బ్లాక్ పాంథర్ లా మార్కెట్లోకి దూసుకొచ్చిన నిస్సాన్ నయా మోడల్.. చూపుతిప్పుకోనివ్వని ఫీచర్లు, అదరిపోయే మైలేజ్
నిస్సాన్ కంపెనీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మాగ్నైట్ కారు. ఈ ఒక్క కారుతోనే నిస్సాన్ భారత మార్కెట్లో చాలా గట్టిగా నిలబడింది. మాగ్నైట్ లాంచ్ అయి దాదాపు ఐదేళ్లు అవుతున్నా, దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్‌ను కొత్త లుక్‌లో కురో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్ కలర్, అదిరిపోయే ఫీచర్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తున్న ఈ కారు ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కొన్ని కార్లు మార్కెట్‌లో ఒంటరిగా కూడా బలంగా నిలబడగలవు. జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తయారు చేసిన మాగ్నైట్ అలాంటిదే. సుమారు ఐదు సంవత్సరాలుగా, ఈ కారు ఇండియన్ మార్కెట్‌లో చాలా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలను మరింత పెంచడానికి కురో ఎడిషన్ అనే స్పెషల్ మోడల్‌ను విడుదల చేసింది.

కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండే ఈ కారు ధర రూ.8.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మాగ్నైట్ కురో ఎడిషన్ పేరుకు తగ్గట్టే పూర్తిగా బ్లాక్ కలర్‌లో వస్తుంది. బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ ఇన్సర్ట్‌లతో కూడిన ఫుల్లీ-బ్లాక్ డిజైన్ ఈ కారుకు రాయల్ లుక్‌ని ఇస్తుంది.
దీని కోసం ఒనిక్స్ బ్లాక్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను కూడా నిస్సాన్ ప్రవేశపెట్టింది. లోపల కూడా డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, రూఫ్, సెంటర్ కన్సోల్ అన్నీ బ్లాక్ కలర్‌లోనే ఉంటాయి. మాగ్నైట్ కురో ఎడిషన్ మామూలు మాగ్నైట్ N-కనెక్ట్ వేరియంట్‌పై ఆధారపడి తయారు చేయబడింది. ప్రస్తుతం రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీని ధరలు ఇలా ఉన్నాయి.

కురో ఎడిషన్ 1.0 NA పెట్రోల్ మాన్యువల్ ధర రూ.8.30 లక్షలు, కురో ఎడిషన్ 1.0 NA పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.8.55 లక్షలు, కురో ఎడిషన్ 1.0 టర్బో మాన్యువల్ ధర రూ.9.71 లక్షలు, కురో ఎడిషన్ 1.0 టర్బో ఆటోమేటిక్ ధర రూ.10.86 లక్షలు
మాగ్నైట్ కురో ఎడిషన్‌లో కూడా సాధారణ మాగ్నైట్ కార్లలో ఉన్న ఇంజిన్‌లనే ఉపయోగించారు. 1.0లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71bhp పవర్, 96Nm టార్క్‌ను ఇస్తే, టర్బో ఇంజిన్ 98 bhp పవర్, 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టి, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

ఫీచర్ల విషయానికొస్తే, డ్యుయల్ డిజిటల్ స్క్రీన్స్, అర్కామిస్ సౌండ్ సిస్టం, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, ఐ-కీ ఆటో అన్‌లాక్, ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్, రియర్ ఏసీ వెంట్స్‌తో క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మాగ్నైట్ కార్లు అన్నీ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తాయి. ఈ కురో ఎడిషన్‌కు కూడా ఈ సేఫ్టీ రేటింగ్ వర్తిస్తుంది. ఇది వినియోగదారులకు సేఫ్టీ విషయంలో మరింత నమ్మకాన్ని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








