ఇలాంటిది మన ఊరిలో వస్తే.. వీధంతా ఈ కారునే చూస్తూ ఉంటుంది! ఇండియాలో MG Cyberster లాంచ్

JSW-MG మోటార్ ఇండియా ఎట్టకేలకు భారత మార్కెట్‌కి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న కారు ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster) ను అధికారికంగా విడుదల చేసింది. ఇది కేవలం ఓ కొత్త ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు... భారతదేశం లో ఎలక్ట్రిక్ వాహనాల పరిణామానికి కొత్త దిశ చూపించే పవర్‌ప్యాక్ స్పోర్ట్స్ కారు. ఈ సైబర్‌స్టర్ ప్రత్యేకతేంటంటే, ఇది ఆసియాలో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. MG కంపెనీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ఈ కారును చేర్చి, లగ్జరీ,పెర్ఫార్మెన్స్ లెవెల్స్‌ను మరో మెట్టు ఎక్కించింది. భారత మార్కెట్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.72.49 లక్షలుగా నిర్ణయించబడింది. అయితే, ఈ ధర కేవలం ముందుగానే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న కస్టమర్లకు ఇది ప్రత్యేక ధరకు లభ్యమవుతోంది. అయితే, రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు ఈ కారును కొనాలనుకునే వారు రూ. 74.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీ MG Select అనే ప్రత్యేక డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అందించబడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గట్టి టాక్‌ను సంపాదించుకున్న ఈ ఎలక్ట్రిక్ కారు, భారతదేశంలో కూడా EV ప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.

Mg Cyberster

ఈ కారును మొదటిసారి 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. అప్పటి నుంచే కారుపై ఉన్న స్పందన వల్ల, ఇది ఇండియన్ లగ్జరీ EV సెగ్మెంట్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఈ స్పోర్ట్స్ కారు మరింత ప్రీమియం ఫీల్‌తో, స్పోర్టీ లుక్స్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కారుకు సంబంధించిన టెక్నాలజీ, డిజైన్, పెర్ఫార్మెన్స్ వివరాలు, లగ్జరీ కార్ ప్రియుల్లో ఒక రేంజ్ క్రియేట్ అవుతోంది.

ఈ కారులో అత్యాధునిక ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉన్నాయి. MG సైబర్‌స్టర్‌ కేవలం ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, ఓ శక్తివంతమైన పనితీరు యంత్రం. రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉండటంతో, ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తుంది. స్పోర్ట్స్ కార్ ప్రియులకు ఇది ఒక డ్రీమ్ మిషన్‌ లాంటిది. ఇది గరిష్టంగా 510 PS పవర్, 725 Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేయగలదు.

Mg Cyberster Design

ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగం అందుకోవడమే కాకుండా, గరిష్టంగా 200 కి.మీ./గం. వేగాన్ని చేరుకోగలదు. ఈ రేంజ్‌లో ఇంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ వేరే ఒక్కటీ ఈ ధరలో అందుబాటులో లేదు. ఇది 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో రోజువారీ వాడకానికి బెస్ట్. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 580 కి.మీ. వరకూ ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది (MIDC ప్రకారం).

దీన్ని స్పీడ్ కోసం కాకుండా, లాంగ్ ట్రిప్స్ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కారు లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో రీల్‌ టైమ్‌లో డ్రైవర్‌కు సాయం చేస్తుంది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ అలసిపోయినా, దృష్టి మరలినా - డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ వాటిని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అలాగే, ప్రమాదాల సమయంలో రక్షణ కోసం ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగ్స్, ESC వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉన్నాయి.

Mg Cyberster Price

ప్రమాద సమయంలో వాహనం తుప్పరలా తిరగకుండా చూసేందుకు రోల్ ఓవర్ రెసిస్టెంట్ బాడీ స్ట్రక్చర్ ఉపయోగించబడింది. అంతేకాకుండా, 1.83 సైడ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ (SSF) ఈ కారును మరింత స్థిరంగా ఉంచుతుంది అని MG స్పష్టంగా చెబుతోంది. ఛార్జింగ్ పరంగా చూస్తే, ఒక 144 kW DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో, కేవలం 40 నిమిషాల్లో 10 శాత నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఈ కారుతోపాటు కంపెనీ 3.3 kW పోర్టబుల్ ఛార్జర్, 7.4 kW వాల్ బాక్స్ ఛార్జర్ అలాగే స్టాండర్డ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు అన్నీ కూడా లాంచ్ ధరలోనే కలిపి ఇస్తోంది. భారత్‌లోని 13 ప్రధాన నగరాల్లో ఈ స్పోర్ట్స్ EV అందుబాటులో ఉంది. లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ, అలాగే వాహనానికి 3 ఏళ్లు లేదా అపరిమిత కిలోమీటర్లు వారంటీ వంటి అదనపు భరోసా లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 25, 2025, 15:53 [IST]
English summary
Mg cyberster electric car launched in indian market price range details
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+