థార్ రాక్స్‌తో దుమ్మురేపిన మహీంద్రా.. 5.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో రికార్డు
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ కాలంలో మొత్తం 5,51,487 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (FY24)లో నమోదైన 4,59,877 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 20 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఈ అద్భుతమైన విజయానికి ప్రధాన కారణం మహీంద్రా థార్ రాక్స్, స్కార్పియో ఎన్, XUV700 వంటి కొత్త మోడళ్లకు లభించిన విశేష ఆదరణ. ఏడాది చివరినాటికి వాహన్ రిజిస్ట్రేషన్లు కూడా 20 శాతం వృద్ధితో అత్యధికంగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.

మార్చి 2025లో మహీంద్రా మొత్తం 50,835వాహనాలను విక్రయించింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం ఎక్కువ. దేశీయ మార్కెట్‌లో 48,048 యూనిట్లు అమ్ముడయ్యాయి, గత ఏడాది మార్చిలో విక్రయించిన 40,631 యూనిట్లతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఎగుమతులు 2,787 యూనిట్లుగా ఉన్నాయి. విశేషంగా, మహీంద్రా XEV 9e, BE 6ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు కూడా మార్చి మధ్య నుంచి ప్రారంభమయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా సాధించిన ఇతర ముఖ్యమైన విజయాలలో SUVవిభాగంలో నంబర్ వన్ స్థానం , ఆదాయం పరంగా ప్యాసింజర్ వాహన తయారీదారులలో రెండవ స్థానం దక్కించుకోవడం ఉన్నాయి. ఈ సందర్భంగా మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజే నాక్రా మాట్లాడుతూ.. మార్చిలో తాము మొత్తం 48,048SUVలను 18 శాతం వృద్ధితో విక్రయించామని, అలాగే LCVలతో కలిపి మొత్తం 83,894 వాహనాలను 23 శాతం వృద్ధితో విక్రయించామని తెలిపారు.

"మేము మా ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUVల డెలివరీలను కూడా మొదలుపెట్టాము. వీటికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‌లో మొదటిసారిగా 5 లక్షలకు పైగా SUVలను విక్రయించడంతో ఈ సంవత్సరం చాలా సానుకూలమైన ముగింపును అందుకున్నాము" అని ఆయన అన్నారు. అమ్మకాల్లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందని అన్నారు. అమ్మకాలలో థార్ రాక్స్ దోహదపడిందన్నారు.
మహీంద్రా మొట్టమొదటి స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు అయిన XEV 9e, BE 6 డెలివరీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు SUVల టాప్-స్పెక్ వేరియంట్‌లు మాత్రమే (ప్యాక్ త్రీ) డెలివరీ అవుతున్నాయి. మహీంద్రా XEV 9e ప్యాక్ త్రీ ధర రూ.30.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, అయితే మహీంద్రా BE 6 ప్యాక్ త్రీ ధర రూ.26.90 లక్షలుగా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం.

మహీంద్రా XEV 9e, BE 6ప్యాక్ త్రీ రెండూ 79 kWhబ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి. దీనితో BE 6ఒకే ఛార్జ్‌పై 682 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే పెద్దదైన XEV 9e ఒకే ఛార్జ్‌పై 656 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా, 79 kWhబ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ రెండు SUVలు 285 bhp శక్తిని, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








