ఈ కారు కొనేందుకు క్యూలో నిలబడ్డ రాజకీయ నాయకులు..అంత స్పెషాలిటీ ఇందులో ఏముందో ?
ఎంజీ మోటార్స్ (MG Motors) ఒక బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ. ఇది ప్రస్తుతం చైనాకు చెందిన SAIC మోటార్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది. ఎంజీ మోటార్స్ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇప్పుడు SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లతో సహా అనేక రకాల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ మోటార్స్ 2019లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాణ్యమైన, టెక్నాలజీతో నిండిన కార్లను అందించడం ద్వారా భారత మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఇండియన్ SUV మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి MG మోటార్స్ రెడీ అవుతుంది. రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన BMGE 2025 ఈవెంట్లో MG మోటార్ కంపెనీ తన గ్లోబల్ లైనప్ నుంచి అనేక వాహనాలు ప్రదర్శించింది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో భారత మార్కెట్ కోసం కొత్త మోడళ్లను ప్రదర్శించింది. ఈ సందర్భంలో మెజిస్టర్ అనే SUV అందరి దృష్టిని ఆకర్షించింది.

BMGE 2025 ఈవెంట్‌లో ప్రదర్శించిన మెజిస్టర్ ఫుల్-సైజ్ SUV, టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వాహనం ఇండియన్ SUV మార్కెట్‌లో తన ప్రభావాన్ని విస్తరించడానికి MG మోటార్స్‌కు సాయపడుతుందని అంటున్నారు. ఎంజీ మెజిస్టర్ను ఇండియాలో విడుదల చేయడం ద్వారా పోటీ ఎక్కువగా ఉండే ఎస్యూవీ సెగ్మెంట్లో ఎంజీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. మెజిస్టర్ అంతర్జాతీయ మార్కెట్లో సక్సెస్ అయిన మాక్సస్ D90 రీబ్రాండెడ్ వెర్షన్. ఈ కారులో లేటెస్ట్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు అత్యాధునిక ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్‌లతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ కారులో 213 bhp శక్తిని ఉత్పత్తి చేసే 2.0L ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. 478 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12.3-ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మసాజ్ సీట్లు, లెవల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు లోపల లగ్జరీ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. ఇందుకు లేటెస్ట్ ఫీచర్లను అందించారు. అదనంగా, వివిధ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇది దాని ప్రయాణీకులకు లగ్జరీ, సౌకర్యాన్ని అందిస్తుంది. ఎంజీ మెజిస్టర్ విడుదల తర్వాత దాని ప్రీమియం ఆఫర్లతో ఎస్యూవీ మార్కెట్‌ను కుదిపేస్తుందని అంటున్నారు. లగ్జరీ, టెక్నాలజీ, పర్ఫామెన్స్ మిశ్రమాన్ని అందించి.. మార్కెట్లో ఓ కంపెనీకి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తుందని అంటున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత రాజకీయ నాయకులు ఎక్కువగా టయోటా ఫార్చ్యూనర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు MG మెజిస్టర్ రాకతో, ఈ లగ్జరీ SUV రాజకీయ నాయకులకు కొత్త ఎంపికగా మారే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








