కిలోమీటర్ ఖర్చు కేవలం 60పైసలే.. టాటా, హ్యుందాయ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఎంజీ

2020లో ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎంజీ ZS EV కంపెనీకి ఒక లక్కీ మోడల్. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఎవరూ పెద్దగా నెగిటివ్ మాట్లాడింది లేదు. దానికి తగ్గట్టుగానే, ప్రతి నెలా దీని సేల్స్ చాలా గౌరవప్రదంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అక్టోబరు నెలలో ఈ కారు సేల్స్‌లో ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబరులో కేవలం 250 యూనిట్లు అమ్ముడవగా 2024 అక్టోబరులో 609 యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది.

టాటా నెక్సాన్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి ప్రత్యర్థులతో ఆరేళ్లుగా పోటీపడుతున్న ఎంజీ ZS EV, తన పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్, పర్ఫామెన్స్‎తో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ ఎస్‌యూవీలో 50.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడిన ఈ పవర్‌ట్రైన్ 174 Bhp పవర్, గరిష్టంగా 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

MG ZS EV Sales Double 143 Growth Recorded in October with 461 km Range

ఎంజీ ZS EV అతిపెద్ద హైలైట్ దాని రేంజ్. ఇది సింగిల్ ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. అంతేకాక ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారును నడపడానికి కేవలం ఒక కిలోమీటర్‌కు 60 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది.

ఎంజీ ZS EV అమ్మకాలకు దాని భద్రతా ప్రమాణాలు, ప్రీమియం ఫీచర్లే ప్రధాన బలం. ఈ కారులో ఉపయోగించిన బ్యాటరీ నీరు, ధూళి నుంచి రక్షించేలా డిజైన్ చేయబడింది. ఇది UL2580 సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ASIL-D రేటింగ్‌ను కూడా కలిగి ఉందని కంపెనీ ప్రకటించింది.

MG ZS EV Sales Double 143 Growth Recorded in October with 461 km Range

ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 360-డిగ్రీ కెమెరా, హిల్-డిసెంట్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటివి లభిస్తాయి. అప్‌డేట్ చేసిన i-Smart ఫీచర్‌లో FOTA (Firmware Over-The-Air) కేపబిలిటీ, పార్కింగ్ బుకింగ్ కోసం పార్క్ ప్లస్ యాప్, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లతో కూడిన నావిగేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఎంజీ ZS EV ఎక్స్-షోరూమ్ ధరలు రూ.16.88 లక్షల నుంచి రూ.24.93 లక్షల వరకు ఉన్నాయి. ఎంజీ సంస్థకు ఈవీల విభాగంలో ZS EVతో పాటు ఎంజీ విండ్‌సర్ ఈవీ కూడా బంపర్ స్టార్‌గా నిలిచింది. విండ్‌సర్ ఈవీ కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలతో కొత్త రికార్డు సృష్టించింది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది.

MG ZS EV Sales Double 143 Growth Recorded in October with 461 km Range

సరసమైన ధర, మంచి రేంజ్, లేటెస్ట్ టెక్నాలజీ, V2L (Vehicle to Load), V2V (Vehicle to Vehicle) కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు విండ్‌సర్ ఈవీ విజయానికి దోహదపడ్డాయి. MG ZS EV, విండ్‌సర్ EV మోడల్‌ల తిరుగులేని విజయంతో, భారతీయ EV మార్కెట్‌లో MG ఒక ప్రధాన శక్తిగా మారింది. అధిక రేంజ్, అత్యాధునిక ఫీచర్లు మరియు సురక్షితమైన బ్యాటరీ ప్యాక్‌ల కలయికతో MG మోటార్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటోంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 22, 2025, 9:10 [IST]
English summary
Mg zs ev sales double 143 growth recorded in october with 461 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+