నీ కష్టాలు పగోడికి కూడా రావొద్దు.. జీఎస్టీ తగ్గించినా లాభం లేదు.. మార్కెట్లో పోరాడుతున్న రెనాల్ట్, నిస్సాన్

భారత మార్కెట్‌లో తమకంటూ ఒక పటిష్టమైన స్థానం దక్కించుకోవడానికి విదేశీ కార్ల కంపెనీలైన రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గత కొన్నేళ్లుగా చాలా కష్టపడుతున్నాయి. అక్టోబర్ 2025 కార్ల విక్రయాల జాబితాలో రెనాల్ట్ పదో స్థానంలో, నిస్సాన్ పన్నెండో స్థానంలో నిలిచాయి.

పండుగ సీజన్ డిమాండ్‌తో పాటు జీఎస్టీ 2.0 వంటి మార్పులు వచ్చినా, ఈ రెండు కంపెనీలకు ఆశించినంత పెద్ద విజయం దక్కలేదు. ఈ రెండు కంపెనీల పరిస్థితి ఎలా ఉంది, వాటి అమ్మకాల లెక్కలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Renault-Nissan Struggle Continues Sales Growth Fails to Boost Market Share Significantly

రెనాల్ట్ సేల్స్ : అక్టోబర్ 2025 నెలలో రెనాల్ట్ మొత్తం 4,672 కార్లను విక్రయించి, గత ఏడాది అక్టోబర్‌లో (3,870 కార్లు) కంటే 21% వృద్ధిని నమోదు చేసింది. నెలవారీ అమ్మకాలలో కూడా సెప్టెంబర్ 2025 కంటే 10% వృద్ధి కనిపించింది. రెనాల్ట్ మొత్తం మార్కెట్‌లో తమ వాటాను 1.1% గా కొనసాగించింది. రెనాల్ట్ అమ్మకాల్లో త్రిబర్ (Triber) కారు కీలక పాత్ర పోషించింది. ట్రైబర్ ఏకంగా 3,170 యూనిట్లు అమ్ముడైంది.

ఇది గత అక్టోబర్‌తో పోలిస్తే 50%, సెప్టెంబర్‌తో పోలిస్తే 23% పెరిగింది. అయితే, రెనాల్ట్ ఇతర మోడళ్లు కొంచెం వెనుకబడ్డాయి. కైగర్ (Kiger) 948 యూనిట్లతో 10% అమ్మకాల క్షీణతను నమోదు చేయగా, క్విడ్ (Kwid) 554 యూనిట్లతో 22% క్షీణతను ఎదుర్కొంది. రెనాల్ట్‌కు ప్రస్తుతం త్రిబర్, కైగర్, క్విడ్ అనే మూడు మోడళ్లే ఆధారం.

Renault-Nissan Struggle Continues Sales Growth Fails to Boost Market Share Significantly

నిస్సాన్ సేల్స్ : నిస్సాన్ కంపెనీ పరిస్థితి మరింత కష్టంగా ఉంది. ఎందుకంటే వారి అమ్మకాలు పూర్తిగా మాగ్నైట్ (Magnite) కారుపైనే ఆధారపడి ఉన్నాయి. అక్టోబర్‌లో నిస్సాన్ మొత్తం 2,615 యూనిట్లను విక్రయించింది. ఇది గత సెప్టెంబర్ (1,652 యూనిట్లు) తో పోలిస్తే 58% భారీ పెరుగుదల.

జీఎస్టీ 2.0, పండుగ డిమాండ్ మాగ్నైట్ అమ్మకాలకు బాగా సహాయపడింది. అయినప్పటికీ, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే మాత్రం నిస్సాన్ అమ్మకాలు 16.21% క్షీణించాయి. వారి మార్కెట్ వాటా కూడా 0.8% నుండి 0.6% కి తగ్గింది.

Renault-Nissan Struggle Continues Sales Growth Fails to Boost Market Share Significantly

భారత మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ఈ రెండు కంపెనీలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రెనాల్ట్ తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన నెక్స్ట్ జనరేషన్ డస్టర్‌ను (Next Generation Duster) జనవరి 26, 2026న విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. నిస్సాన్ కూడా కేవలం మాగ్నైట్ పై ఆధారపడకుండా 2026 రెండవ త్రైమాసికంలో కొత్త నిస్సాన్ టెక్టన్ (Tekton) కారును తీసుకురాబోతోంది.

ఇది కాకుండా నిస్సాన్ బి-ఎమ్‌పివి (B-MPV) విభాగంలో కొత్త 7-సీటర్ కారు, సి-ఎస్‌యూవీ (C-SUV) విభాగంలో మరో 7-సీటర్ కారు వంటి ప్రొడక్ట్స్ 2026, ఆ తర్వాత విడుదల చేయనుంది.

రెనాల్ట్, నిస్సాన్ కలిసి పనిచేస్తున్నప్పటికీ, భారత మార్కెట్‌లో ఈ విదేశీ కంపెనీలు తమకంటూ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి చాలా కాలంగా పోరాడుతున్నాయి. 2026 సంవత్సరం కొత్త కార్ల రాకతో ఈ రెండు కంపెనీలకు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని ఆటో నిపుణులు ఆశిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 19, 2025, 16:27 [IST]
English summary
Renault nissan struggle continues sales growth fails to boost market share significantly
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+