లో ఆరు మోడల్స్‌కి అమ్మకాలలో తగ్గుదల కనిపించింది. ఈ గణాంకాలు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2025, 12:32 [IST]
English summary
Hyundai creta dominates suv segment surpasses brezza scorpio and nexon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+