ఎవరూ కొనని కారుకు అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది.. ఏకంగా 78 శాతానికి పైగా పెరిగిన అమ్మకాలు

MG మోటార్ గత కొంతకాలంగా భారత మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు ధీటుగా బలమైన, అధునాతన కార్లను విడుదల చేస్తూ తన సేల్స్ పెంచుకోవడానికి చాలా కాలంగా కృషి చేస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన అత్యంత ప్రసిద్ధ SUV మోడల్ అయిన హెక్టర్ (Hector) కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. ఏప్రిల్ 2025లో హెక్టర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇది విడుదలైనప్పటి నుంచి మార్కెట్లో మంచి స్పందనను రాబట్టినప్పటికీ, గత కొన్ని నెలలుగా దాని అమ్మకాల్లో కొంత తగ్గుదల నెలకొంది.

కానీ, తాజాగా విడుదలైన ఏప్రిల్ 2025 అమ్మకాల గణాంకాలు కంపెనీకి కొంత ఊరటను కలిగించాయి. ఈ నెలలో మొత్తం 977 యూనిట్లు అమ్ముడవడం ద్వారా, హెక్టర్ తన గత నెల అమ్మకాలతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మార్చి 2025లో కేవలం 547 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఇప్పుడు నెలవారీ ప్రాతిపదికన 78.6 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ఇటీవలకాలంలో కంపెనీకి వచ్చిన అత్యుత్తమ పెరుగుదలలో ఇది ఒకటి.

Mg Hector Suv 977 Sales

గత 12 నెలల్లో భారత మార్కెట్లో హెక్టర్ మొత్తం 7,571 యూనిట్ల** అమ్మకాలను సాధించి, ఒక ప్రత్యేక మైలురాయిని చేరింది. ఈ గణాంకాలు చూస్తే, మార్కెట్లో హెక్టర్‌కు ఇంకా మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఇంజిన్ ఆప్షన్ల పరంగా చూస్తే, ఇది 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ డీజిల్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

ఎంజీ హెక్టర్ SUV భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు లగ్జరీ ఫీచర్లతో వచ్చింది. ఈ SUV ప్రారంభ ధర సుమారు రూ. 14 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్ ధర రూ. 22.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇంటీరియర్‌లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. లోపల 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్, మ్యూజిక్, ఇతర ఫంక్షన్లను ఈజీగా ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది.

Mg Hector Suv

వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలు డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి. ప్రయాణికుల సేఫ్టీకి ఎంజీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ఈ కారులో అత్యాధునక భద్రత ప్రమాణాలను ప్రత్యేకంగా ఇచ్చింది.

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఇవి ప్రయాణికులను ప్రమాదాల సమయంలో కాపాడటంతో గణనీయమైన కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి డ్రైవర్‌కు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి.

Mg Hector Suv 977 Sales Units

గత ఆరు నెలల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, నవంబర్ 2024లో 1,106 యూనిట్లు అమ్ముడవగా, డిసెంబర్ 2024లో ఈ సంఖ్య 1,373కి పెరిగింది. కానీ జనవరి 2025లో ఈ సంఖ్య భారీగా పడిపడి కేవలం 449కి చేరింది. ఇది గణనీయమైన పతనం. ఫిబ్రవరిలో 515కి, మార్చిలో 547కి కొంతమేర పెరుగుదల కనిపించింది. చివరకు, ఏప్రిల్ 2025లో 977 యూనిట్ల అమ్మకాలతో ఇది మళ్లీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

More from DriveSpark

Article Published On: Saturday, May 24, 2025, 7:30 [IST]
English summary
Mg hector suv 977 sales units recorded in april 2025 more details inside
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+