భద్రతలో బ్రహ్మాస్త్రాలు.. భారత్‎లోని టాప్-5 సేఫ్ కార్లు ఇవే.. రాళ్లలాంటి నిర్మాణం..బుల్లెట్ ప్రూఫ్ సేఫ్టీ!

ఇటీవలి కాలంలో భారతదేశంలో కార్ల భద్రత గురించి ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది కొంచెం ఎక్కువ ధరైనా సరే, మంచి క్వాలిటీ, పటిష్టమైన నిర్మాణం ఉన్న కార్లను కొనుగోలు చేసేందుకే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రయాణీకుల వాహనాల భద్రతను పరీక్షించడానికి కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2023 డిసెంబర్‌లో భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు భారత్ ఎన్‌సీఏపీ 17 వాహనాలను పరీక్షించింది. వాటిలో భారతదేశంలోని టాప్-5 సురక్షితమైన కార్లు ఏవో వివరంగా తెలుసుకుందాం.

Mahindra Thar Roxx

1. కియా సైరోస్ (Kia Syros): అడల్ట్ ప్రొటెక్షన్‎లో 32 పాయింట్లకు 30.21 పాయింట్లను సాధించింది. పిల్లల ప్రయాణీకుల రక్షణలో 49 పాయింట్లకు 44.42 పాయింట్లను సాధించింది. కియా సైరోస్ పెట్రోల్ కారు ధర భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.9.50 లక్షల నుండి రూ.16.80 లక్షల వరకు ఉంది. డీజిల్ మోడల్ ధర రూ.11.30 లక్షల నుండి రూ.17.80 లక్షల వరకు ఉంది.

2. స్కోడా కైలాక్ (Skoda Kailaq): అడల్ట్ ప్రొటెక్షన్ లో 32 పాయింట్లకు 30.88 పాయింట్లను సాధించింది. పిల్లల ప్రయాణీకుల రక్షణలో 49 పాయింట్లకు 45.00 పాయింట్లను సాధించింది. కైలాక్ దేశంలోనే అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. దీని ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.8.25 లక్షల నుండి రూ.13.99 లక్షల వరకు ఉంది.

Kia Syros

3. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx): అడల్ట్ ప్రొటెక్షన్ లో 32 పాయింట్లకు 31.09 పాయింట్లను సాధించింది. పిల్లల రక్షణలో 49 పాయింట్లకు 45.00 పాయింట్లను సాధించింది. థార్ రాక్స్ కారు ధర భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.12.99 లక్షల నుండి రూ.23.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఈ థార్ రాక్స్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్, టీపీఎంఎస్, 4 డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Mahindra

4. మహీంద్రా బీఈ 6 (Mahindra BE6): అడల్ట్ ప్రొటెక్షన్ లో 32 పాయింట్లకు 31.97 పాయింట్లను సాధించింది. పిల్లల రక్షణలో 49 పాయింట్లకు 54 పాయింట్లను సాధించింది. బీఈ 6 ధర రూ.19.65 లక్షల నుండి రూ.27.65 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, 3-పాయింట్ సీట్ బెల్ట్, 360-డిగ్రీ కెమెరాలతో స్టాండర్డ్‌గా వస్తుంది.

5. మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ (Mahindra XEV 9e): మహీంద్రా కంపెనీ తన ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌ఈవీ 9ఈని ఇటీవల విడుదల చేసింది. ఇది అడల్ట్ ప్రయాణీకుల రక్షణలో (ఏఓపీ) 32 పాయింట్లకు 32 పాయింట్లను సాధించి, భద్రతలో అగ్రస్థానంలో నిలిచింది. పిల్లల ప్రయాణీకుల రక్షణలో (సీఓపీ) 49 పాయింట్లకు 45 పాయింట్లను సాధించింది.

ఎక్స్‌ఈవీ 9ఈ కారు ధర భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.22.65 లక్షల నుండి రూ.31.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ఏడీఏఎస్, 3-పాయింట్ సీట్ బెల్ట్, 360-డిగ్రీ కెమెరాలతో స్టాండర్డ్‌గా వస్తుంది. డ్రైవింగ్ రేంజ్, పర్ఫార్మెన్స్, భద్రతా ఫీచర్లతో భారీ అమ్మకాలను చూస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లు భారతీయ కార్ల సేఫ్టీ ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ టాప్-5 కార్లు చూపించిన ఫలితాలు వినియోగదారులకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రోత్సహిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని భారతీయ కార్లు ఈ జాబితాలో చేరాలని ఆశిస్తున్నాం.

More from DriveSpark

Article Published On: Sunday, June 15, 2025, 9:22 [IST]
English summary
Indias top 5 safest cars rock solid build bulletproof safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+