ఈ కారును దక్షిణాదిలో మాత్రం వదిలిపెట్టడం లేదు.. ఎక్కువగా ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? మిస్టరీ ఏంటీ?

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఒక విప్లవాన్ని సృష్టించిన ఎంజీ మోటార్ (Mg Motor) ఇటీవల కాలంలో తన అమ్మకాలలో దూకుడును ప్రదర్శిస్తుంది. లోకల్ ఉన్నటువంటి దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి తయారీదారులకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తూ ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌‌లో మెరుగైన సంఖ్యలను నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఎంజీ కంపెనీకి చెందిన ఈవీ కార్లకు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఆదరణ లభిస్తుంది. తాజాగా వాహన్ డేటా నుంచి డేటా ప్రకారం, 2024లో JSW MG మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో దాదాపు సగం దక్షిణ భారత మార్కెట్‌లో జరిగిందని తేలింది. MG విండ్సర్ అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది.

ఇది ఎలక్ట్రిక్ CUV (క్రాస్-అవర్ యుటిలిటీ వెహికల్). స్టైల్, పనితీరు, సాంకేతికత కారణంగా ఈ కారు ఎలక్ట్రిక్ కార్ డ్రైవర్‌లకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది. నివేదిక ప్రకారం, ఈ కారును కొంటున్న రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశం నుంచి అధిక డిమాండ్ లభిస్తోందని తేలింది. డేటా ప్రకారం, ఇండియా అంతటా కలిపి ఎంజీ మోటార్ మొత్తంగా 22,646 యూనిట్ల విక్రయించింది. వీటిలో 10,698 యూనిట్లు ఏకంగా దక్షిణ భారతదేశంలోనే అమ్ముడుపోవడం విశేషం.

Mg Motor Ev Sales

ఇది మొత్తం అమ్మకాల్లో 47.2 శాతంగా ఉంది. ఎంజీ ఎలక్ట్రిక్ కార్లు ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్ముడుపోయాయి. వీటిలో కర్ణాటక రాష్ట్రం టాప్ ప్లేస్‌లో నిలవగా, తరువాత తెలంగాణ, కేరళ ఉన్నాయి. వాహన్ డేటా ప్రకారం, ఈ రాష్ట్రాల్లో ఎంజీ మోటార్‌ ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తెలియజేస్తుంది. ఇక తరువాతి స్థానాల్లో మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి.

మొత్తం ఈవీ కార్లలో ఎంజీ విండ్సర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ కారు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో MG మోటార్ ఒక మైలురాయిగా నిలిచింది. భారతీయుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన విండ్సర్‌ మెరుగైన పనితీరు, అందుబాటు ధరలో లభించడం కారణంగా అమ్మకాల్లో ఇది దూసుకుపోతుంది. ఎంజీ EV పోర్ట్‌ఫోలియోలో అత్యంత విజయవంతమైన మోడల్‌గా విండ్సర్ నిలిచింది. ఈ కారును కంపెనీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ కింద కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

Mg Motor Sold Total Of 10698 Ev Car Units

ఈ ప్రోగ్రామ్ ద్వారా MG కారును తక్కువ ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు, అయితే బ్యాటరీని అద్దె విధానంలో ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కింద ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.9.99 లక్షల నుంచి ఉంది. అదే ఈ సర్వీస్ వద్దనుకుంటే రూ.13.50 లక్షలు చెల్లించాలి. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. BaaSను ఎంచుకుంటే ప్రారంభ ధర భారీగా తగ్గిపోతుంది.

బ్యాటరీని అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు కాబట్టి దీని ఖర్చు వచ్చేసి ప్రతి కిలోమీటర్‌కు కేవలం రూ.3.5 చెల్లించాల్సి ఉంటుంది. MG మోటార్ ఈ విండ్సర్ కారును మాత్రమే కాకుండా ఇతర ప్రసిద్ధ మోడళ్లు కామెట్ ఈవీ, జెడ్‌ఎస్ ఈవీ వంటి ఇతర ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను కూడా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్ కింద కొనుగోలు చేయడానికి కస్టమర్లకు అవకాశం కల్పిస్తుంది.

Mg Motor South India Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2025, 15:50 [IST]
English summary
Mg motor sold total of 10698 ev car units in 2024 south india more details inside
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+