ఈ పొట్టి కారుతో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీ మీదే.. అదిరిపోతున్న కామెట్ కొత్త ఎడిషన్
JSW MG మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతుంది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి కంపెనీలకు పోటీగా బడ్జెట్ ధరలో ఈవీలను విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో ఈవీల హవా ఎక్కువగా ఉంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇదే అదునుగా తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఈవీ తయారీదారులు పోటా పోటీగా కార్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎంజీ మోటార్ సైతం ఎలక్ట్రిక్ కార్లపై మెయిన్ ఫోకస్ చేసింది. ఇప్పటికే దేశీయంగా ZS EV, విండ్సర్ EV, కామెట్ EV విక్రయిస్తుండగా, తాజాగా MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ (Blackstorm) అనే ప్రత్యేక ఎడిషన్ కారును విడుదల చేసింది. ఇది చూడటానికి నల్లగా కనిపిస్తుంది. దీని అల్లాయ్ వీల్స్ మరింత ఆకట్టుకునే విధంగా ఎరుపు కలర్‌తో వచ్చాయి.
MG కామెట్ EV బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.7.80 లక్షలు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. దీని బ్యాటరీని అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. కిలోమీటరుకు రూ.2.5గా కంపెనీ నిర్ణయించింది. దీని టాప్ ఎండ్ వేరియంట్ కంటే ఇది రూ.30,000 కంటే ఎక్కువ. ఎంజీ కంపెనీకి చెందిన విండ్సర్ ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది.

దీని తరువాత కామెట్ ఈవీకి కూడా మంచి డిమాండ్ ఉంది. చూడటానికి చిన్నగా ఉంటూ, అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌తో మరింత మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌తో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు దీనిపైనే ఉంటుంది. పాత వేరియంట్‌తో పోలిస్తే డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేవు.
బ్లాక్‌స్టార్మ్ ఎక్స్‌టీరియర్‌లో మాత్రం గ్రాఫిక్స్‌ను సరికొత్తగా డిజైన్ చేశారు. కారు మొత్తం అందాన్ని పెంచడంలో నలుపు కలర్ ప్రత్యేకంగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 11,000 ముందస్తు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ కారు గురించిన ఇతర వివరాల్లోకి వెళితే, ఇది 17.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చారు.

7.4 kW ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 3.5 గంటల్లో 0-100 శాతం ఛార్జ్ చేయవచ్చు. అదే 3.3 kW ఛార్జర్ సహయంతో 7 గంటలు పడుతుంది. బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని MG మోటార్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీనిలో అమర్చిన శక్తివంతమైన మోటార్ 42 PS పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.
ఇంటీరియర్‌లో లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 4 స్పీకర్లు, ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP),డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications