449 కి.మీల రేంజ్ ఈవీ వచ్చేసింది.. మొదటి 8000 మందికి ప్రత్యేక తగ్గింపు.. లేట్ చేయకుండా షోరూమ్‌కు వెళ్లండి
పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రయాణ ఖర్చులు భారం అనుకునే వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో ఈవీ తయారీదారులు వరుసగా కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంజీ మోటార్స్ (Mg motors) నుంచి సరికొత్త ఈవీ కారు మార్కెట్లోకి విడుదలైంది. ఆ మోడల్ పేరు విండ్సర్ ఈవీ ప్రో (windsor ev pro). దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోటీ పెరిగిన కారణంగా కంపెనీ ఈ అదిరిపోయే మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కారు మార్కెట్లోకి విడుదల అయింది. ఇది ప్రస్తుత వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ.17.49 లక్షలుగా నిర్ణయించారు.
అయితే ఈ ప్రత్యేక ధర మొదటి 8,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ కారును మంచి డీల్‌తో సొంతం చేసుకోవాలనుకుంటే కస్టమర్లు ముందుగానే త్వరపడటం బెస్ట్. విండ్సర్ ప్రోలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, ఇది బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. అద్దే ప్రాతిపదికన బ్యాటరీని తీసుకునే అవకాశం కూడా ఈ కారులో ఉంది. ఇలా అయితే కేవలం రూ.12.50 లక్షలకే కారును కొనుగోలు చేయవచ్చు.

అయితే, ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి రూ.4.50 చొప్పున బ్యాటరీ అద్దె ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. విండ్సర్ ప్రో 52.9 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా కార్ 134 హార్స్‌పవర్ (HP), 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయణాలకు చాలా అనువుగా ఉంటుంది. హైవే మీద కంఫర్ట్‌గా ప్రయాణించగలదు. ఈ విధంగా చూస్తే, MG విండ్సర్ ప్రో భవిష్యత్తుకు బెస్ట్ ఆప్షన్ కానుంది.
MG విండ్సర్ ప్రో కోసం బుకింగ్‌లు మే 8, 2025 నుండి ప్రారంభమవనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో విడుదలవుతున్న మొట్టమొదటి క్రాస్ఓవర్ యుటిలిటీ ఎలక్ట్రిక్ వాహనం. ఈ కారులో ఉన్నటువంటి 52.9 kWh భారీ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 449 కి.మీల వరకు ప్రయాణించగలదు. రోజువారి ప్రయాణాలు చేసే వారికి ఇది బాగా అనువుగా ఉంటుంది. సిటీ డ్రైవ్‌కు సరిపోయే రేంజ్.

లాంగ్ డ్రైవ్ చేసే టైంలో కూడా బాగా అనుకూలంగా అనిపిస్తుంది. ఇక మే 8నుంచి బుకింగ్‌లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ కార్‌ను ఎంపిక చేసుకునే వారు ఈ మోడల్‌ను సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే మొదటి 8,000 మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఛార్జింగ్ విషయానికొస్తే, కంపెనీ విండ్సర్ EV ప్రోలో 7.4kWh AC ఛార్జర్‌ను అమర్చారు
దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 9.5 గంటలు పడుతుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. దీంతో 50 నిమిషాల్లో 20 నుండి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. MG హెక్టర్ SUVలో ఉన్నటువంటి 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను దీనికి ఇచ్చారు. ఇది కేవలం శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌తోనే కాదు, అత్యాధునిక సాంకేతికతతో సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ను అందిస్తోంది.

ఇందులో అమర్చబడిన లెవల్ 2 ఆటోనమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఈవీ కార్ల విభాగంలో ఒక పెద్ద అడుగు. ప్రత్యేకంగా ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు, డ్రైవర్ భద్రత, డైలీ కమ్యూటింగ్‌ను మరింత స్మార్ట్‌గా మలుస్తాయి. అంతేకాదు, ఈ కారు వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ ఫంక్షన్లను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








