ఈ ఫ్యామిలీ కారు కోసం కస్టమర్లు షోరూమ్‌కు రాకపోయేసరికి కంగుతిన్న డీలర్లు.. ఎంతమంది వచ్చారంటే?
ఎంజి మోటార్ (Mg Motor) గురించి చెప్పుకుంటే, ఇది భారతీయ మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించుకున్న ఒక బ్రిటిష్ బ్రాండ్. ముఖ్యంగా, దీని ఎలక్ట్రిక్ కార్లు కస్టమర్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. విండ్సర్, కామెట్ ఈవీ లాంటి మోడళ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటే, కంపెనీకి ఉన్న పెద్ద ఎస్‌యూవీ ఎంజీ గ్లోస్టర్ (MG Gloster) మాత్రం పూర్తిగా నిరాశ కలిగిస్తోంది. జూలై నెలలో విడుదలైన అమ్మకాల గణాంకాలు దీనికి స్పష్టమైన నిదర్శనం. టయోటా ఫార్చ్యూనర్‌కు ప్రత్యర్థిగా MG గ్లోస్టర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చినా, కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఇది పూర్తిగా విఫలమైంది. ఒకప్పుడు ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మార్కెట్‌లో హైప్ క్రియేట్ చేసిన ఈ కారు, ఇప్పుడు మాత్రం షోరూమ్‌లలో ఖాళీగా నిలబడి ఉంది.
అమ్మకాల పరంగా చూస్తే గణాంకాలు షాకింగ్‌గా ఉన్నాయి. జూలై నెలలో కొనుగోలు చేసిన వారు కేవలం 16 మంది మాత్రమే. ఒక పెద్ద ఎస్‌యూవీకి ఇది చాలా తక్కువ. గత ఏడాది ఇదే సమయంలో అమ్మకాలతో పోలిస్తే 91 శాతం తగ్గుదల రావడం కంపెనీకి గట్టి దెబ్బ. ఇంత తక్కువ అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటగా, టయోటా ఫార్చ్యూనర్ మార్కెట్‌లో ఉన్న డామినేషన్.

ఫార్చ్యూనర్ అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్. దానికి సరిపడే స్థాయిలో MG గ్లోస్టర్ కస్టమర్లలో ఆ నమ్మకాన్ని సృష్టించలేకపోయింది. అలాగే మహీంద్రా, టాటా, టయోటా వంటి కంపెనీలు తమదైన స్ట్రాంగ్ బేస్‌ను ఏర్పరచుకున్నాయి. అదే సమయంలో, MG మోటార్ ఇతర సెగ్మెంట్లలో మాత్రం సక్సెస్ అందుకుంటోంది. EV సెగ్మెంట్‌లో దీని వాహనాలకు మంచి డిమాండ్ ఉండటం ఒక పాజిటివ్. కానీ గ్లోస్టర్ మాత్రం ప్రీమియం SUV మార్కెట్‌లో ఎక్కడో వెనుకబడిపోయింది.
MG గ్లోస్టర్‌ను పవర్‌ట్రైన్ పరంగా చూస్తే, ఇది రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. మొదటిది 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 161 బిహెచ్‌పి పవర్, 375 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సాధారణ డ్రైవింగ్‌కు సరిపడే విధంగా ట్యూన్ చేయబడింది. రెండవది మరింత శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 215 బిహెచ్‌పి పవర్‌తో పాటు 480 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.

ఈ రెండు ఇంజిన్ ఆప్షన్‌లను 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే జతచేశారు. మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కంపెనీ అందించడం లేదు. అంటే, డ్రైవింగ్ అనుభవం పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది లగ్జరీ SUV కాబట్టి, డ్రైవర్‌కు సౌకర్యం కలిగించే విధంగానే MG డిజైన్ చేసింది. MG గ్లోస్టర్ ప్రత్యేకతల్లో ఒకటి దాని డ్రైవ్ కాన్ఫిగరేషన్. ఇది 2WD (టూ వీల్ డ్రైవ్), 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) ఆప్షన్లలో లభిస్తుంది.
సాధారణ డ్రైవింగ్ లేదా సిటీ ట్రాఫిక్‌లో 2WD వేరియంట్ సరిపోతుంది. కానీ నిజమైన SUV అనుభవం, కఠినమైన రోడ్లు లేదా ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్స్ కోసం 4WD వేరియంట్ మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ SUVలో ఉన్న మల్టీ-టెర్రైన్ మోడ్‌లు దాని ఆఫ్-రోడ్ సామర్థ్యాలను మరింత పెంచుతాయి. రాళ్ల రోడ్లు, ఇసుక, మట్టి లేదా స్లిప్పరీ సర్ఫేస్ అయినా వాహనం తగిన ట్రాక్షన్‌ను అందిస్తూ సాఫీగా నడుస్తుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే, MG గ్లోస్టర్‌లోని ట్విన్-టర్బో వేరియంట్‌లో మాత్రమే 4X4 డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ అందిస్తున్నారు. ఇది ఆఫ్-రోడింగ్‌లో అద్భుతమైన పనితీరును కోరుకునే వారికి సరైన ఎంపిక, లగ్జరీ SUV సెగ్మెంట్‌లో MGకి మంచి పేరు తెచ్చిన మోడల్. నిజానికి, ఒక దశలో గ్లోస్టర్ అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం SUVలలో ఒకటి. అయితే ఇటీవల వచ్చిన సేల్స్ నంబర్లు దానికి విరుద్ధంగా ఉండటం కంపెనీకి పెద్ద షాక్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications








