ఇక జనాలు షోరూంలకు క్యూ కట్టడం ఖాయం.. లేటెస్ట్ ఫీచర్లతో మహీంద్రా థార్ రాక్స్ కొత్తగా వచ్చేసింది

మహీంద్రా సంస్థ గతేడాది థార్ రాక్స్‌ని రిలీజ్ చేసింది. దీని అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీకి మంచి పేరు వచ్చింది. భారతీయ మార్కెట్లో థార్ రాక్స్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకే థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. మీకు ఈ ఎస్ యూవీను కొనాలనుకునే వేరియంట్‌ను బట్టి ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా మారుతూ ఉంటుంది.

మహీంద్రా థార్ రాక్స్ గతేడాడి మార్కెట్‎ను ఓ ఊపు ఊపేసిన మోడల్. కారులో ఉండాల్సిన అన్ని లేటెస్ట్ ఫీచర్స్‎తో నిండిన ఈ 5-డోర్స్ SUV, సక్సెస్ కావడానికి మరే ఇతర కారణాలు అవసరం లేదు. దీన్ని ఇంత త్వరగా పాజిబుల్ అయ్యే ఫ్యామిలీ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్‎గా మార్చడం సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు.

Mahindra Thar

ఆ విధంగా ఎలాంటి లోపాలు లేకుండా ఈ మోడల్‎ను అందరూ ఆదరించారు.. 20-25 లక్షల బడ్జెట్ ఉన్నవారికి మహీంద్రా థార్ రాక్స్ ఫస్ట్ ఆఫ్షన్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ మహీంద్రా థార్ రాక్స్‌ 2025 అప్ డేట్ మోడల్ ను తీసుకొచ్చింది. భారతదేశ స్థానిక వాహన తయారీదారుల బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్‎లలో ఒకటైన కొత్త థార్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

గతంలో ఉన్న థార్ రాక్స్ 3డోర్స్ SUVను మరింత మెరుగు పరిచేందుకు కొత్త మోడల్లో చిన్న ఫీచర్ అప్‌గ్రేడ్‌లను మాత్రమే చేసింది. 2025 మహీంద్రా థార్ రాక్స్‌లో ఏరోడైనమిక్ వైపర్స్, కీలెస్ ఎంట్రీ, స్లైడింగ్ ప్యాసింజర్-సైడ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 5-డోర్స్ థార్‌లో చేర్చిన ఇతర కొత్త ఫీచర్లు ఉన్నాయి.

Mahindra Thar Review

కొత్త మోడల్ ఇయర్ ఆప్ డేట్స్‎లో కంపెనీ ఇతర మార్పులేవీ చేయలేదు. గతంలో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లు సెలెక్టెడ్ వేరియంట్ పై ఆధారపడి థా‎ర్‎లో అందుబాటులో ఉంటాయి. మహీంద్రా థార్ రాక్స్ అనేది 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లను అందించింది.

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వెనుక వెంట్లతో కూడిన ఆటో ఏసీ, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, వైపర్స్, ఇంటెల్లిటర్న్ టైట్ టర్న్ ఫీచర్ వంటి ఆధునిక ఫీచర్లను ఇందులో అందించారు. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 5-డోర్స్ థార్ 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్స్ అందించారు.

Mahindra Thar Side

అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో సహా కొన్ని అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్స్‎తో నిండి ఉంది. తాజా 2025 మోడల్ మహీంద్రా థార్ రాక్స్ ఇంజిన్ పరంగా దాని గత మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.

వీటిలో మొదటిది 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల M-స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 177 bhp పవర్, 380 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా 2.2-లీటర్ నాలుగు సిలిండర్ల mHawk డీజిల్ 175 bhp పవర్, 370 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Take a Poll

కొత్త థార్ రాక్స్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 12.40 కి.మీ మైలేజీని అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ లీటరుకు 15.20 కి.మీ మైలేజీని అందిస్తుందని ARAI కన్ఫాం చేసింది. ఇది మార్కెట్లో XUV700, Scorpio-N వంటి మోడళ్లలో కనిపించే అదే ఇంజిన్ అయినప్పటికీ థార్ 5-డోర్ భిన్నంగా ట్యూన్ చేసింది. థార్ 5-డోర్ RWD, 4X4 వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. కానీ 4X4 డీజిల్ వేరియంట్‌లో మాత్రమే అందించారు.

దీనిలో మల్టీలింక్ రియర్ సస్పెన్షన్, మహీంద్రా ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్ టెక్నాలజీ, 650 మిమీ నీటిలో కూడా నడవగలదు. మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు ఈ వాహనాన్ని స్పెషల్ గా నిలబెట్టే ఇతర ఫీచర్స్. మహీంద్రా రాబోయే నెలల్లో కొత్త 3-డోర్స్ థార్‌ను కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది 5-డోర్స్ మాదిరిగానే కొన్ని అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 19, 2025, 12:34 [IST]
English summary
Mahindra thar roxx with 5 doors a game changer in the suv market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+