కస్టమర్లకు మరో షాక్ ఇచ్చిన నిస్సాన్.. లీటరుకు 20కి.మీ. మైలేజీ ఇచ్చే కారు ధర భారీగా పెంపు

మన దేశంలో బడ్జెట్ కార్ల మార్కెట్ రోజురోజుకు బాగా వృద్ధి చెందుతుంది. బడ్జెట్ కార్ల మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కార్ల కొనుగోలు విషయంలో మిడిల్ క్లాస్ ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. దీంతో అన్ని కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నాయి. సూపర్ ఫీచర్స్‌తో బడ్జెట్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమైబైల్ కంపెనీ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కారు ధరను భారత మార్కెట్లో రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధరకు రిలీజ్ చేసింది. కాకపోతే ఫస్ట్ 10వేల డెలివరీలకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త వెర్షన్ పాత కారు మోడల్‌కు అనుగుణంగానే ఉన్నప్పటికీ కొన్ని మార్పులతో వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్ం చెలాయిస్తున్న కార్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ కొత్త అప్డేట్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

Nissan Magnite Car Review

నిస్సాన్ మాగ్నైట్ మార్కెట్లో పాపులర్ SUV. ఈ కారు కస్టమర్లను అట్రాక్ట్ చేసే డిజైన్‎తో, అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో నిస్సాన్ మాగ్నైట్ కూడా ఒకటి. గత నెలలో అంటే ఫిబ్రవరిలో 2,328 యూనిట్ల 'నిస్సాన్ మాగ్నైట్' కార్లు అమ్ముడుపోయాయి. కాకపోతే ఇకపై కొనేవాళ్లు గతంలో కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

నిస్సాన్​ మాగ్నైట్​ SUV ధరను రూ.4వేలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆశ్ఛర్యకర విషయం ఏంటంటే.. మాగ్నైట్ ధర పెరగడం ఇప్పటికే మూడు నెలల్లోపే ఇది రెండో సారి. నిస్సాన్ మాగ్నైట్ ఎస్ యూవీ ధరను రూ.22వేలు పెంచుతున్నట్లు జనవరి 31న కంపెనీ ప్రకటించింది. ఒక తాజా పెంపుదలతోఈ కారు ప్రారంభ ధర రూ.6.14 లక్షల(ఎక్స్-షోరూం)కు చేరుకుంది. ఈ ఎస్‎యూవీ ఆరు వేరియంట్లలో, 12కలర్ ఆఫ్షన్లు, 2ఇంజిన్లు, 3ట్రాన్స్మిషన్ ఆఫ్షన్లలో వస్తుంది.

Nissan Magnite Car Interior

తాజా ధరల పెంపు అనేది మన దేశంలో నిస్సాన్ కంపెనీ విక్రయించే మాగ్నైట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఫలితంగా నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ షోరూం ధర రూ.6.14లక్షల నుంచి రూ.11.92లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఈ మాగ్నైట్ శ్రేణిని ఈ20 కంపాక్టబుల్ పవర్ ట్రెయిన్ తో అప్ డేట్ చేసింది. ఎస్ యూవీకి చెందిన 1.0లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ బీఆర్ 10పెట్రోల్ ఇంజిన్ కాస్త ఈ 20కంప్లైంట్ గా మారింది.

మాగ్నైట్ SUV 6 వేరియంట్లో వస్తుంది. అవి విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్.ఈ కారు ఎక్సటర్నల్ డిజైన్ ఎట్రాక్ట్ చేస్తుంది. దీనిలో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్, LED టెయిల్ లాంప్‌లు ఉన్నాయి. దీనికి 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. స్టార్మ్ వైట్, బ్లేడ్ సిల్వర్, సన్‌రైజ్ కూపర్ ఆరెంజ్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్ కలర్స్‎లో లభిస్తుంది.

Nissan Magnite Car Rare View

కొత్త నిస్సాన్ మాగ్నైట్ SUV 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారుకు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్ ఆఫ్షన్లు ఉన్నాయి. లీటరుకు 17.4 నుండి 20 కి.మీ. మైలేజీని అందిస్తుంది.దీనిలో ఐదుగురు ఈజీగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 336 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంటుంది. ఈ కారులో 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.ఈ కారులో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగులు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీల కెమెరా ఉన్నాయి. ఈ కారు మార్కెట్లో మహీంద్రా XUV3XO గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2025, 11:15 [IST]
English summary
Nissan shocks customers again price hike on magnite suv with a mileage of 20 km l
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+