తక్కువ ధరలో అదిరిపోయే SUVలు.. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్‌లలో ఏది బెస్ట్ ?
నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్... ఈ రెండు కార్లు వాటి బ్రాండ్‌ల తరఫున మార్కెట్లో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే కార్లు ఎప్పుడూ మార్కెట్‌కు శుభవార్లనే అందిస్తున్నాయి. కానీ, కొనేటప్పుడు ఏది బెస్టో తేల్చుకోవడం మాత్రం కాస్త కష్టమే. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ రెండు కాంపాక్ట్ SUVలలో ఏది బెటరో చెప్పడానికి ఓ సారి రెండింటినీ పోల్చి చూద్దాం.
నిస్సాన్ మాగ్నైట్ SUV ధర రూ.6.14 లక్షల నుంచి రూ.11.76 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది విసియా, విసియా ప్లస్, అస్సెంటా & ఎన్-కనెక్టాతో సహా అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో నిస్సాన్ కంపెనీ ఎక్కువగా అమ్ముతున్న కార్లలో ఇది ఒకటి.

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు ధర రూ.6.12 లక్షల నుంచి రూ.9.45 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది ప్యూర్, ప్యూర్ (ఓ), క్రియేటివ్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ఎస్‌తో సహా మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. అన్ని బ్రాండ్‌లను దాటుకుని దేశంలో భారీ సంఖ్యలో అమ్ముడవుతున్న SUVలలో ఇది ఒకటి.
2024 అప్‌డేటెడ్ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ SUV 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 87 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG ఇంజిన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

కొత్త నిస్సాన్ మాగ్నైట్ కారు పవర్ ఫుల్ రెండు పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంది. 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.
టాటా పంచ్ పెట్రోల్ మోడల్ లీటరుకు 18.8 నుండి 19-20కిమీ మైలేజ్‌ను ఇస్తుంది. CNG మోడల్ కిలోకు 26.99కిమీ మైలేజ్‌ను ఇస్తుంది. నిస్సాన్ మాగ్నైట్ మైలేజ్ విషయానికి వస్తే లీటరుకు 17 నుండి 20కిమీ వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఈ రెండు కార్లు కూడా మైలేజ్ విషయంలో మంచి గణాంకాలను అందిస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ SUV 5 సీట్లను కలిగి ఉంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.
2024 పంచ్‌లో ఇప్పుడు సెంటర్ కన్సోల్‌లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక AC వెంట్స్ ఉన్నాయి. దీనితో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు ఆర్మ్ రెస్ట్ అందించారు.

కొత్త నిస్సాన్ మాగ్నైట్ కారు సేఫ్టీకు కూడా పేరుగాంచింది. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఫ్రంట్ రేర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది. ఈ SUVకి టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా అతిపెద్ద పోటీదారులు.
టాటా పంచ్ ఎంట్రీ-లెవెల్ వేరియంట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ హోల్డ్ అసిస్ట్, రోల్-ఓవర్ మిటిగేషన్‌తో సహా వివిధ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లు అదనంగా 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి.
మరో శుభవార్త ఏమిటంటే నిస్సాన్ మాగ్నైట్ కూడా CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లో విడుదల కానుంది. ఈ కారు గరిష్ట మైలేజ్‌ను అందించే అవకాశం ఉంది. దీనివల్ల లో మెయింటెనెన్స్ ఖర్చుతో కొత్త SUV కొనాలనుకునే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది.
టాటా పంచ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లతో వస్తుంది. మొత్తం ఏడు వేరియంట్లలో CNG ట్రిమ్ కూడా అందుబాటులో ఉంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు పాత పంచ్ వలె అదే 87 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ఒక గేమ్-ఛేంజర్ SUVగా నిరూపించుకుంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉండటంతో భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. ప్రతి నెలా 2,000 కంటే ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ మాగ్నైట్ SUVని ఇష్టపడి కొంటున్నారు. ప్రస్తుతం కొత్త నిస్సాన్ మాగ్నైట్‌ను కొత్త అవతారంలో విడుదల చేయడానికి కంపెనీ వేగంగా సిద్ధమవుతోందని సమాచారం.
టాటా పంచ్ మార్కెట్‌లోకి ప్రవేశించిన 38 నెలల్లోనే 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది భారతీయ మార్కెట్‌లో టాటా కార్ సాధించిన అద్భుతమైన వృద్ధిని సూచిస్తుంది. గత క్యాలెండర్ సంవత్సరంలోనే టాటా 2.02 లక్షల పంచ్ కార్లను విక్రయించింది. ఇక 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మొత్తం 1.48 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








