మహీంద్రా ఇవన్నీ చూసి కాస్త నేర్చుకోవయ్యా.. అదిరిపోయిన థార్ రాక్స్ ఇంటీరియర్ కస్టమైజేషన్!

మన దేశంలో కారు ప్రియులు తమ వాహనాలను తమ అభిరుచులకు అనుగుణంగా మార్చేయడంలో దిట్టలు. కొన్నిసార్లు కారు తయారుచేసిన కంపెనీని కూడా ఆశ్చర్యపరిచే విధంగా మార్పులు చేస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ పొందుతుంది. అదే మహీంద్రా థార్ రాక్స్ కు సంబంధించినది.

ఈ కారుకు బయటి భాగంలోనే కాకుండా, లోపలి భాగంలో కూడా చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా లోపలి భాగంలో చేసిన కొన్ని మార్పులు చూస్తే మహీంద్రా కంపెనీ కూడా వీటిని నేర్చుకోవాలనిపిస్తుంది. అసలు ఈ థార్ రాక్స్‌లో ఏమేం మార్పులు చేశారు? వివరంగా ఈ వార్తలో చూద్దాం.

Mahindra Thar Roxx

థార్ రాక్స్ టాప్-ఎండ్ వేరియంట్లో అనూహ్య మార్పులు చేశారు. వాహన యజమాని ఎలాంటి మార్పులు చేశారో వీడియోలో వివరంగా వివరించారు. థార్ రాక్స్ టాప్ అండ్ వేరియంట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అయితే, యజమాని వాహనం పిల్లర్లకు కూడా బ్లాక్ కలర్లు వేశారు. కార్ స్టైలిన్ (Car Stylein) అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.

స్టాక్ మోడల్లో మహీంద్రా క్రీమ్ రంగులో సీట్ల కవరింగ్ ఇవ్వడం వల్ల మెయింటెనెన్స్ కష్టం. అందుకే చాలా సార్లు సీట్లను తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేస్తారు. టాప్ ఎండ్ కాబట్టి పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు. అదనంగా ఎల్ఈడీ ఆంబియెంట్ లైట్స్ కూడా ఇచ్చారు. ఈ కారు వెనుక భాగంలో ఆహారం లేదా ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి రెండు ఉపయోగకరమైన ట్రేలు ఉన్నాయి. ఇది మహీంద్రా కంపెనీ గమనించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇతర వాహనాలలో దీన్ని ప్రయత్నించవచ్చు.

మహీంద్రా థార్ రాక్స్‌ను 6 మెయిన్ ట్రిమ్‌లలో, 18 రకాల్లో కొనుగోలు చేయవచ్చు. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బాటిల్‌షిప్ గ్రే, బర్న్ సిన్నా అనే 7 ఎక్స్‎టర్నల్ కలర్లలో కొనుగోలు చేయవచ్చు. రాక్స్ ఐవరీ, మోచా బ్రౌన్ అనే ఇంటర్నల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 3 డోర్స్ థార్‌తో పోలిస్తే రాక్స్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

Mahindra Thar Roxx

'6-ప్యాక్' గ్రిల్, న్యూ వీల్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ వంటివి రాక్స్ ప్రధాన ఎక్స్‌టీరియర్ హైలైట్స్. ఈ కారు ఇంటీరియర్‌లో మన ఇండియన్ బ్రాండ్ అనేక మోడ్రన్ ఫీచర్స్‌ను కూడా అమర్చింది. 2.2 లీటర్ ఎమ్-హాక్ డీజిల్, 2.0 లీటర్ ఎమ్-స్టాలియన్ పెట్రోల్ ఇంజిన్లు మహీంద్రా థార్ రాక్స్‌కు పవర్‌ను అందిస్తాయి. మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు.

రాక్స్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్‌ను చూస్తే.. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ ఏసీ వెంట్స్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, సింగిల్ పేన్, పనోరమిక్ సన్‌రూఫ్‌లు వంటివి ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో కూడా మహీంద్రా కాంప్రమైజ్ కాలేదు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ స్టాండర్డ్‌గా ఉన్నాయి. అలాగే, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లేన్ కీప్ అసిస్ట్, క్రూయిస్ కంట్రోల్ వంటి లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్‌ను కూడా రాక్స్‌లో ఇచ్చారు.

థార్ రాక్స్ బేస్ పెట్రోల్ వేరియంట్ ప్రైస్ రూ.12.99 లక్షలు. టాప్-ఎండ్ 4 WD వేరియంట్ ప్రైస్ రూ.23.09 లక్షలు. ఇవి డీలర్ వద్ద ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ కారు ఫోర్స్ గూర్ఖా, మారుతి సుజుకి జిమ్నీ వంటి 5 డోర్ల ఆఫ్-రోడర్ ఎస్‌యూవీలతో డైరెక్ట్‌గా కాంపిటీషన్ పడుతుంది. అదే సమయంలో మన దేశంలోని పాపులర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు కూడా రాక్స్ ఒక ఛాలెంజ్‌గా నిలుస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా థార్ రాక్స్‌లో చేసిన మోడిఫికేషన్స్ నిజంగా అద్భుతం. ముఖ్యంగా వెనుక భాగంలో ఇచ్చిన యూటిలిటీ ట్రేలు చాలా యూస్‌ఫుల్‌గా ఉన్నాయి. మహీంద్రా కంపెనీ కూడా ఇలాంటి క్రియేటివ్ ఫీచర్స్‌ను తమ వెహికల్స్‌లో ప్రొవైడ్ చేయాలని ఆశిస్తున్నాం. ఇది కారుకు మరింత వాల్యూను యాడ్ చేస్తుంది. ఈ కారు ప్రైస్, ఫీచర్స్, ఆఫ్-రోడింగ్ కెపాసిటీతో మంచి సక్సెస్ సాధిస్తుందనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 6, 2025, 13:33 [IST]
English summary
Mahindra should learn from this thar roxxs incredible interior customization
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+