Kia Syros HDK Variant ఈ బేస్‌ వేరియంట్‌ కియా సైరోస్‌ కారులో బంభాట్‌ ఫీచర్లు.. ధర చాలా తక్కువ!

అనతి కాలంలోనే భారతీయ వినియోగదారులకు చేరువైన విదేశీ వాహన తయారీ సంస్థ కియా. ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ నెలకొల్పి వాహనాలను తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇటీవలే ఈ సంస్థ 'సైరోస్' పేరుతో కొత్త కారును లాంఛ్ చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన ఈ కారును అధునాతన ఫీచర్లను జోడించి తీసుకువచ్చిందీ సంస్థ. దీని (ఎక్స్- షోరూమ్) ధర రూ.9 లక్షల నుంచి రూ.17.80 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారును HDK, HDK Optional, HDK Plus, HDX, HDX Plus, HDX Plus Optional అనే ఆరు వేరియంట్లలో లాంఛ్ చేశారు. అయితే రూ.9 లక్షల్లో లభించే ఈ కారులో ఉండే ఫీచర్లు ఏంటో ఇప్పుడూ చూసేద్దాం.

ఈ సైరోస్ కారులోని HDK వేరియంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ధర రూ.9 లక్షలుగా ఉంటుందని సమచారం. ఈ ధర కియా సోనెట్ కంటే ఎక్కువ, కియా సెల్టోస్ మోడల్ కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ సైరోస్ HDK వేరియంట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

Kia Syros HDK Variants

ఒకవేళ ఈ కారులో డీజిల్ ఇంజిన్ కావాలని మీరు కోరుకుంటే మాత్రం వేరే వేరియంట్‌ను ఎంచుకోవాల్సిందే. అదే విధంగా ఈ HDK వేరియంట్ కారు మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో మాత్రమే ఉంటుంది. ఇక దీని అప్పీయరెన్స్ విషయానికి వస్తే.. ఈ కారులో ముందువైపున ప్రొజెక్టర్, హాలోజెన్ (halogen) హెడ్‌లైట్లు, ఇండికేటర్లు ఉంటాయి.

ఈ సైరోస్ HDK బేస్‌ వేరియంట్ అయినందున దీంట్లో LED DRLs లేవు. ఈ కారు కింది భాగాన రగ్డ్- లుక్ స్కిడ్ ప్లేట్ ఉంది. దానికంటే కింద.. మ్యాట్‌ బ్లాక్‌ కలర్‌లో బంపర్ ఉంది. దీని బానెట్ ఎడ్జెస్ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇదే తరహా బానెట్ సైరోస్ అన్ని వేరియంట్లలోనూ ఉంటుంది.

Kia Syros HDK Variant Price

ఈ కారు సైడ్‌ డిజైన్‌లోనూ అదరగొడుతుంది. ఇందులో Square-shaped వీల్ ఆర్చెస్ ఉన్నాయి. బ్లాక్ క్లాడింగ్‌తో ఇవి కనిపిస్తున్నాయి. ఇది బేస్‌ వేరియంట్ అయినప్పటికీ.. దీంట్లో 15- అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఈ కారు డోర్ల కింది భాగంలో సిల్వర్- కలర్డ్ స్కర్ట్స్ ఉన్నాయి.

ఈ సైరోస్ కారు HDK వేరియంట్‌లోని ఫ్రంట్ ఫీచర్ల విషయానికి వస్తే... దీంట్లో టర్న్ ఇండికేటర్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వెనుకవైపున A, C పిల్లర్స్ నలుపు రంగులో ఉన్నాయి. అంతేగాకుండా దీంట్లో స్మాల్ విండో పేన్స్ ఉండడం వల్ల రూఫ్‌కు ఫ్లోటింగ్ అప్పీయరెన్స్ ఇస్తోంది.

Kia Syros HDK Variant Mileage

దీని వెనుకవైపున షార్క్ ఫిన్ యాంటెన్నా, C-shaped LED టెయిల్‌ల్యాంప్స్, వర్టికల్ టెయిల్‌గేట్, టెయిల్‌ల్యాంప్స్ బంపర్‌కు రెండు వైపులా ఉన్నాయి. అలాగే బంపర్ కింద స్కిడ్ ప్లేట్ ఉంటుంది. ఇక కారులోపల రెక్టాంగ్యులర్ 2-spoke స్టీరింగ్ వీల్ ఉంటుంది. అలాగే ఇందులో ఇన్‌ఫోటెయిన్మెంట్, డ్యాష్ బోర్డుపైన ఇన్స్టుమెంట్ క్లస్టర్ స్క్రీన్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: కియా సంస్థ భారత్‌లో కొత్త ఎస్‌యూవీలను కొత్త అవతారంలో పరిచయం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కియా కార్ల కంటే చాలా మార్పులతో వీటిని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే.. ప్రస్తుతం కియా నుంచి వచ్చిన సైరోస్ కారులో ఈ HDK వేరియంట్‌ను రూ.9 లక్షల తక్కువ ధరతో తీసుకురావడం వల్ల చాలా మంది దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 7, 2025, 14:15 [IST]
English summary
Kia syros hdk available at just rs 9 lakh with top class features and performance
Read more on: #kia motor #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+