డబ్బా కారు అన్న వాళ్లు నోళ్లు మూయించారు కదా.. ఏకంగా సేఫ్టీలో 5స్టార్ రేటింగ్‌తో దుమ్ములేపేసింది
ఒకప్పుడు కేవలం 2-స్టార్ రేటింగ్ పొంది డబ్బా కారు అని విమర్శలు ఎదుర్కొన్న నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలలో నిస్సాన్ మాగ్నైట్‌లో భారీగా సేఫ్టీ అప్‌డేట్‌లను చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొన్నేళ్ల క్రితం నిస్సాన్ మాగ్నైట్‌ను గ్లోబల్ NCAP పరీక్షించినప్పుడు, అది కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఆ సమయంలో, కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తక్కువ ఉండటం, ఇతర సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే, నిస్సాన్ కంపెనీ తన కారు సేఫ్టీని మెరుగుపరచాలని నిర్ణయించుకుంది.

తాజాగా జరిగిన టెస్టింగులో మాగ్నైట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను చేర్చారు. ఈ అప్‌డేట్‌ల తర్వాత తిరిగి టెస్ట్ చేసినప్పుడు ఈ కారు అడల్ట్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్‌ను, చిల్డ్రన్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది నిస్సాన్ ఇంజనీరింగ్ బృందం కృషికి నిదర్శనం.
వేరియంట్ల వారీగా సేఫ్టీ రేటింగ్‌లను పరిశీలిస్తే.. నిస్సాన్ మాగ్నైట్ మూడు వేర్వేరు వేరియంట్లను ఈ సేఫ్టీ టెస్టులకు గురి చేశారు. బేస్ వేరియంట్ అడల్ట్ సేఫ్టీలో 34కు 24.49 పాయింట్లు, చిల్డ్రన్ సేఫ్టీలో 49కు 18.39 పాయింట్లు పొంది 2-స్టార్ రేటింగ్‌ను సాధించింది.

మిడ్ వేరియంట్ అడల్ట్ సేఫ్టీలో 34కు 26.51 పాయింట్లు, చిల్డ్రన్ సేఫ్టీలో 49కు 36 పాయింట్లు పొందింది. టాప్ వేరియంట్ అడల్ట్ సేఫ్టీలో 34కు 32.31 పాయింట్లు, చిల్డ్రన్ సేఫ్టీలో 49కు 33.64 పాయింట్లు పొందింది. ఈ వేరియంట్ అడల్ట్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.
గ్లోబల్ NCAP పరీక్షించిన నిస్సాన్ మాగ్నైట్ మోడల్ కేవలం భారతదేశంలోనే కాకుండా, ఆఫ్రికా మార్కెట్లో కూడా విక్రయించబడుతోంది. నిస్సాన్ కంపెనీ సేఫ్టీ ఫీచర్లను మెరుగుపరచడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 5-స్టార్ రేటింగ్ వల్ల ఈ కారు అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్ కారు రూ.6.14 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ.11.92 లక్షల వరకు ఉంటుంది. మార్కెట్లో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. నిస్సాన్ కంపెనీ అమ్మకాలలో ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: కారు కొనుగోలు చేసే వారికి సేఫ్టీ అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిస్సాన్ మాగ్నైట్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం ఒక గొప్ప విజయం. ఇది బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, భారత మార్కెట్‌లో నిస్సాన్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








