వరుసగా 10 నెలలుగా నంబర్ 1 ఎలక్ట్రిక్ కారు.. దేశంలోని జనాలు ఈ కారు కోసం షోరూమ్ ముందు క్యూ!
JSW MG మోటార్ ఇండియా దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని మొత్తం మార్చేసింది. ఈ విభాగంలో తన అధిపత్యాన్ని కొనసాగిస్తుంది. కంపెనీ నుంచి విడుదలయ్యే ఈవీలకు మార్కెట్లో కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. తాజాగా తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి MG విండ్సర్ (Mg Windsor) వరుసగా పది నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తుంది. ఈ స్థిరమైన విజయం, మార్కెట్లో EV విభాగంలో విండ్సర్ స్థానం ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా జూలై 2025 నెల JSW MG మోటార్ ఇండియాకు ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఆ నెలలో విండ్సర్ అమ్మకాలు 4,308 యూనిట్లకు చేరుకుని, ఇప్పటివరకు ఉన్న అన్ని నెలవారీ రికార్డులను బద్దలు కొట్టింది.
ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 36,000 యూనిట్లు అమ్ముడవడం, ఈ మోడల్ EV కొనుగోలుదారులలో ఎంతటి ఆదరణ పొందిందో, ప్రజాదరణ ఎలాంటి వేగంతో పెరుగుతోందో చెప్పకనే చెబుతుంది. దీని డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, రేంజ్, ప్రాక్టికాలిటీ ఈ నాలుగింటి కలయికతో విండ్సర్‌ను ఇతర మోడళ్ల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతోంది. అంతేకాకుండా, MG మోటార్ ఇచ్చే బ్రాండ్ నమ్మకం, సర్వీస్ నెట్‌వర్క్ కూడా వినియోగదారుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాయి.

మార్కెట్లో అనేక కొత్త పోటీదారులు ప్రవేశిస్తున్నప్పటికీ, విండ్సర్ తన ప్రత్యేకమైన ధర, పనితీరుతో EV కొనుగోలుదారుల మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఈ వేగం కొనసాగితే, రాబోయే నెలల్లో కూడా ఇది అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు బిరుదును వదిలిపెట్టే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. విండ్సర్ అమ్మకాల దూకుడు MG మోటార్ ఇండియాకు 2025 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో EV విభాగంలో గణనీయమైన విజయాన్ని అందించింది.
ఈ త్రైమాసికంలో MG ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వాటా 32 శాతానికి చేరుకుంది, ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం వృద్ధి. ఈ పెరుగుదల వెనుక ప్రధాన శక్తి విండ్సర్ మోడల్‌నే. అదే కాలంలో విండ్సర్ సగటు అమ్మకాలు 17 శాతం పెరిగి, దాని డిమాండ్ బలంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. అయితే, కేవలం విండ్సర్ మాత్రమే కాకుండా, MG ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లూ ఈ వృద్ధికి తోడ్పడ్డాయి.

ఫలితంగా, బ్రాండ్ మొత్తం EV అమ్మకాలు 28 శాతానికి పెరిగి, కంపెనీకి మరింత బలమైన స్థానం కల్పించాయి. ఈ సంఖ్యలు కేవలం అమ్మకాల పెరుగుదలకే పరిమితం కావడం లేదు, భారతీయ వినియోగదారులు MG EVలపై చూపుతున్న నమ్మకం, బ్రాండ్ పట్ల పెరుగుతున్న విశ్వాసం, MG అందిస్తున్న టెక్నాలజీ, పనితీరు, విలువల కలయిక ఎంతగా ఆకట్టుకుంటోందో ప్రతిబింబిస్తున్నాయి. MG విండ్సర్‌లో అందుబాటులో ఉన్న వేరియంట్లు 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి.
ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 331 కి.మీ వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీకి అనుసంధానమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 134 bhp శక్తిని, 200 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, నగర రోడ్ల నుండి హైవే డ్రైవింగ్ వరకు మంచి పనితీరును అందిస్తుంది. ఇక ఇటీవల మార్కెట్లోకి వచ్చిన విండ్సర్ ప్రో వేరియంట్లు మరింత అధిక సామర్థ్యం కలిగిన 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందాయి.

ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 449 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. విండ్సర్ మార్కెట్లో ఎక్సైట్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్‌క్లూజివ్ ప్రో(52.9kWh), ఎసెన్స్ ప్రో(52.9kWh) అనే ఐదు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. దీంతో కారు ధర భారీగా తగ్గతుంది. మార్కెట్లో ఎసెన్స్ ప్రో (52.9kWh) వేరియంట్ ధర రూ. 18.31 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంది.


Click it and Unblock the Notifications








