సింహం సింగిల్ గా వస్తుంది.. మార్కెట్లో మారుతి వ్యాగన్ఆర్ దూకుడు.. లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలు
భారత వాహన మార్కెట్‌లో ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్‌లో అద్భుతమైన సంఖ్యలో కార్లు అమ్ముడయ్యాయి. కస్టమర్లు కూడా పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. ఇటీవల, జనవరి నుండి జూన్ మధ్య కాలంలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో మారుతి సుజుకి నుండి 6, టాటా నుండి 2, హ్యుందాయ్, మహీంద్రా నుండి ఒక్కొక్క కారు స్థానం సంపాదించుకున్నాయి.
ఈ జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ హ్యాచ్‌బ్యాక్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో మొత్తం 1,01,424 యూనిట్ల వ్యాగన్‌ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. 2024 మొదటి అర్ధభాగంలో 99,668 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను పోల్చి చూస్తే, అమ్మకాల వృద్ధి 2% పెరిగింది. వ్యాగన్‌ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.54 లక్షల నుండి రూ.7.62 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ రెండవ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఏకంగా 1,00,560 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. దీనితో అమ్మకాల వృద్ధి 10% పెరిగింది. 2024 మొదటి అర్ధభాగంలో 91,348 యూనిట్లు అమ్ముడయ్యాయి. సాధారణ క్రెటా ధర రూ.11 లక్షల నుండి రూ.20 లక్షల వరకు, క్రెటా ఎలక్ట్రిక్ ధర రూ.18 లక్షల నుండి రూ.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మారుతి సుజుకి డిజైర్ సెడాన్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో సుమారు 96,101 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. 2024 మొదటి అర్ధభాగంతో పోలిస్తే 2% వృద్ధి నమోదైంది. డిజైర్ ధర రూ.6.84 లక్షల నుండి రూ.10.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

మారుతి సుజుకి బ్రెజా ఎస్‌యూవీ నాలుగవ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో మొత్తం 93,729 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 మొదటి అర్ధభాగంతో పోలిస్తే 4% వృద్ధి నమోదైంది. ఈ కారు ధర రూ.8.69 లక్షల నుండి రూ.14.14 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఐదవ స్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో ఏకంగా 93,098 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 మొదటి అర్ధభాగంతో పోలిస్తే 11% వృద్ధి నమోదైంది. దీని ధర రూ.6.49 లక్షల నుండి రూ.9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ ఆరవ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో సుమారు 91,991 కార్లు అమ్ముడయ్యాయి. 2024 మొదటి అర్ధభాగంతో పోలిస్తే 4% వృద్ధి నమోదైంది. ఈ కారు ధర రూ.8.96 లక్షల నుండి రూ.13.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏడవ స్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 88,066 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎనిమిదవ స్థానంలో టాటా నెక్సాన్ (87,267 యూనిట్లు), తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో (85,648 యూనిట్లు), పదవ స్థానంలో టాటా పంచ్ (84,579 యూనిట్లు) ఉన్నాయి. ఈ గణాంకాలు భారతీయ మార్కెట్‌లో వినియోగదారుల ప్రాధాన్యతలను, వివిధ కంపెనీల పనితీరును స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








