బ్యాటరీ కారుకు ఒక్కసారిగా షాక్ కొట్టింది.. ఇంత మంచి కారుకు వినియోగదారులు దూరమయ్యారు

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోడళ్లలో MG కామెట్ EV ఒకటి. తక్కువ ధర, కాంపాక్ట్ సైజు, నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయగలిగే డిజైన్ వలన ఈ కారు అనేక మంది కస్టమర్లకు మొదటి ఎంపికగా మారింది. ముఖ్యంగా మెట్రో నగరాల రద్దీ రోడ్లపై చిన్న సైజులో ఉండటం వలన ఎక్కడైనా సులువుగా పార్క్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా, MG అందించిన ఆధునిక సాంకేతిక ఫీచర్లు ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, ఈసారి జూలై 2025 MG కామెట్ EV అమ్మకాల పరంగా అంతగా బాగోలేదు. గణాంకాల ప్రకారం, జూలై 2025లో కేవలం 912 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 1,200 యూనిట్లతో పోలిస్తే 288 కార్లు తక్కువ.

అంటే కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే MG కామెట్ EV అమ్మకాలు 24 శాతం వరకు పడిపోయాయి. ఈ క్షీణత వెనుక ప్రధాన కారణం మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఇతర ఎలక్ట్రిక్ కార్ల పోటీ అని చెప్పాలి. మరిన్ని బ్రాండ్లు ఆకర్షణీయమైన ధరలతో, ఎక్కువ రేంజ్‌తో EVలను లాంచ్ చేస్తుండటంతో, MG కామెట్ EV మీద ఉన్న ఆ మొదటి క్రేజ్ కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది.

Mg Comet Electric Car July 2025 Sales 24 Percent Down

అంతేకాకుండా, వినియోగదారుల దృష్టి ఇప్పుడు కాంపాక్ట్ సైజ్ కంటే ఎక్కువ రేంజ్, పెద్ద బూట్ స్పేస్ ఉన్న మోడళ్లపై మళ్లుతోంది. కానీ, ఇప్పటికీ కామెట్ EV తక్కువ ధర, స్మార్ట్ ఫీచర్లు, నగర డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ సైజ్ వలన బడ్జెట్ EVగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. రాబోయే నెలల్లో కంపెనీ నుంచి ఎలాంటి అప్‌డేట్లు వస్తాయో చూడాలి కానీ ప్రస్తుతానికి సేల్స్ MGకి కొంత నిరాశ కలిగించాయి.

భారతీయ మార్కెట్లో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో MG కామెట్ EV తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న కుటుంబాలకు సరిపోయే ఈ కారు, ఒకేసారి నాలుగు మందికి సీటింగ్ కల్పించేలా డిజైన్ చేయబడింది. కాంపాక్ట్ సైజులో ఉన్నప్పటికీ, లోపల సౌకర్యవంతమైన స్పేస్ ఇవ్వడం దీని ప్రత్యేకత. పనితీరు విషయానికి వస్తే, MG కామెట్ EV 17.4 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

Mg Comet Electric Car July 2025 Sales 24 Percent Down

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. నగర ప్రయాణాలు, రోజువారీ కమ్యూటింగ్ కోసం ఇది సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ధర పరంగా కూడా MG కామెట్ EV మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ కేవలం రూ. 7,49,800 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. అంటే, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధర.

అంతేకాదు, కంపెనీ అందిస్తున్న BaaS (Battery as a Service) పథకం ద్వారా ఈ కారును కొనుగోలు చేస్తే, ధర ఇంకా తగ్గిపోతుంది. ఈ స్కీమ్ కింద కస్టమర్లు బ్యాటరీని సొంతం చేసుకోకుండా, రెంటల్ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. దీంతో వాహనం ప్రారంభ ధర గణనీయంగా తగ్గుతుంది. దీని ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్రైవర్ ముందు ఒక 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

Mg Comet Electric Car July 2025 Sales 24 Percent Down

మధ్యలో మరో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. చిన్న కారు అయినప్పటికీ, ప్రీమియం కార్లలో లభించే డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా కూడా MG కామెట్ EV బాగా ముందుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉండటంతో, మీ ఫోన్‌ను వెంటనే కారు స్క్రీన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, 55కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 20, 2025, 8:40 [IST]
English summary
Mg comet electric car july 2025 sales 24 percent down compared to previous
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+