ఈ కారు కోసం షోరూమ్‌కు క్యూ కట్టిన 27 వేల మంది.. బడ్జెట్ ధరలో విమానంలో ఉండే సౌకర్యాలు, 449 కి.మీల రేంజ్
టాటా మోటార్స్ భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో దాదాపుగా రాజ్యమేలుతుండగా, ఆ ఆధిపత్యాన్ని బలండా ఢీకొనడానికి గతంలో MG మోటార్స్ ఒక కారుతో మైదానంలోకి దిగింది. అదే విండ్సర్ (Windsor). ఈ మోడల్‌తో తక్కువ కాలంలోనే దేశంలో మంచి పేరును సంపాదించుకుంది. అంతకుముందు ZS EV, కామెట్ EV వంటి మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న MG, టాటా వాహనాల అమ్మకాల స్థాయిని ఎప్పటికీ తాకలేకపోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. విండ్సర్ EV మోడల్‌ను ప్రవేశపెట్టి, MG మార్కెట్లో పెనుమార్పు తీసుకొచ్చింది. విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యం, అందుబాటులో ఉండే ధర, ఇవన్నీ విండ్సర్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ వాహనాన్ని ఒకసారి చూసినవారు, దానికి అట్రాక్ట్ అయిపోవాల్సిందే.
ఇది అంతటి ప్రభావాన్ని చూపింది. పంచ్ EV లేదా నెక్సాన్ EV కొనాలని భావించిన చాలా మంది వినియోగదారులు చివరికి విండ్సర్‌కే మొగ్గుచూపారు. షోరూమ్‌ల వద్ద రద్దీ పెరగడం, వాహనాన్ని సమీక్షించే ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం ఇవన్నీ విండ్సర్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచాయి. ఇటీవల అప్‌డేట్‌గా విడుదలైన విండ్సర్ EV వేరియంట్ కూడా మరింత ఆకర్షణగా మారింది.

ఈ కొత్త వేరియంట్‌లో గత కొన్ని నెలల్లో వినియోగదారులు సూచించిన లోపాలను కంపెనీ పరిష్కరించింది. దీనివల్ల కొనుగోలుదారుల విశ్వాసం పెరిగి, ఆ కారును ఎంపిక చేసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఇదిలా ఉంటే విండ్సర్ EV ఒక ఘనతను సాధించింది. సెప్టెంబర్ 2024లో మార్కెట్లో ప్రవేశించిన కేవలం కొద్ది నెలల్లోనే 27,000 యూనిట్ల అమ్మకాలు సాధించి, MG మోటార్స్‌కు ఒక గొప్ప మైలురాయిని అందించింది.
ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోవడం తక్కువ విషయం కాదు. టాటా వంటి దిగ్గజాన్ని గట్టిగా ఢీకొట్టగలిగే దూకుడుతో MG మళ్లీ చర్చల్లోకి వచ్చింది. MG విండ్సర్ EV భారత మార్కెట్లో ఒక గేమ్‌చేంజర్‌లా మారింది. 38 kWh బ్యాటరీతో ప్రారంభమైన ఈ క్రాస్ఓవర్ యుటిలిటీ వాహనం, శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌తోనే కాకుండా వినియోగదారులకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలను అందించడంలో కూడా ముందుంది.

అయితే, ఇదే స్పీడుతో ముందుకు సాగేందుకు MG తీసుకున్న విండ్సర్ ప్రోను తీసుకొచ్చింది. 2025 మేలో ప్రారంభమైన ఈ విండ్సర్ ప్రో మోడల్ పెద్ద 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో మరింత శక్తివంతంగా మారింది. దీని రేంజ్ మరింత విస్తరించడంతో పాటు, ప్రీమియం ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్‌తో ఇది మెరుగైన వినియోగదార అనుభవాన్ని అందిస్తోంది. ఆ విశ్వాసానికి నిదర్శనంగా, లాంచ్ అయిన 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లు నమోదయ్యాయి.
విండ్సర్ EV కేవలం మెట్రో నగరాలలోనే కాకుండా, అభివృద్ధి చెందుతున్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలమైన డిమాండ్‌ను సంపాదించింది. విండ్సర్ BaaS - బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్ రూపంలో వచ్చింది. ఇది MG మోటార్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి BaaS ఆఫర్. ఈ విధానం వాహనం మొత్తపు ధరను గణనీయంగా తగ్గించడంలో కీలకపాత్ర వహించింది.

సాధారణంగా, ఎలక్ట్రిక్ వాహనాల ధరలో ఎక్కువ భాగం బ్యాటరీ పైనే ఆధారపడి ఉంటుంది. కానీ విండ్సర్ EVలో, వినియోగదారుడు బ్యాటరీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దీని బదులు, ఒక అద్దె విధానాన్ని అనుసరించి బ్యాటరీని అవసరమైనంతకాలం ఉపయోగించవచ్చు. ఈ విధానం ఖర్చును తక్కువగా ఉంచుతుందే కాకుండా, యూజర్లకు వాహనాన్ని కొనుగోలు చేసే వేళ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.
అంతేకాదు, వినియోగదారు ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ. 3.50 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఒకరకంగా, ఫ్యూయెల్ ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఎప్పటికీ ఆసక్తి చూపని వారు కూడా ఇప్పుడు విండ్సర్ వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాండర్డ్ ఈవీ 331ల కి.మీల రేంజ్ ఇస్తే, ఈవీ ప్రో 449 కి.మీల రేంజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








