ఇంద్రభవనం కారు రూపంలో.. ఇది చూసినవాళ్లు రెండుసార్లు తిరిగి చూస్తారు! ఓ ఫ్లైయింగ్ ప్యాలెస్!

దిగ్గజ కార్ల తయారీదారు అయినటువంటి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగానికి మరింత తోడు అందించడానికి లగ్జరీ EV మార్కెట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న MG M9 ప్రెసిడెన్షియల్ లిమోసిన్ ఎలక్ట్రిక్ MPV (Presidential Limousine)ను విడుదల చేసింది. లగ్జరీ, కంఫర్ట్‌ను కొత్త దృక్పథంతో తిరిగి నిర్వచించేందుకు రూపొందించబడిన ఈ కార్, వినియోగదారులకు అత్యుత్తమమైన టెక్నాలజీని అందిస్తుంది. ఈ లగ్జరీ లిమోసిన్‌ను కంపెనీ ఇండియా మార్కెట్‌లో రూ.69.90 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు వెబ్‌సైట్ లేదా దగ్గర్లోని MG SELECT అనుభవ కేంద్రాలకు వెళ్లి రూ.1,00,000 బుకింగ్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

డెలివరీలు 2025 ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది 90 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తొ లభిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్లు నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే, దీన్ని ఉపయోగించే వారు సుదూర ప్రయాణాలకూ ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇందులో వినియోగించిన ఎలక్ట్రిక్ మోటారు అత్యధికంగా 242 bhp పవర్, అంతేకాకుండా 350 Nm పీక్ టార్క్ ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంది.

Mg New M9 Presidential Limousine Launch

MG M9 EV ఛార్జింగ్ సౌలభ్యం పరంగా కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని బ్యాటరీని నార్మల్ ఛార్జర్‌తో వేయించాలంటే, మీరు ఉపయోగించే 11 kWh AC ఛార్జర్ సహాయంతో 5 శాతం నుండి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 8.5 గంటల సమయం పడుతుంది. అంటే, రాత్రిపూట ఒకసారి ప్లగ్‌ఇన్ చేస్తే, తెల్లారే సరికి పూర్తిగా ఛార్జ్ అయిపోయి ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది.

అలాగే, బయట ఉండగా లేదా వేగంగా ఛార్జ్ అవసరమయ్యే పరిస్థితుల్లో DC ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం మరింత ఉపయోగపడుతుంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేసుకోవచ్చు. M9 లోని ఛార్జింగ్ ఆప్షన్లు ప్లాన్డ్ ట్రిప్స్‌కి మాత్రమే కాదు, ఎమర్జెన్సీ ఛార్జింగ్ అవసరాలకూ కూడా చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నాయి. ఇది లగ్జరీతో పాటు సౌలభ్యం అన్నింటిలో గొప్పగా నిలుస్తోంది.

Mg New M9 Presidential Limousine

ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్ లాంటి హైఎండ్ MPVలకు గట్టి పోటీగా మారుతోంది. ఎంజీ ఎం9 ఈవీ కారు వినూత్న టెక్నాలజీతో ప్రయాణ అనుభూతిని గొప్పగా మార్చుతుంది. ఇందులో ఉన్న ప్రెసిడెన్షియల్ సీట్లు, రెండవ వరుసలో కూర్చున్న వారికి పవర్డ్ కెప్టెన్ సీట్లు లభిస్తాయి. 8 రకాల మసాజ్ సెట్టింగులు, హీట్ వెంటిలేషన్ వ్యవస్థలతో పాటు, దీన్ని ఉపయోగించేవారికి ఒక రాయల్ టచ్‌ను కలుగజేస్తుంది.

ఈ కారులో యాచ్-స్టైల్ సన్‌రూఫ్ ఉండటం వల్ల సహజమైన వాతావరణన అనుభూతిని సృష్టిస్తుంది. రాత్రిపూట ప్రయాణం ప్రత్యేకంగా ఉండేందుకు, 64 కలర్ అంబియంట్ లైటింగ్ సిస్టమ్ అందించబడింది. దీనిని ప్రయాణికులు తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. కేవలం కంఫర్ట్‌కి కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 13 స్పీకర్ల సౌండ్ సిస్టమ్(సబ్‌వూఫర్, యాంప్లిఫైయర్‌తో సహా) ద్వారా సౌండ్ అనుభవం థియేటర్ స్థాయిలో ఉంటుంది.

Mg New M9 launch

ఈ మొత్తం వ్యవస్థను ఇంటెలిజెంట్ ఆర్మ్ రెస్ట్ ద్వారా నియంత్రించవచ్చు. అంతేకాదు, కంపెనీ AC వెంట్స్, USB-A కనెక్టివిటీ, వంటి ముఖ్యమైన ఫీచర్లను కూడా అందించింది. దీంట్లో ఉన్న వెహికల్ టు లోడ్ (V2L), వెహికల్ టు వెహికల్ (V2V) ఛార్జింగ్‌ సామర్థ్యాలు ఈ కారును భవిష్యత్ ప్రయాణాలకు సిద్ధంగా ఉంచాయి. ఈ కారు ఈవీ మార్కెట్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2025, 16:11 [IST]
English summary
Mg new m9 presidential limousine electric mpv launched in india at rs 69 90 lakh
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+