ఇండిపెండెన్స్ డే రోజు గుడ్ న్యూస్.. మహీంద్రా విజన్ SXT లాంచ్.. ఫ్యూచర్ థార్ పికప్ ఇదేనా?

కొత్త కారు, అందులోనూ ఎస్‌యూవీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ, ఆ ఎస్‌యూవీ ఒక పికప్ ట్రక్ లా ఉంటే? అవును, వింటుంది నిజమే. మహీంద్రా కంపెనీ తమ కొత్త విజన్ ఎస్‌ఎక్స్‌టీ కాన్సెప్ట్‎ని ఆవిష్కరించింది. ఇది మహీంద్రా థార్ పికప్ ట్రక్‌కు ఫ్యూచర్ లుక్ అని చెప్పొచ్చు. ఈ కొత్త కాన్సెప్ట్ కారులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, దాని డిజైన్ ఎలా ఉంది, ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలో ఎస్‌యూవీలకు పేరుగాంచిన మహీంద్రా కంపెనీ, తమ ఫ్రీడమ్ ఎన్‌యూ ఈవెంట్‌లో విజన్ ఎస్‌ఎక్స్‌టీ కాన్సెప్ట్ ను ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కార్ 2023 ఆగస్టులో ఆవిష్కరించిన థార్ ఈ ప్రోటోటైప్ నుండి స్ఫూర్తి పొందిందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం ఒక కాన్సెప్ట్ కార్ మాత్రమే.

Mahindra Vision SXT Unveiled Is This the Future Thar Pickup

కానీ, భవిష్యత్తులో రాబోయే మహీంద్రా కార్ల డిజైన్ ఎలా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. విజన్ ఎస్‌ఎక్స్‌టీ కాన్సెప్ట్ nu.iq ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రిక్, హైబ్రిడ్, లేదా ఐసీఈ పవర్డ్ కార్లు కూడా రావచ్చు.

ఈ విజన్ ఎస్‌ఎక్స్‌టీ కాన్సెప్ట్ ముందు భాగం చాలా పవర్ఫుల్‎గా కనిపిస్తుంది. స్క్వేర్ ఫ్రేమ్‌లో ఉండే పిక్సెల్ ఆకారంలో ఉన్న డ్యూయల్-ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఇందులో ప్రధాన ఆకర్షణ. వాటి పైన టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. దీని బోనెట్ మీద ఉన్న షార్ప్ లైన్లు, కట్స్ కారుకు మరింత రగ్గెడ్ లుక్ ఇస్తాయి.

Mahindra Vision SXT Unveiled Is This the Future Thar Pickup

మ్యాట్టే-బ్లాక్ ఫినిష్ తో ఉన్న రెక్టాంగులర్ గ్రిల్ కారు ముందు భాగాన్ని మరింత అట్రాక్టివ్‎గా చేస్తుంది. ముందు భాగంలో ఉండే ఆఫ్-రోడ్ స్టైల్ బంపర్, సిల్వర్ బ్యాష్ ప్లేట్ దీని లుక్‌ను మరింత పెంచుతాయి.

కారు పక్క భాగంలో కూడా షార్ప్ లైన్లు, వీలార్చ్ చుట్టూ యాంగులర్ క్లాడింగ్ ఉంటుంది. ఇది కారుకు జియోమెట్రిక్ లుక్‌ను ఇస్తుంది. డోర్ హ్యాండిల్స్ కూడా థార్ కారును పోలి ఉంటాయి. ముందు డోర్లకు పుల్ హ్యాండిల్స్, వెనుక డోర్లకు సి-పిల్లర్ మీద మౌంటెడ్ హ్యాండిల్స్ ఉంటాయి. రూఫ్ రైల్స్, కెమెరా ఆధారిత మిర్రర్స్, ఆఫ్-రోడ్ టైర్లు కూడా కనిపిస్తాయి.

Mahindra Vision SXT Unveiled Is This the Future Thar Pickup

వెనుక భాగంలో ఫ్లాట్-బెడ్ ఏరియాలో రెండు స్పేర్ ఆఫ్-రోడ్ వీల్స్ అమర్చబడి ఉంటాయి. సన్నగా, రెక్టాంగులర్ ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్‌లు, మధ్యలో ఉన్న మ్యాట్టే-బ్లాక్ బార్‌పై Vision.SXT బ్యాడ్జ్ ఉంటుంది. వెనుక బంపర్ కూడా ముందు బంపర్ లాగానే రగ్గెడ్ డిజైన్‌తో, సిల్వర్ బ్యాష్ ప్లేట్‌తో ఉంటుంది. రూఫ్‌పై ఉన్న స్పాయిలర్‌లో మూడవ బ్రేక్ లైట్ కూడా ఉంటుంది.

మహీంద్రా విజన్ ఎస్‌ఎక్స్‌టీ అనేది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఇది ప్రస్తుతం ఉన్న రూపంలో ఉత్పత్తిలోకి రాదు. కానీ, భవిష్యత్తులో రాబోయే మహీంద్రా కార్లు, ముఖ్యంగా పికప్ ట్రక్‌లు, ఈ డిజైన్ నుండి స్ఫూర్తి పొంది రూపొందించబడతాయి. మహీంద్రా తమ థార్ పోర్ట్‌ఫోలియోలోకి ఒక పికప్ ట్రక్‌ను తీసుకురావడానికి ఇది ఒక సూచనగా భావించవచ్చు. ఈ డిజైన్ మరింత మెరుగై, రోడ్లపైకి ఎప్పుడు వస్తుందో చూడాలని ఆసక్తిగా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 15, 2025, 12:26 [IST]
English summary
Mahindra vision sxt unveiled is this the future thar pickup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+