80ఏళ్ల తర్వాత ఊహించని విజయం అందుకున్న మహీంద్రా.. అమ్మకాల్లో రికార్డుల మోత

మనదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలలో ఒకటైన మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra) మొదట్లో వాణిజ్య వాహనాలు, వ్యవసాయ పరికరాల విక్రయాలలో నిమగ్నమై ఉండేది. ఆ తరువాత కార్లను ఉత్పత్తి చేసి విక్రయించడం ప్రారంభించింది. గత కొన్ని సంవత్సరాలుగా కార్ల విక్రయాలలో మహీంద్రా ఆధిపత్యం పెరగడం మొదలైంది.

ప్రత్యేకించి 2024 సంవత్సరం కార్ల వ్యాపారంలో మహీంద్రాకు చాలా మంచి సంవత్సరంగా చెప్పవచ్చచు. దాని ఫలితంగా 2025 ఫిబ్రవరి నెలలో కార్ల విక్రయాలలో మహీంద్రా రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Mahindra And Mahindra XEV

సాధారణంగా మారుతి సుజుకి (Maruti Suzuki), హ్యుందాయ్ (Hyundai), టాటా మోటార్స్ (Tata Motors) సంస్థల తరువాత నాల్గవ స్థానంలో ఉండే మహీంద్రా ఫిబ్రవరి నెల విక్రయాలలో హ్యుందాయ్, టాటా సంస్థలను అధిగమించి రెండవ స్థానాన్ని దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ నేపథ్యంలో 2025 మార్చి నెలలో మహీంద్రా & మహీంద్రా సంస్థ విక్రయించిన వాహనాల సంఖ్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2025 మార్చి నెలలో మహీంద్రా & మహీంద్రా మొత్తం 83,894 వాహనాలను విక్రయించింది.

Mahindra And Mahindra

ఇందులో దేశీయంగా విక్రయించిన మహీంద్రా వాహనాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసిన మహీంద్రా వాహనాల సంఖ్య కూడా ఉంది. అలాగే ఈ 83,894 సంఖ్యలో కార్లతో పాటు మహీంద్రా వాణిజ్య వాహనాల విక్రయాల సంఖ్య కూడా ఉంది. గత 2024 సంవత్సరంలో మహీంద్రా విక్రయించిన వాహనాల సంఖ్య కంటే ఈ 83,894 సంఖ్య 23శాతం ఎక్కువ.

మార్చి 2025లో విక్రయించిన మహీంద్రా కార్ల సంఖ్య 50,835. ఇందులో దేశీయంగా విక్రయించిన మహీంద్రా కార్ల సంఖ్య 48,048. గతేడాది అంటే 2024 మార్చి నెలలో మహీంద్రా భారతీయ మార్కెట్‌లో కేవలం 40,631 కార్లను మాత్రమే విక్రయించింది.

Mahindra And Mahindra Auto

ఈ విధంగా చూస్తే మహీంద్రా కార్ల దేశీయ విక్రయాలు గతేడాది మార్చితో పోలిస్తే ఈ సంవత్సరం మార్చిలో 18శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాల విక్రయాల విషయానికి వస్తే గత మార్చి నెలలో మహీంద్రా & మహీంద్రా దేశీయంగా మొత్తం 23,951 వాణిజ్య వాహనాలను విక్రయించింది.

గత సంవత్సరం మార్చి నెలలో మహీంద్రా దేశీయంగా 20,930 వాణిజ్య వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం మార్చిలో మహీంద్రా 3,021 వాణిజ్య వాహనాలను అదనంగా విక్రయించింది.

Mahindra And Mahindra Thar

ఈ వాణిజ్య వాహనాలలో రెండు టన్నుల కంటే తక్కువ బరువు కలిగిన వాణిజ్య వాహనాలు, 2 టన్నుల నుంచి 3.5 టన్నుల వరకు బరువు కలిగిన వాణిజ్య వాహనాలు, 3.5 టన్నుల కంటే ఎక్కువ బరువు కలిగిన కమర్షియల్ వెహికల్స్ అనే 3 రకాల వాణిజ్య వాహన విభాగాలు ఉన్నాయి. మహీంద్రా 3-చక్రాల వాహనాలను కూడా విక్రయిస్తోంది.

2 టన్నుల కంటే తక్కువ బరువు కలిగిన మహీంద్రా వాణిజ్య వాహనాలు గత మార్చి నెలలో మొత్తం 3530 యూనిట్లను విక్రయించింది . అయితే 2024 మార్చిలో ఈ వాహనాలు 4012 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీని ప్రకారం చూస్తే 2 టన్నుల కంటే తక్కువ బరువు కలిగిన మహీంద్రా వాణిజ్య వాహనాల విక్రయాలు 12శాతం తగ్గాయి.

Mahindra And Mahindra XUV

తరువాత 2 టన్నుల నుంచి 3.5 టన్నుల బరువు కలిగిన మహీంద్రా వాణిజ్య వాహనాలు గత మార్చి నెలలో మొత్తం 18,958 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024 మార్చి నెలలో ఈ వాహనాలు 15,387 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ విధంగా ఈ విభాగపు వాణిజ్య వాహనాల విక్రయాలు 23శాతం పెరిగాయి.

3.5 టన్నుల కంటే ఎక్కువ బరువు కలిగిన భారీ వాణిజ్య వాహనాలను గత నెలలో మహీంద్రా మొత్తం 1463 యూనిట్లు అమ్మింది. గత సంవత్సరం మార్చి నెలలో ఈ భారీ వాహనాలు 1531 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ విధంగా చూస్తే మహీంద్రా భారీ వాహనాల విక్రయాలు 4శాతం తగ్గాయి.

Mahindra Sales

మహీంద్రా త్రీ వీలర్ వెహికల్స్ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మహీంద్రా మొత్తం 7752 3-చక్రాల వాహనాలను విక్రయించింది. 2024 మార్చి నెలలో కేవలం 5279 మహీంద్రా త్రీ వీలర్ వెహికల్స్ మాత్రమే విక్రయించబడ్డాయి. దీని ప్రకారం చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే మహీంద్రా త్రీ వీలర్ వాహనాల విక్రయాలు సగానికి పైగా పెరిగాయి.

భారతదేశంలో ఉత్పత్తి చేసే వాహనాలను మహీంద్రా సంస్థ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. అయితే ఆ సంఖ్య చాలా తక్కువ. గత మార్చి నెలలో మహీంద్రా మనదేశం నుంచి విదేశాలకు మొత్తం 4143 వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది. ఇది కూడా పర్వాలేదు. 2024 మార్చి నెలలో కేవలం 1573 మహీంద్రా వాహనాలు మాత్రమే విదేశాలకు ఎగుమతి అయ్యాయి.

ఈ విధంగా చూస్తే మహీంద్రా విదేశీ ఎగుమతులు దాదాపు 163శాతం పెరిగాయి. ఈ ఎగుమతుల సంఖ్యలో మహీంద్రా కార్లు, వాణిజ్య వాహనాలు, త్రీ వీలర్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా సంస్థ అన్ని విభాగాల నుంచి కొద్దికొద్దిగా విదేశాలకు ఎగుమతి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : కార్ల విక్రయాలు, వాణిజ్య వాహనాల విక్రయాలు ఇలా అన్ని విభాగాలలో మహీంద్రా ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. దీనికి మహీంద్రా ఇటీవల తీసుకున్న చర్యలు ప్రధాన కారణం.

అయితే గత నెలలో 2 టన్నుల కంటే తక్కువ బరువు కలిగిన వాణిజ్య వాహనాల విక్రయాలు తగ్గడాన్ని మహీంద్రా తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటుంది. అలాగే గత జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే గత మార్చి నెలలో కార్ల విక్రయాలు కొద్దిగా తగ్గడాన్ని కూడా సరిచేయడానికి ప్రయత్నిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 4, 2025, 9:39 [IST]
English summary
Mahindra achieves record vehicle sales in march 2025 shows significant growth across segments
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+