లీటరుకు 17 కి.మీ మైలేజ్ ఇచ్చే ఈ మారుతి కారులో ఏముంది? షోరూంకి వచ్చిన వాళ్లందరినీ ఇట్టే లాగేస్తోంది
ఇండియాలో ఎస్‌యూవీ (SUV) కార్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. రోడ్ల మీద ఎటు చూసినా ఎస్‌యూవీలే కనిపిస్తున్నాయి. వాటి లుక్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన ఇంటీరియర్ కారణంగా చాలా మంది వీటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఎస్‌యూవీల అమ్మకాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే, గత 2025 మే నెలలో ఏ ఎస్‌యూవీ కారు ఎక్కువగా అమ్ముడైంది? ఏ కంపెనీలు టాప్‌లో ఉన్నాయి? పూర్తి వివరాలు చూద్దాం.
భారతదేశంలో రోజురోజుకూ SUV కార్ల మార్కెట్ విస్తరిస్తుంది. చాలా మంది ఎస్‌యూవీ కార్లకు ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తున్నారు. అందుకే ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 2025 మే నెలలో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన ఎస్‌యూవీ కార్ల వివరాలను కంపెనీలు వెల్లడించాయి.

ఎస్‌యూవీ కార్లకు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందువల్లే ఇటీవల కాలంలో చాలా కార్ల కంపెనీలు వరుసగా కొత్త కొత్త ఎస్‌యూవీ కార్లను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. దీనివల్ల మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎస్‌యూవీ కార్ల మోడళ్ల సంఖ్య కూడా బాగా పెరిగింది.
ఇంత పోటీ మధ్య భారతదేశంలో గత మే నెలలో అత్యధిక మంది కొనుగోలు చేసిన భారతదేశ నంబర్ వన్ ఎస్‌యూవీ కారుగా మారుతి సుజుకి బ్రెజా (Brezza) మొదటి స్థానంలో నిలిచింది. గత మే నెలలో అమ్ముడైన బ్రెజా కార్ల సంఖ్య 15,566.

గత 2024లో ఇదే మే నెలలో మారుతి సుజుకి కంపెనీ కేవలం 14,186 బ్రెజా కార్లను మాత్రమే విక్రయించింది. ఈ లెక్కన చూస్తే బ్రెజా కార్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 10శాతం పెరిగాయి. బ్రెజా తర్వాత ఈ జాబితాలో రెండో స్థానంలో భారతదేశంలో మరో ప్రముఖ ఎస్‌యూవీ కారు అయిన హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఉంది.
2024 మే నెలలో 14,662 క్రెటా కార్లు అమ్ముడవ్వగా, ఈ సంవత్సరం మే నెలలో 198 కార్లు ఎక్కువగా, అంటే 14,860 క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. క్రెటా తర్వాత ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్న మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) గత నెలలో 14,401 యూనిట్లు అమ్ముడైంది.

అయితే, 2024 మే నెలలో కేవలం 13,717 స్కార్పియో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అదేవిధంగా, 2024 మే నెలలో 12,681 యూనిట్లు మాత్రమే అమ్ముడైన మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఈ 2025 మే నెలలో 13,584 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానంలో నిలిచింది.
తర్వాత ఐదవ, ఆరవ స్థానాల్లో టాటా (Tata) కంపెనీకి చెందిన రెండు ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి. ఇందులో, ఐదవ స్థానంలో ఉన్న పంచ్ (Punch) కారు గత సంవత్సరం మే నెలలో దాదాపు 18,949 యూనిట్లు అమ్ముడై, ఎస్‌యూవీ కార్లలోనే కాకుండా, ఆ నెలలో మొత్తం కార్లలోనే అత్యధిక సంఖ్యలో అమ్ముడైన కారుగా నిలిచింది.

కానీ, ఈ సంవత్సరం మే నెలలో కేవలం 13,133 పంచ్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆరవ స్థానంలో ఉన్న టాటా నెక్సాన్ (Tata Nexon) గత నెలలో 13,096 కార్లు అమ్ముడైంది. అయితే 2024 మే నెలలో కేవలం 11,457 నెక్సాన్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నెక్సాన్ అమ్మకాలు పెరిగినప్పటికీ పంచ్ అమ్మకాల పతనం టాటాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఈ టాప్-10 జాబితాలో చివరి 4 స్థానాల్లో మహీంద్రా థార్(Mahindra Thar - 10,389 యూనిట్లు), కియా సోనెట్(Kia Sonet - 8,054), మహీంద్రా XUV3XO(Mahindra XUV3XO - 7,952), టయోటా హైరైడర్(Toyota Hyryder - 7,573) ఉన్నాయి. ఈ 10 కార్లలో అమ్మకాలు బాగా పడిపోయిన కారు టాటా పంచ్. పంచ్ కార్ల అమ్మకాల పతనం టాటా మోటార్స్ కంపెనీకి ఒక లోటుగా మారింది.


Click it and Unblock the Notifications








