ఈ కారులో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి.. లుక్‌తో కట్టి పడేస్తుంది.. దీన్ని ఒక్కసారి చూసి వదిలేయలేరు!
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తనదైన స్థానం సంపాదించుకుంటూ, ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తుంటుంది ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ (Mg motors). విండ్సర్, కామెట్ లాంటి మోడళ్లకు ప్రజల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. టాటా మోటార్స్, హ్యూందాయ్ వంటి తయారీదారులకు పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను ఎంజీ తన కస్టమర్ల కోసం తీసుకొస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్, డీజిల్ వేరియంట్లను కూడా మార్కెట్లో నిలబెట్టి, అన్ని విభాగాల్లో ఆదాయాన్ని సంపాదిస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో దాని ప్రసిద్ధ మోడల్ హెక్టర్ suv కూడా దేశంలో బాగా డిమాండ్ ఉన్నకారు.
గతంలో దీని అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికి ఇటీవల కాలంలో క్రమంగా సేల్స్‌ను సాధిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు,హెక్టర్ మరింత మెరుగైన కొత్త రూపంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. 2025 మోడల్ హెక్టర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. MG కొన్ని కీలక మార్పులు చేసి ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. మెరుగైన మైలేజీ, అప్‌డేటెడ్ ఫీచర్లు, రిఫ్రెష్డ్ డిజైన్‌తో ఇది మరింత మంది కస్టమర్లకు చేరడానికి వచ్చింది.

ఈ సారి, హెక్టర్‌ను రూ.13.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు శక్తివంతమైన SUVని కొత్తగా మార్చి అందిస్తుంది. ఈ కొత్త వెర్షన్‌కి ప్రధానమైన అప్‌గ్రేడ్, దాని ఇంజిన్ వ్యవస్థ. ఇప్పుడు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను E20 ఫ్యూయెల్‌కు అనుకూలంగా మార్చారు. అంటే, ఇది ఇప్పుడు 20 శాతం ఎథనాల్ కలిపిన పెట్రోలుతో కూడా ఈజీగా నడుస్తుంది. దీని ద్వారా కారు మైలేజ్ కూడా మెరుగవుతుంది.
2025 ఏప్రిల్ 1 తరువాత భారత్‌లో తయారయ్యే అన్ని పెట్రోల్ వాహనాలకు E20 సపోర్ట్ తప్పనిసరి కావడంతో, హెక్టర్‌లో ఈ మార్పు చేయాల్సి వచ్చింది. ఇంజిన్‌ను మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయవచ్చు. డ్రైవింగ్ స్టైల్‌ను బట్టీ వినియోగదారులు తమకు నచ్చిన వేరియంట్ ఎంచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ అందించడం విశేషం అని చెప్పాలి. ఇంజిన్ అప్‌గ్రేడ్ ద్వారా డ్రైవర్లకు దీన్ని నటపడం మరింత ఈజీ.

కంపెనీ ఈ మోడల్‌లో కొత్తగా ఇంజిన్ మార్పులు తప్పితే, ఇంకా ఎలాంటి డిజైన్ మార్పులు కానీ, అదనపు ఫీచర్లు కానీ అందించలేదు. ఎంజీ హెక్టర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి కస్టమర్లకు అందుబాటులో ఉండటం చాలా సంతోషించే విషయం. టర్బో పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 142 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అదే డీజిల్ 168 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫియట్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్‌తో MG హెక్టర్ పవర్‌ను పొందుతుంది. రెండు ఇంజన్లు కూడా ప్రామాణికంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జోడించడం జరిగింది. ఈజీగా ఉండటానికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారు పెట్రోల్ మోడల్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








