50 నిమిషాల ఛార్జ్‌తో 400కు పైగా కిలోమీటర్లు.. కొత్త ఈవీ కారును లేట్ చేయకుండా బుక్ చేసుకోండి!

భారత వాహన మార్కెట్లో ఎంజీ కార్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్లను ప్రజలు చాలా ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. ప్రసిద్ద మోడల్ విండ్సర్ ఈవీకి దేశీయంగా బాగా డిమాండ్ ఉంటుంది. ఇది ఇప్పటికే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డులు నెలకొల్పింది. ఇది కేవలం శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవం మాత్రమే కాదు, దాని స్టైలింగ్, ఇంటీరియర్ ఫీచర్లు, టెక్ ఆధారిత కనెక్టివిటీతో ఒక ప్రీమియం క్లాస్‌ టచ్ అనుభూతిని ఇస్తుంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా విండ్సర్ EV ప్రో (Windsor Ev Pro)ను తీసుకొచ్చింది. దీని మునుపటి మోడల్‌తో పోలిస్తే దీనిలో చాలా కొత్త అప్‌డేట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి శుభవార్త వచ్చింది.

ఎంజీ మోటార్స్ ఈ మోడల్‌కి సంబంధించి అధికారిక బుకింగ్‌లు ప్రారంభించింది. ఎలక్ట్రిక్ SUVకి రూ. 17.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక పరిచయ ధరతో బుకింగ్ ప్రక్రియను కంపెనీ ఈరోజు నుంచే ప్రారంభించింది. కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన వారు MG అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి తమ బుకింగ్‌ను నమోదు చేయవచ్చు.

Mg Windsor Ev Pro

ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఈ పరిచయ ధర కేవలం మొత్తం 8,000 మంది కొనుగోలుదారుల వరకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తరువాత వారికి ధర మరింత పెరుగుతుంది. తక్కువ ధరలో కారును పొందాలంటే త్వరగా బుకంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కంపెనీ ఆఫర్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుకింగ్స్ అయిపోకముందే త్వరగా చేసుకోవడం బెస్ట్.

ఈ కారును మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అనుకునే వారు 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS)'ను కూడా ఎంచుకోవచ్చు. దీని ద్వారా కారు ధర రూ.12.49 లక్షలు ఉంటుంది. దీన్ని ఎంచుకున్నట్లయితే బ్యాటరీని అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి లోమీటరుకు రూ. 4.5 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాలి. ఎక్కువ అమౌంట్ పెట్టి కారును కొనలేని వారు ఈ బాస్ సర్వీస్‌ను వాడుకోని కారును సొంతం చేసుకోవచ్చు.

Mg Windsor Ev Pro Bookings Started In India

విండ్సర్ ప్రో మోడల్ 53 kWh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీతో వస్తుంది. దీంతో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రోజు ఆఫీసులు, కాలేజ్‌లో, ఇతర పనులకు వెళ్లడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ కొత్త మోడల్‌ను పోల్చితే దీని స్టాండర్ట్ విండ్సర్ ఈవీ 38 kWh బ్యాటరీతో మాత్రమే లభిస్తుంది, ఈ ఆప్షన్‌లో దాదాపు 332 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

విండ్సర్ ప్రో మోడల్ 136 PS పవర్, 00 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చింది. 7.4kWh AC ఛార్జర్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 9.5 గంటలు పడుతుంది. అయితే వేగవంతమైన ఛార్జింగ్‌కి కావాలనుకుంటే 60kW DC ఫాస్ట్ ఛార్జర్‌ ఉపయోగించి కేవలం 50 నిమిషాల్లో 20 శాత నుంచి 80 శాత వరకు ఛార్జ్ చేయవచ్చు.

Mg Windsor Ev Pro Bookings Started

ఈ కారు ఐదు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లోపల 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలను కూడా కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 9, 2025, 7:30 [IST]
English summary
Mg windsor ev pro bookings started in india all details check inside
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+