అరరే! ఈ ఫేమస్ కారుకు ఏమైంది? కేవలం ఒకే నెలలో కష్టాల్లోకి.. డిమాండ్ తగ్గడానికి ఇదే కారణమా?
ఫిబ్రవరి నెల ముగియగానే భారతదేశంలో ఉన్నటువంటి పలు వాహన తయారీదారులు వరుసగా తమ అమ్మకాలను వెల్లడిస్తున్నారు. కంపెనీ మొత్తం సేల్స్‌తో పాటు మోడళ్ల వారీగా విడివిడిగా కూడా విక్రయాల డేటాను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా MG మోటార్ ఇండియా తన ప్రసిద్ధ మోడల్ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ (Windsor)కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, ఈ కారు ఫిబ్రవరి 2025లో 2,431 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2025లో ఎంజీ మోటార్ మొత్తం 4,002 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. దీనిలో విండ్సర్ వాటానే ఏకంగా 61 శాతం ఉండటం గమనార్హం. అయితే జనవరి 2025లో విండ్సర్ ఈవీ అమ్మకాలు 3,277 యూనిట్లుగా ఉండగా, ఇది నెలవారీగా చూసినట్లయితే 846 యూనిట్లు తక్కువగా 26 శాతం క్షీణతను నమోదు చేసింది.
ఎంజీ విండ్సర్ అనేది భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. దీని అధునాతన టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు, పర్యావరణ అనుకూలత వంటివి వాటితో EV మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని పొందేలా చేస్తున్నాయి. సాధారణంగా ఈ కారుకు దేశంలో బాగా డిమాండ్ ఉంటుంది. అయితే గత నెలలో సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణం త్వరలో 50 kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త వెర్షన్ విడుదల కాబోతుందని సమాచారం.

దీంతో కొత్తగా విండ్సర్ కారును కొనుగోలు చేయాలని చూసిన వారు రాబోయే మోడల్ కోసం ప్రస్తుతం ఉన్న దాన్ని తక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అదే సమయంలో మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీకు చెందిన మోడళ్ల నుంచి కూడా పోటీ ఎక్కువగా ఉండటం కూడా విండ్సర్ కారు సేల్స్ తగ్గడానికి ఒక కారణం. అలాగే, సేల్స్ ఇలా అకస్మాత్తుగా పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి
ప్రస్తుతం అందుబాటులో ఉన్న విండ్సర్ ఈవీ 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. అదే పెద్ద బ్యాటరీ ప్యాక్ రేంజ్ ద్వారా ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 460 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో తక్కువ దూరం ప్రయాణించవచ్చు. పెద్ద బ్యాటరీ ప్యాక్ అయితే లాంగ్ జర్నీలు చేయడానికి కూడా వీలవుతుంది. అందుకే చాలా మంది పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు అందుబాటులో ఉన్న కారును చాలా తక్కువ మంది ఎంచుకున్నారు. కొత్త బ్యాటరీ ప్యాక్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన తరువాత విండ్సర్ ఈవీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. విండ్సర్ ఈవీ 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 331 కి.మీ. మాత్రమే ప్రయాణిస్తుంది. కంపెనీ చిన్న బ్యాటరీ ప్యాక్‌తో పాటు 50 kWh బ్యాటరీతో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచుతుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 13.5 లక్షల ప్రారంభ ధర నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది. అదే 'బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్' ప్లాన్ కింద కొనుగోలు చేస్తే రూ. 9.9 లక్షలకు లభిస్తుంది. ఈ కారు అధునాతన ఫీచర్స్‌తో అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉంది. సేఫ్టీ పరంగా కూడా ఇది అత్యుత్తమమైన ప్రమాణాలను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








