మన దేశంలో దీనిని కొనేవారు లేరు.. విదేశీ మార్కెట్లో మాత్రం రికార్డులు బద్దలు కొడుతున్న మేడ్ ఇన్ ఇండియా కారు

మన దేశంలో మహీంద్రా థార్ (Mahindra Thar) ముందు నిలబడలేక, పెద్దగా అమ్ముడుపోని మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ఎస్‌యూవీ, ఇప్పుడు విదేశీ మార్కెట్లలో మాత్రం దుమ్ము రేపుతోంది. ఒకప్పుడు జీప్సీకి ప్రత్యామ్నాయంగా 5-డోర్ల వెర్షన్‌లో భారతదేశంలో లాంచ్ అయిన జిమ్నీ, ఎక్కువ ధర, చిన్న సైజు కారణంగా భారతీయ కస్టమర్లను అంతగా ఆకర్షించలేకపోయింది.

అయితే, మారుతి సుజుకి తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం వల్ల ఈ మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. తాజాగా ఈ ఎస్‌యూవీ సాధించిన గ్లోబల్ రికార్డు వివరాలు, విదేశీయులకు ఇది ఎందుకు నచ్చిందో వివరంగా ఈ వార్తలో చూద్దాం.

Made in India Jimny 5-Door Becomes Global Favorite Exports Cross 1 Lakh Units in a Year

భారతదేశంలో మహీంద్రా థార్ వంటి లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన మారుతి సుజుకి జిమ్నీ (5-డోర్), ఇక్కడ మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. కానీ, మారుతి దీనిని విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకోవడం ఒక సంచలనంగా మారింది.

కంపెనీ ప్లాంట్ల నుండి తయారైన జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ, విడుదలైన ఏడాదిలోనే లక్ష యూనిట్ల ఎగుమతి మైలురాయిని అధిగమించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. ప్రస్తుతం జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి 100 కంటే ఎక్కువ దేశాలకు మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ ఎస్‌యూవీలను ఎగుమతి చేస్తున్నారు.

Made in India Jimny 5-Door Becomes Global Favorite Exports Cross 1 Lakh Units in a Year

ప్రపంచవ్యాప్తంగా సుజుకి ఉత్పత్తుల కోసం భారత్ ఇప్పుడు ఒక ముఖ్యమైన ఎగుమతి కేంద్రంగా మారింది. మారుతి సుజుకి నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న మోడళ్లలో, ఫ్రాంక్స్ తర్వాత జిమ్నీ 5-డోర్ రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు మోడళ్లు అంతర్జాతీయంగా మారుతి స్థానాన్ని బలోపేతం చేశాయి.

2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మారుతి సుజుకి 2 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరం కంటే సుమారు 40 శాతం ఎక్కువ. భారతదేశం మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి వాటా ఏకంగా 46 శాతం వరకు ఉంది.

Made in India Jimny 5-Door Becomes Global Favorite Exports Cross 1 Lakh Units in a Year

జిమ్నీ 5-డోర్ వెర్షన్ 2023లో విడుదలైన తర్వాత, దాని ప్రాక్టికాలిటీ విదేశీ కస్టమర్లను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది మొదట్లో జపాన్‌లో జిమ్నీ నోమాడ్ పేరుతో లాంచ్ అయినప్పుడు, దీని బుకింగ్‌లు కొద్ది రోజుల్లోనే 50,000 యూనిట్లు దాటాయి.

ఈ ఎస్‌యూవీ లాడర్-ఫ్రేమ్ ఛాసిస్పై నిర్మించబడింది. దీనికి సుజుకి ఆల్‌గ్రిప్ ప్రో 4WD సిస్టమ్ కూడా ఉంది. చిన్నగా, ఒద్దికగా ఉండటం వలన చిన్న పార్కింగ్ స్థలాల్లో కూడా సులభంగా పెట్టుకోవచ్చు. దీని కాంపాక్ట్ రూపం, ఆఫ్-రోడ్ కెపాసిటీనే విదేశీయులకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.

Made in India Jimny 5-Door Becomes Global Favorite Exports Cross 1 Lakh Units in a Year

జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. జిమ్నీలో 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 102 బీహెచ్‌పీ పవర్, 136 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎస్‌యూవీ 3,985 మి.మీ పొడవు, 1,645 మి.మీ వెడల్పు, 1,720 మి.మీ ఎత్తు, 2,590 మి.మీ వీల్‌బేస్ కలిగి ఉంది. సైజు చిన్నగా ఉండటం అనేది మన దేశంలో దీనికి లోపంగా కనిపించినా, ప్రపంచ మార్కెట్‌లో మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది.

More from DriveSpark

Article Published On: Friday, October 24, 2025, 9:37 [IST]
English summary
Made in india jimny 5 door becomes global favorite exports cross 1 lakh units in a year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+