మహీంద్రా థార్ రాక్స్ లో కీలక మార్పు - కస్టమర్ల కోరిక మేరకు కొత్త రంగు, నయా లుక్!

ఇండియాలో అమ్ముడవుతున్న అత్యంత పాపులర్‌ ఎస్‎యూవీలలో మహీంద్రా థార్ రాక్స్ ఒకటి. ఈ కారుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మహీంద్రా థార్ రాక్స్ మోడల్‌ పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. మహీంద్రా బెస్ట్ సెల్లింగ్ ఆఫ్-రోడ్ ఎస్‎యూవీ అయిన 3-డోర్స్ థార్ 2020 చివరిలో ప్రారంభించింది. అలాగే దాని 5 డోర్స్ వెర్షన్ కొత్త థార్ రాక్స్ ఆగస్టు 15, 2024న మార్కెట్లోకి వచ్చింది.

తాజాగా మహీంద్రా థార్ రాక్స్ వాహనానికి చాలా ముఖ్యమైన మార్పు చేసింది. మహీంద్రా ఇండియాలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ. మహీంద్రా కేవలం కమర్షియల్ వెహికల్స్‎లోనే కాదు. కార్ల అమ్మకాలలో కూడా టాప్ పొజిషన్‎లో ఉంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మహీంద్రా గణనీయమైన వృద్ధి చెందుతుంది. దీనికి ప్రధాన కారణం మహీంద్రా నుంచి నిరంతరం కొత్త కార్లు మార్కెట్లోకి రావడమే.

Mahindra Thar Roxx

అదే సమయంలో మహీంద్రా ఇప్పటికే అమ్మకానికి మార్కెట్లో ఉన్న కార్లను కాలానుగుణంగా చిన్నచిన్న మార్పులను చేస్తూ ప్రజలను ఆకట్టుకూనే ఉంటుంది. ఆ క్రమంలోనే థార్ రాక్స్ వాహనంలో ఓ కీలక మార్పు చేసింది. గత సంవత్సరం ఆగస్టు 15న ప్రారంభించబడిన థార్ రాక్స్ ఇంటీరియర్ క్యాబిన్ బ్రైట్ వైట్ కలర్లో రూపొందించారు.

Take a Poll

అంటే, వాహనం లోపలి భాగాన్ని ప్రకాశవంతమైన తెల్లని రంగులో రీ డిజైన్ చేశారు. మహీంద్రా దీనిని 'ఐవరీ వైట్' అని పిలుస్తుంది. అయితే, చాలా మంది కస్టమర్లు ఈ రంగు గురించి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. థార్ రాక్స్‎తో ఆఫ్-రోడ్ ప్రయాణాలకు వెళ్లినప్పుడు దాని తెల్లటి క్యాబిన్ సులభంగా మురికిగా మారుతుందని చాలా మంది పేర్కొన్నారు.

Mahindra Thar Roxx Interior Color

దీంతో క్యాబిన్‌ను తరచుగా శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మహీంద్రా ఐవరీ వైట్‌కు బదులుగా 'మోచా గ్రే' క్యాబిన్‌తో థార్ రాక్స్‌ను అందించడం మొదలు పెట్టింది. కొత్త మోచా గ్రే టార్ రాక్స్ డీలర్‌షిప్ షోరూమ్‌ల వద్దకు రావడం షురూ అయ్యాయి.

ఈ సందర్భంలో థార్ వాహనంలో తీసిన క్యాబిన్ ఫోటోలను ఇంటర్నెట్లో విడుదల చేశారు. కొత్త మోచా గ్రే క్యాబిన్-రంగు టార్ రాక్స్ షోరూమ్‌లలోకి రావడం మొదలు కావడంతో వాటి డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. థార్ రాక్స్ 4x2 , 4x4 వెర్షన్లు రెండూ ఐవరీ వైట్ క్యాబిన్‌తో అందించింది కంపెనీ.

తదనంతరం, కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మహీంద్రా గత అక్టోబర్‌లో 'మోచా బ్రౌన్' క్యాబిన్ కలర్‌ను ఖరీదైన 4x4 వెర్షన్‌లకు మాత్రమే అందించడం ప్రారంభించింది. ఈ క్రమంలో థార్ రాక్స్ వెహికల్ రెండు వెర్షన్లు ఒకే మోచా గ్రే క్యాబిన్‌తో వస్తాయి.

Mahindra Thar Roxx Interior Seats

కొత్త మోచా గ్రే క్యాబిన్ కూడా చూడాడానికి తెల్లగానే ఉన్నప్పటికీ.. ఇది బూడిద-తెలుపు రంగును కలిగి ఉంటుంది. దీంతో దానిపై ధూళి పడినా అది కనిపించదు. ఈ కొత్త రంగు ఆఫ్షన్లో వెహికల్ లోపలి భాగం, డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, డోర్ ప్యాడ్‌లతో సహా ఎప్పటిలాగే బ్లాక్, మోచా గ్రే డ్యూయల్-టోన్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : మహీంద్రా థార్ రాక్స్ అమ్మకాలు ఇప్పటికే బాగానే ఉన్నాయి. అయితే, మహీంద్రా ఇలాంటి చిన్న చిన్న అప్‌డేట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఈ వాహనం అమ్మకాలను మరింత పెంచడం ఖాయం. అయితే, దానికి ముందు కొత్త మోచా గ్రే క్యాబిన్ కస్టమర్లకు ఏమేరకు నచ్చుతుందో కంపెనీ తెలుసుకుంటే బాగుంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2025, 15:15 [IST]
English summary
Mahindra thar roxx interior color change new decision for customer convenience
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+