మైలేజ్ కోరుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. నిస్సాన్ మాగ్నైట్ కార్లలో ఏఎమ్‌టి సిఎన్‌జి కిట్ రిలీజ్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఖర్చును కూడా అదుపులో ఉంచుకునేందుకు చాలా మంది కస్టమర్‌లు ఇప్పుడు సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచే సీఎన్‌జీ మోడళ్లను అందిస్తున్నాయి.

ఈ కోవలోనే నిస్సాన్ (Nissan) కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ మాగ్నైట్ (Magnite) కోసం షోరూమ్‌లలో అమర్చే రెట్రో సీఎన్‌జీ కిట్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ముఖ్యంగా ఇప్పటివరకు మాన్యువల్ గేర్‌బాక్స్ కార్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సీఎన్‌జీ కిట్‌ను, ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT) కార్లకు కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ కొత్త సీఎన్‌జీ ఆప్షన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Nissan Magnite AMT Gets Retro CNG Kit Offers 30 km kg Mileage for Just Rs 71 999 Extra

నిస్సాన్ కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ మాగ్నైట్ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు, ఇతర కంపెనీల మాదిరిగా ఫ్యాక్టరీలో కాకుండా, షోరూమ్‌లలోనే అమర్చే రెట్రో సీఎన్‌జీ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ గేర్‌బాక్స్‎తో పాటు, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) కార్లలో కూడా అమర్చుకోవచ్చు.

ఈ సీఎన్‌జీ కిట్ కావాలంటే కస్టమర్‌లు తాము ఎంచుకున్న కారు ఎక్స్-షోరూమ్ ధరతో పాటు, అదనంగా కేవలం రూ.71,999 చెల్లించాలి. ఈ మొత్తం చెల్లిస్తే, డీలర్‌షిప్‌ సిబ్బందే ఈ కిట్‌ను కారులో అమర్చి ఇస్తారు. ఈ సీఎన్‌జీ కిట్‌తో కూడిన నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ మొత్తం ధర రూ.6.89 లక్షల నుంచి రూ.9.70 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Nissan Magnite AMT Gets Retro CNG Kit Offers 30 km kg Mileage for Just Rs 71 999 Extra

నిస్సాన్ కంపెనీ తన సీఎన్‌జీ కిట్‌పై కస్టమర్‌లకు మంచి వారంటీని అందిస్తోంది. ఈ రెట్రో సీఎన్‌జీ కిట్‌పై లక్ష కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) వారంటీ లభిస్తుంది. ఈ కిట్‌ను అమర్చిన తర్వాత, మాగ్నైట్ కారు సీఎన్‌జీ, పెట్రోల్ రెండు ఇంధనాలతోనూ నడుస్తుంది. వాహనంలో ఇచ్చిన స్విచ్ ద్వారా డ్రైవర్ ఈజీగా ఇంధనాన్ని మార్చుకోవచ్చు.

మైలేజ్ విషయానికి వస్తే, మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న వాహనాలకు సీఎన్‌జీలో ఒక కిలో ఇంధనానికి సిటీలో 24 కి.మీ, హైవేపై 30 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఎమ్‌టీ (AMT) వెర్షన్‌లో ఈ మైలేజ్ ఇంకాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

Nissan Magnite AMT Gets Retro CNG Kit Offers 30 km kg Mileage for Just Rs 71 999 Extra

1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72 పీఎస్ ఎనర్జీని, 96 ఎన్ఎమ్ టార్క్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ ఏఎమ్‌టీ (EZ-Shift) గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ప్రస్తుతం మాగ్నైట్ మొత్తం 5 వేరియంట్లలో ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఇది కాకుండా, మరింత పవర్ఫుల్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా మాగ్నైట్‌లో అందుబాటులో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: సీఎన్‌జీ వాహనాలను కోరుకునే చాలా మంది కస్టమర్‌లు ఇప్పటివరకు డ్రైవింగ్ సౌలభ్యం తక్కువగా ఉండే మాన్యువల్ గేర్ కారునే ఎంచుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో నిస్సాన్ మాగ్నైట్‌లో ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో సీఎన్‌జీ కిట్‌ను అందించడం అనేది చాలా మంచి నిర్ణయం.

Nissan Magnite AMT Gets Retro CNG Kit Offers 30 km kg Mileage for Just Rs 71 999 Extra

ఈ డ్యుయల్ ఆప్షన్ వల్ల సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు గేర్ మార్చే శ్రమ లేకుండా (ఆటోమేటిక్) ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. డ్రైవింగ్ సౌలభ్యం, అధిక మైలేజ్ (తక్కువ ఖర్చు) రెండూ ఒకే కారులో ఉండటం వల్ల, నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, October 17, 2025, 10:14 [IST]
English summary
Nissan magnite amt gets retro cng kit offers 30 km kg mileage for just rs 71 999 extra
Read more on: #nissan magnite #cng #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+