రూ.6 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ.. 20 కి.మీ మైలేజ్ పైగా రూ.లక్ష వరకు డిస్కౌంట్ వెంటనే కొనేయండి

తక్కువ ధరలో మంచి ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? నిస్సాన్ మాగ్నైట్ మీ ఛాయిస్ అయితే వెంటనే కొనేయండి. ఈ కారు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత రియల్ గేమ్ చేంజర్ అనిపించుకుంది. చాలా ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లు, పైగా బడ్జెట్ ధరలో దొరుకుతుంది.

మే నెలలోనే 1,334 నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. ఈ జూన్ నెలలో ఈ కారుపై ఏకంగా లక్ష రూపాయల వరకు భారీ తగ్గింపులు ప్రకటించారు. ఈ కారు గురించి వివరంగా తెలుసుకుందాం.

Nissan Magnite

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ఒక పాపులర్ ఎస్‌యూవీ. ఇది మార్కెట్‌లోకి వచ్చాక ఒక గేమ్ చేంజర్ కారుగా మారింది. చాలా ఆకర్షణీయంగా ఉంటూ అందరికీ అందుబాటు ధరలో దొరుకుతుంది. గత నెలలో ఏకంగా 1,334 'మాగ్నైట్' ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు, ఇదే జూన్ నెలలో ఈ కారుకు భారీ స్థాయిలో డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు.

దక్షిణ రాష్ట్రాల్లో 2025లో తీసుకున్న నిస్సాన్ మాగ్నైట్ కారులోని వివిధ వేరియంట్‌లపై రూ.40,000 నుండి రూ.80,000 వరకు డిస్కౌంట్ ఉంది. అదే విధంగా, 2024లో తయారైన వేరియంట్లపై రూ.25,000 నుండి ఏకంగా రూ.1.25 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.

Nissan Magnite

నిస్సాన్ మాగ్నైట్ కనీస ధర రూ.6.14 లక్షలు, గరిష్ట ధర రూ.11.76 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది విసియా(XE), విసియా ప్లస్(XL), అస్సెంటా(XV), ఎన్-కనెక్టా(XV Premium), టెక్నా(XV Turbo), టెక్నా ప్లస్(XV Premium Turbo)తో సహా 6 ఆకర్షణీయమైన వేరియంట్ల ఎంపికలో లభిస్తుంది.

ఈ కారు చూసేవారి కళ్లు చెదిరే డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (DRLs), ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్‌లు, 16-అంగుళాల డ్యుయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. అంతేకాకుండా, స్టార్మ్ వైట్, బ్లేడ్ సిల్వర్, సన్‌రైజ్ కూపర్ ఆరెంజ్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఓనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Nissan Magnite

నిస్సాన్ మాగ్నైట్‌లో ఐదుగురు కూర్చునే సౌకర్యం ఉంటుంది. ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. వీకెండ్ ట్రిప్పులకు లేదా సెలవుల్లో ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి వీలుగా దాదాపు 336 లీటర్ల కెపాసిటీ గల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఈ కొత్త ఎస్‌యూవీ పవర్‎ఫుల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 1-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లను అందిస్తుంది. వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్/ 5-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ (CVT) గేర్‌బాక్స్ ఆప్షన్‌లు ఉన్నాయి. సాధారణ బైక్‌ల మాదిరిగానే 17 నుండి 20 కేఎంపీఎల్ (kmpl) వరకు మైలేజ్ ఇస్తుంది.

Nissan Magnite

ఈ కారు క్యాబిన్ డిజైన్ చాలా బాగుంది. ఇందులో పదుల సంఖ్యలో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 4 రంగుల యాంబియెంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

కొత్త ఎస్‌యూవీ ప్రయాణికులకు బెస్ట్ సేఫ్టీని అందిస్తుంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సర్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారుకు దేశీయ మార్కెట్లో చాలా గట్టి పోటీదారులు ఉన్నారు. ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి ఎస్‌యూవీలు నిస్సాన్ మాగ్నైట్‌కు బలమైన పోటీని ఇస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: నిస్సాన్ మాగ్నైట్ తన ధర, ఫీచర్లు, మైలేజ్, ఇప్పుడు అదనంగా ఇస్తున్న భారీ డిస్కౌంట్‌లతో నిజంగా ఒక మంచి ఆప్షన్. ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. మార్కెట్‌లో పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ నిస్సాన్ ఈ ఆఫర్లతో మాగ్నైట్ అమ్మకాలను పెంచుకోవాలని చూస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 13, 2025, 16:05 [IST]
English summary
Only rs 6 lakhs for a super suv 20 kmpl mileage up to rs 1 lakh discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+