MG Windsor Free Charging Limit విండ్సర్ ఈవీ కస్టమర్లకు షాక్‌.. ధర పెంపు కాదు, మరి ఏంటంటే!

విదేశీ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ ఎంజీ మోటార్.. భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ ఈ బ్రాండ్ వాహనాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన విండ్సర్ ఈవీ.. భారత కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పెట్రోల్ కార్ ధరలో ఈ విండ్సర్ ఈవీ.. అందుబాటులో ఉండడం దీని సేల్స్ పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. టాటా నెక్సాన్ ఈవీని దాటుకొని భారత్‌లో విండ్సర్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే ఎంజీ సంస్థ ప్రస్తుతం ఈ కారుకు సంబంధించి వినియోగదారులకు ఒక చిన్న మెలిక పెట్టింది. అదేంటంటే..

భారత మార్కెట్లో ఎంజీ సంస్థ నుంచి జెడ్‌ఎస్, కోమెట్ తర్వాత వచ్చిన మూడో కారు విండ్సర్ ఈవీ‌. ప్రస్తుతం దీని అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వినియోగదారులకు ఒక చిన్న షాక్ ఇచ్చింది ఈ సంస్థ. దీని ధర పెంపు అనుకుంటున్నట్లయితే పొరపాటే! అసలు విషయం ఏంటంటే?

MG Windsor EV Free Charging new terms and conditions

ఎంజీ సంస్థ ఇటీవల తమ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్డేట్ చేసింది. ఇందులో భాగంగా ఎవరైతే విండ్సర్ ఈవీని 2024 డిసెంబర్ 31 కంటే ముందు కొనుగోలు చేస్తారో వారికి.. ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. ఎంజీ ఛార్జింగ్ స్టేషన్‌లో ఎలాంటి నిబంధనలు లేకుండా వాళ్ళు తమ కారును ఛార్జ్ చేసుకోవచ్చు.

కానీ ఇప్పటినుంచి విండ్సర్ ఈవీ వినియోగదారులు.. కేవలం 1000 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ నూతన నిబంధనలు ఫిబ్రవరి 7, 2025 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎంజీ సంస్థ తెలిపింది. అయితే లిమిట్ ఎంత అనేది ఈ సంస్థ వెల్లడించలేదు. కానీ గతంలో దీనిపై "లిమిట్స్ లేదా రెస్ట్రిక్షన్స్" తీసుకొస్తామని సంస్థ తెలిపింది.

MG Windsor EV Free Charging new terms and conditions

ఈ నిబంధనల ప్రకారం వీటిని ఎప్పుడైనా సరే ముందస్తు నోటీసు లేకుండా మోడీపై చేయడం లేదా తొలగించడం చేయవచ్చు‌ అన్నట్లుగా ఎంజీ సంస్థ పేర్కొంది. ఫ్రీ ఛార్జింగ్ ఆఫర్‌ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధన ద్వారా.. ఫాస్ట్‌చార్జ్ వినియోగం తగ్గి వాహనంలోని బ్యాటరీ లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది.

రెగ్యులర్ AC చార్జింగ్ కంటే.. DC ఫాస్ట్ ఛార్జింగ్ తరచూ వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బ తినే అవకాశాలుంటాయి. అయితే ఈ కొత్త ప్రకటన ఈ కారు వినియోగదారులను నిరాశకు గురి చేయవచ్చు. ఫ్రీ ఛార్జింగ్ ఆఫర్ అనుమతి ఉన్న కారు ఓనర్లు.. ఈ కారు కొన్న మొదటి సంవత్సరంలో దాదాపు 26 సార్లు ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

MG Windsor EV Free Charging new terms and conditions

దీని ఫుల్ ఛార్జ్‌తో రియల్-వరల్డ్ రేంజ్ 300 కిలోమీటర్లుగా ఉండడంతో వినియోగదారులు 7000 కి.మీ.ల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. అయితే ఈ కొత్త నిబంధనలు దీని సేల్స్ ప్రభావితం చేస్తాయని భావించలేం. భారత్లో మొదటి ఇంటలిజెంట్ క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్ (CUV)గా వచ్చిన ఈ కారు హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

ఈ విండ్సర్ ఈవీ 38kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి..134 bhp పవర్ 200 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 332 కిలోమీటర్ల రేంజ్ అందించగలరు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కారణంగా 45kW DC ఛార్జర్‌తో 10- 80% ఛార్జింగ్ 55 నిమిషాల్లోనే అవుతుంది. అందువల్ల జనాలు దీనిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇందులో 15-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్‌లైస్‌ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే 9-స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టం, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా దీనిలో డజన్ల కొద్దీ ఫీచర్లు కలవు. అందువల్ల ఈ కారు మార్కెట్‌లో సూపర్‌ హిట్‌ అయ్యింది.

More from DriveSpark

Article Published On: Saturday, February 15, 2025, 7:20 [IST]
English summary
Mg windsor ev free charging limited to 1000 units check reason details here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+