సామాన్యుడిపై పెద్ద భారం మోపిన కంపెనీ.. ఆ ఫేమస్ ఎలక్ట్రిక్‌ కారు కొనాలంటే చుక్కలే!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. అనేక సంస్థలు ఈవీల తయారీ దిశగా మళ్లుతున్నాయి. ప్రముఖ సంస్థ ఎంజీ మోటార్... తమ ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రత్యర్థి సంస్థలకు పోటీనిస్తూ దూసుకువెళ్తోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన MG ZS EV ఎస్‌యూవీ భారత కస్టమర్లకు బాగా చేరువైంది. ఈ సంస్థ నుంచి పాపులర్ అయిన కోమెట్, విండ్సర్ మోడళ్ల కంటే ముందే ఈ MG ZS EVని లాంచ్‌ చేసింది. ఇది అయినప్పటి నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా వినియోగదారులను ఈ ఇవీ ఆకట్టుకుంటోంది. అయితే... తాజాగా ఎంజీ సంస్థ వినియోగదారులకు ఓ షాక్ ఇచ్చింది. తమ ఈవీ లైన- అప్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా ఈ ZS EV ధర కూడా పెంచేసింది.

ఎంజీ మోటార్స్ సంస్థ ఇదివరకే విండ్సర్, కోమెట్ ధరలను పెంచింది. తాజాగా ఈ జెఎస్ ఈవీ ధర కూడా పెంచింది. దీంట్లోని వేరియంట్‌ను బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ.89,000 మేర పెరిగింది. ఇప్పుడు పెరిగిన ధరతో ఈ కారు ఎక్స్- షోరూమ్ ధర రూ.18.98 లక్షల నుంచి రూ.26.64 లక్షల మధ్య ఉంది. ఈ MG ZS EV ప్రస్తుతం 7 విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MG ZS EV Price hike

పెరిగిన ధరలను మరింత పరిశీలిస్తే.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బేస్ మోడల్ ఎగ్జిక్యూటివ్ ధర పెరగలేదు. దీంట్లోని Excite Pro వేరియంట్ ధర రూ.49,800 మేర ధర పెరిగింది. ఇక దీంట్లో టాప్ వేరియంట్లు అయిన Essence Dual-Tone Iconic Ivory, Essence Dark Grey వేరియంట్ ఈవీలపై ధర రూ.89,000 కంటే ఎక్కువగా పెరిగింది.

ఈ ఎస్‌యూవీలోని Exclusive Plus Dark Grey వేరియంట్ ధర ప్రస్తుతం ఉన్నధర కంటే రూ.61,800కు పైగా పెరిగింది. ఇక దీంట్లోని Exclusive Plus Dual Tone Iconic Ivory 100 Edition వేరియంట్లపై రూ.61,000ను పెంచింది. ధర పెంపు మినహా దీంట్లో మరెలాంటి అప్డేట్స్‌ను ఈ సంస్థ తీసుకురాలేదు. ఈ MG ZS EV 50.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ఉంటుంది.

MG ZS EV Price hike

దీంట్లోని ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ 174 bhp పవర్, 280 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ బ్యాటరీని డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌తో తయారుచేసిందీ ఎంజీ సంస్థ. సేఫ్టీ అందించే విధంగా దీన్ని తీసుకువచ్చినట్లు ఎంజీ సంస్థ చెబుతోంది.

ఈ బ్యాటరీ ప్యాక్ UL 2580 సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టం, ASIL-D enhanced సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ రేటింగ్‌తో ఉంటుంది. ఈ ఈవీ కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు 60 పైసలు ఆపరేటింగ్ ఖర్చు అవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎస్‌యూవీల ఆపరేటింగ్ కాస్ట్ కంటే తక్కువ కావడం గమనార్హం. ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఉండడమే కాకుండా ఫుల్ LED హాక్ ఐ హెడ్‌ల్యాంప్స్, 17- అంగుళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి.

డిజిటల్ క్లస్టర్, HD టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, రియర్ AC వెంట్‌తో వస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారు 360 డిగ్రీ వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ (HDC), ఆరు ఎయిర్ బ్యాగులతో ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం (TPMS), హిల్- స్టార్ట్ అసిస్ట్ వంటివి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2025, 19:00 [IST]
English summary
Mg zs ev price increased by rs 89000 check latest price and reason for hike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+