11 నెలలుగా దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న ఈవీ కారు.. అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఎంజీ మోటార్ (MG Motor) ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2019లో భారతదేశంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, మొదటి నుంచీ ఆధునిక టెక్నాలజీతో కూడిన వాహనాలను పరిచయం చేస్తూ దృష్టిని ఆకర్షించింది. భారతదేశపు ప్రముఖ సంస్థ JSWతో విలీనం కావడం ద్వారా మరింత బలపడింది. ఈ భాగస్వామ్యం తర్వాత ఎంజీ మోటార్ తన దృష్టిని మరింతగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే కేంద్రీకరించింది. ఎంజీ తొలి ఎలక్ట్రిక్ కారు కామెట్ EV. మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కామెట్ EV భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారుగా పరిచయం అయింది.

చౌక ధరలో ఆధునిక ఫీచర్లు అందించడం వలన, కామెట్ EVకు మంచి ఆదరణ లభించింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ ఎంజీ మోటార్ తర్వాత విండ్సర్ EV అనే మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. విండ్సర్ EV లాంచ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక సీజనల్ విజయమే కాకుండా, వరుసగా 11 నెలలుగా ప్రతి నెలా అమ్మకాలు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

India Best Selling Electric Car Mg Windsor Ev

విండ్సర్ వరుసగా పదకొండవ నెల కూడా నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. విండ్సర్ EV వినియోగదారులలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా, EV మార్కెట్లో తన స్థానం బలంగా నిలబెట్టుకుంది. 2025 ఆగస్టు నెలలో మాత్రమే 4,511 విండ్సర్ EV కార్లు అమ్ముడవడం ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇది అత్యధిక నెలవారీ అమ్మకాలుగా ఉంది.

2024 సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో ప్రవేశించిన MG విండ్సర్ EV చాలా తక్కువ సమయంలోనే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రారంభం నుంచి వచ్చిన అద్భుతమైన ఆదరణ కారణంగా, ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు 41,000 యూనిట్లను దాటాయి. ఈ సంఖ్య నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న ప్రత్యర్థులతో పోలిస్తే చాలా ముందుండటమే కాకుండా, ఈ విభాగంలో MGను నాయకుడిగా నిలబెట్టింది.

India Best Selling Electric Car Mg Windsor Ev

ముఖ్యంగా, ఇతర కంపెనీల కాంపాక్, మిడ్-సైజ్ SUV మోడళ్లను సైతం సవాలు చేసే స్థాయిలో విండ్సర్ EV తన ప్రాబల్యాన్ని చూపిస్తోంది. MG యొక్క మరో విశేషం, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో మార్కెట్‌లో విశ్వాసాన్ని సంపాదించడమే. సగటున నెలకు 4,000కిపైగా వినియోగదారులు విండ్సర్ EVను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు, భారతీయ వినియోగదారుల ఎలక్ట్రిక్ కార్లపై పెరుగుతున్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది.

మెట్రో నగరాలే కాకుండా, టైర్-2 మార్కెట్లలో కూడా విండ్సర్ EVకు సమానంగా ఆదరణ లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం MG యొక్క విస్తృత డీలర్ నెట్‌వర్క్, సమృద్ధిగా ఉన్న సరఫరా. చాలా ఇతర ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా డెలివరీ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి విండ్సర్ EVలో లేదు. వాహన సరఫరాను సమతుల్యం చేయగలగడం వలన వినియోగదారులు మరింత విశ్వాసంతో బుకింగ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

India Best Selling Electric Car Mg Windsor Ev

దీంతో విండ్సర్ EV ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. నిరంతరంగా పెరుగుతున్న అమ్మకాలు, విస్తృతంగా లభించే డీలర్ సపోర్ట్, తక్షణ డెలివరీలతో MG విండ్సర్ EV భారత మార్కెట్‌లో ఒక గేమ్‌చేంజర్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఈ పెరుగుదల మరింత ఊపందుకోవడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

MG విండ్సర్ EVను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ ప్రత్యేకంగా BaaS (Battery-as-a-Service) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు కారు మొత్తం ధర చెల్లించాల్సిన అవసరం లేకుండా, బ్యాటరీని వేరుగా లీజుకు తీసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో కేవలం రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది సక్సెస్ కావడంతోనే దీన్ని కొనుగోలు చేయడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 4, 2025, 18:30 [IST]
English summary
India best selling electric car mg windsor ev more details inside
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+