ఈ కారుపై రూ.4.44 లక్షల భారీ తగ్గింపు.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి!
ఎంతో మంది భారతీయులకు ఎంజీ మోటార్స్ (MG Motors) అనే పేరు ఇప్పుడు నమ్మకమైన ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌గా అనిపిస్తోంది. కామెట్ EV, విండ్సర్ EV వంటి మోడళ్లతో మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ బ్రాండ్‌కి అసలైన ప్రాతినిధ్యం చెప్పాలంటే అది ZS EV అనే ఎలక్ట్రిక్ SUV. ఈ మోడల్ MG భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన తొలి దశల్లోనే ఆవిష్కరించబడింది. అప్పటి నుంచీ ఇది బ్రాండ్‌కి ఒక సిగ్నేచర్ కారుగా నిలిచిపోయింది. 2019లో MG తమ తొలి మోడల్ హెక్టర్ SUVను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు ఎవ్వరూ ఊహించలేదు, ఈ బ్రాండ్ అంత తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ఆదరణ పొందుతుందని.
ఇప్పుడు, ఆ ప్రయాణానికి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కంపెనీ తమ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV అయిన ZS EVపై వన్-టైమ్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ప్రకటించి వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటోంది. ఆఫర్ డిస్కౌంట్ మాత్రమే కాదు, MG బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని, ఎలక్ట్రిక్ మొబిలిటీకి తమ కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారు ఈ స్పెషల్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

MG మోటార్స్ తన భారతీయ ప్రయాణంలో ఇది ఆరో వార్షికోత్సవం. ఈ ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా, ZS EVపై గరిష్టంగా రూ.4.44 లక్షల వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనే ఉద్దేశంలో ఉన్న వారు, మరింత ఆర్థికంగా ఎంట్రీ పొందే అవకాశాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం ZS EV బేస్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్, కొత్త ఆఫర్ ధరగా రూ.16.75 లక్షలకు అందుబాటులోకి వచ్చింది.
ఇది పాత ధర అయిన రూ.16.88 లక్షల కంటే దాదాపు రూ.13,000 తగ్గింపు. ఇక మీరు ఎక్సైట్ ప్రో వేరియంట్ ఎంచుకుంటే, ఇది ఇప్పుడు రూ.18.49 లక్షల ప్రారంభ ధరకు లభిస్తోంది. పాత ధరతో పోల్చితే ఇది రూ.48,000 వరకు తగ్గింపు పొందింది. అంతేకాక, MG ZS EVలోని టాప్-ఎండ్ వేరియంట్లు అయిన ఎక్స్‌క్లూజివ్ ప్లస్ లేదా ఎసెన్స్ వేరియంట్లు ఎంచుకునే వారికి మరింత గరిష్ట తగ్గింపు లభించనున్నాయి.

ఎక్స్‌క్లూజివ్ ప్లస్ వేరియంట్‌పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ఈ వేరియంట్‌ను రూ.19,49,800కు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇది మునుపటి ధర అయిన రూ.23,64,800తో పోలిస్తే రూ.4.15 లక్షల భారీ తగ్గింపు అని చెప్పవచ్చు. ఇక ZS EV సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్ అయిన ఎసెన్స్ వేరియంట్ కూడా భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వేరియంట్‌ను రూ.20,49,800 ప్రారంభ ధరకు పొందవచ్చు.
ఇది గత ధర అయిన రూ.24,93,800 కంటే రూ.4.44 లక్షల తగ్గింపు. ఈ ధరల మార్పులు చూస్తే, వినియోగదారులకు లగ్జరీ ఎలక్ట్రిక్ SUVలు అందుబాటు ధరలో లభిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈ ఆఫర్లు ఎంతకాలం అందుబాటులో ఉంటాయన్న విషయమై కంపెనీ నుంచి స్పష్టత లేదు. అయితే, సమాచారం ప్రకారం, ఇవి కనీసం జూన్ నెలంతా లేదా స్టాక్ ఉన్నంతవరకూ అందుబాటులో ఉండే అవకాశముంది.

MG ZS EV నెక్స్ట్-జెన్ ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లో మెరుగైన టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులకు ఆకర్షణీయంగా మారింది. ఇందులో 50.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేశారు. ఈ పవర్‌ట్రెయిన్ ద్వారా ZS EV 174 bhp పవర్, 280 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల ఎలక్ట్రిక్ SUV అయినప్పటికీ, ఇది మంచి స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
ZS EV DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే, తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్ చేసిన తర్వాత, ఈ SUV 461 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలదు, ఇది రోజువారీ ప్రయాణాల్లోనూ, లాంగ్ డ్రైవ్‌లలోనూ వినియోగదారులకు మెరుగ్గా ఉపయోగపడింది. తక్కువ నిర్వహణ వ్యయంతో అంటే ఎవరేజ్‌గా చూస్తే, 1 కిలోమీటర్ నడిపించడానికి కేవలం 60 పైసలు మాత్రమే ఖర్చవుతుంది.


Click it and Unblock the Notifications








