రూ.5.99 లక్షల ధర.. 20 కి.మీల మైలేజ్ కారునే ఎక్కువగా కోరుకున్న జనాలు.. 2024లో సేల్స్ ఎన్నంటే..

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ కంపెనీ నిస్సాన్ (Nissan) ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. చాలా కాలంగా నిస్సాన్ ఇక్కడ అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తూ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటుంది. భారతీయ వినియోగదారులకు అనువుగా బ్జడ్జెట్ ధరలో కార్లను తీసుకొస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా తన వాహనాలను పరిచయం చేస్తుంది. కంపెనీ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉండటంతో సేల్స్ పరంగా మెరుగైన స్థానంలో ఉంది. తాజాగా విడుదల అయిన డేటా ప్రకారం, నిస్సాన్‌కు చెందిన ప్రముఖ మోడల్ మాగ్నైట్ (Magnite) డిసెంబర్ 2024లో మొత్తం 11,676 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ ఇటీవల కొత్తగా అక్టోబర్ నెలలో కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోను ఏకంగా 10,000 బుకింగ్‌లను సాధించింది.

పాత మోడల్ మాగ్నైట్‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చారు. మొత్తంగా 2024 క్యాలెండర్ ఇయర్‌లో నిస్సాన్ మాగ్నైట్ 91,184 యూనిట్లు అమ్ముడుపోయింది. ఏడాది కాలంలో లక్ష మైలురాయికి చేరడానికి దగ్గరికి వచ్చినప్పటికీ ఈ సంఖ్యను మాత్రం చేరుకోలేదు. అయినప్పటికి కూడా మాగ్నైట్ 2024 సేల్స్‌లో మెరుగైన సంఖ్యలను సాధించింది. 2025 కొత్త ఏడాదిలో ఇటీవల వచ్చిన కొత్త మోడల్ మరిన్ని విక్రయాలను సాధిస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది.

Nissan Magnite 91184 Sold Units In 2024 Year

ఇదిలా ఉంటే ఇటీవల, నిస్సాన్ ఇండియాలో విడుదల చేసిన కొత్త మాగ్నైట్‌ను‌ ఇక్కడే లోకల్‌గా తయారు చేస్తుంది. దీన్ని దేశీయంగా విక్రయించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు సైతం ఎగుమతి చేస్తుంది. డిసెంబర్ 2024లో మొత్తం షిప్‌మెంట్‌లు 9,558 యూనిట్లుగా ఉన్నాయి. అదే దేశీయంగా అమ్మకాలు 2,118 యూనిట్లుగా నమోదు అయ్యాయి. మొత్తంగా సేల్స్ 11,676 గా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ సారి కంపెనీ సేల్స్ పెరిగాయి.

2023 ఏడాది డిసెంబర్‌లో విక్రయించిన యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది ఇదే నెలలో ఎగుమతుల వృద్ధి 72 శాతంగా నమోదైంది. అదే నవంబర్ 2024లో ఎగుమతులతో పోలిస్తే ఇది గత నెల 43 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా నిస్సాన్ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా మాగ్నైట్ మోడల్ డిజైన్ చాలా మంది కస్టమర్లను ఆకట్టుకోవడంతో సేల్స్ పెరిగాయి. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ సైతం మాగ్నైట్ ఉత్పత్తిని పెంచింది.

Nissan Magnite 2024 Total Sales Units

అక్టోబర్ 2024లో వచ్చిన కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ను పొందండం అంటే మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మాగ్నైట్‌కు అభిమానులు ఉండటం దీని డిమాండ్‌ను సూచిస్తుంది. కారు లాంచ్ అయిన ఒక్క నెలలోనే దక్షిణాఫ్రికాకు దాదాపు 2,700 యూనిట్లను సరఫరా చేయడం జరిగింది.

2024 నిస్సాన్ మాగ్నైట్ ధర విషయానికి వస్తే, ఇది రూ. 5.99 లక్షల(ఎక్స్-షోరూమ్)కు విడుదల అయింది. టాప్ వేరియంట్ రూ.11.50 లక్షల(ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 71 bhp పవర్, 96 Nm గరిష్ట టార్క్‌ను, 1.0-లీటర్ టర్బో పెట్రోల్‌తో 99 bhp పవర్, 152 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది Vicia, Vicia+, Acenta, N-Connecta, Tecna, Tecna+ వేరియంట్లలో లభిస్తుంది.

Magnite 91184 Sold Units In 2024

2024 నిస్సాన్ మాగ్నైట్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్‌లు 20 కి.మీల వరకు మైలేజ్ ఇస్తాయి. అదే టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ 17.4 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు డిజైన్ కొత్తగా ఉంది. క్యాబిన్‌లో కూడా అధునాతన ఫీచర్లు, ప్రయాణికుల కోసం సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 2, 2025, 12:38 [IST]
English summary
Nissan has sold 91184 magnite units in 2024 year and december bookings crosses 10000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+