కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. పెద్ద కుటుంబానికి సరిపోయే ఈ కారుపై రూ.2.4 లక్షల వరకు డిస్కౌంట్

భారత కార్ల మార్కెట్‌లో JSW MG మోటార్ ఇండియా ప్రముఖ కంపెనీగా ఉంది. అధునాతన ఫీచర్స్‌తో ప్రీమియం లుకింగ్‌ను కలిగిన మోడళ్లను లాంచ్ చేస్తుంది. కంపెనీ తన సేల్స్‌ను పెంచుకోడానికి అప్పుడప్పుడు ప్రత్యేకంగా తగ్గింపులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి తన ప్రసిద్ధ మోడల్ హెక్టర్ (Hector) కారుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. తక్కువ ధరలో కస్టమర్లు దీన్ని సొంతం చేసుకోవడానికి ఈ SUV పై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నటు కంపెనీ ప్రకటించింది. కొత్తగా డిస్కౌంట్ ధరలో కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. ముఖ్య విషయం ఏమిటంటే ఈ తగ్గింపు ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

JSW MG మోటార్ తన హెక్టర్ Suv పై ఈ భారీ తగ్గింపులో పొడిగించిన వారంటీ, రోడ్‌సైడ్ అసిస్ట్ వంటి పలు ప్రయోజనాలను సైతం ఆఫర్ చేస్తుంది. ఈ కారుపై కస్టమర్లు 4.99 శాతం వడ్డీ రేటు, తగ్గించిన రోడ్ టాక్స్, కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ వంటి వాటిని పొందుతారు. వీటన్నింటిని కలిపి మొత్తం రూ.2.4 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది భారతీయ మార్కెట్లో వినియోగదారులకు ఆరు వేరియంట్లలో లభిస్తుంది.

Discount On Hector Suv

ఎంజీ హెక్టర్ మూడు ప్రత్యేక ఎడిషన్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర విషయానికి వస్తే, రూ.14 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ.22.89 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌‌రోడ్ అయితే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. స్టైల్, షైన్ ప్రో, సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో వేరియంట్లలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 143 PS పవర్, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్/CVT గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. అలాగే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో కూడా లభిస్తుంది. ఇది 170 PS పవర్, 50 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జత చేశారు. మైలేజ్ 15.58 kmpl.

Mg Motor India Hector Suv

హెక్టర్ Suv ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆకట్టుకుంటుంది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారు బయటి అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముందు ఆకర్షనీయమైన LED హెడ్‌లైట్లు, LED DRLలు,LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. కస్టమర్లు ఈ కారును 5, 6, 7 సీట్ల ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఇంటీరియర్ కూడా ఆకట్టుకుంటుంది. డజన్ల కొద్ది లేటెస్ట్ ఫీచర్స్‌ను ఈ కారులో చూడవచ్చు.

లోపల 7-అంగుళాల పూర్తి-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 14-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికుల సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగులు,ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 26, 2025, 12:45 [IST]
English summary
Mg motor india offers rs 2 40 lakh discount on hector suv more details here
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+