టాటా ఆల్ట్రోజ్ మహీంద్రా థార్ యాక్సిడెంట్ వీడియో.. సేఫ్టీ పరంగా రెండింట్లో ఏది బెస్టో తెలిసిపోయింది!

కారు కొనేముందు దాని డిజైన్, ఫీచర్లు, మైలేజీతో పాటు అందరూ చూసే ముఖ్యమైన అంశం సేఫ్టీ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కారు ప్రయాణికులకు ఎంత మేరకు సురక్షితమో చూసి మరీ కొనుగోలు చేస్తాం. అందుకే సేఫ్టీ రేటింగ్ అనేది.. వివిధ వాహనాల విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటుంది. అన్నీ బాగున్నా సేఫ్టీ రేటింగ్‌లో పడిపోయిన కారును కొనేందుకు ఎక్కువగా ఎవరూ ఆసక్తి చూపరు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయంలో దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా, మహీంద్రా సంస్థల పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. సేఫ్టీ పరంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తాయని ఈ కంపెనీలు పేరు సాధించాయి. అయితే మరి ఈ రెండింట్లో ఏది సేఫ్టీలో బెస్ట్? ఈ విషయం ఓ యాక్సిడెంట్ ద్వారా నిరూపితమైంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

టాటా కారు, మహీంద్రా కారు ఒకదానితో ఒకటి ఢీకొంటే ఏం జరుగుతుంది? మహీంద్రా థార్ కారు, టాటా ఆల్ట్రోజ్ కారు ఢీకొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కోజీకోడ్ జిల్లాలో ఈ ప్రమాదం జరగగా దీని వీడియో బయటకు వచ్చింది. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలేంటనేవి ఇంకా తెలియరాలేదు.

Tata Altroz Mahindra thar collision

ఈ వీడియోలో ఈ రెండు కార్లు ఒకదాన్ని ఒకటి ఎదురెదురుగా ఢీకొన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టాటా ఆల్ట్రోజ్ కారు బానెట్ పూర్తిగా నాశనమై కనిపించింది. దాంతో పాటు దాని ఫ్రంట్ బంపర్, సైడ్ ఫెండర్ కూడా పాడైపోయి ఉన్నాయి. హెడ్‌ల్యాంప్స్ మొత్తం పగిలిపోయాయి.

ప్రమాదం జరిగినప్పుడు ఈ కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నట్లుగా ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే క్యాబిన్ ఏమాత్రం దెబ్బతినకుండా కనిపించింది. కానీ, ఫ్రంట్ బంపర్, గ్రిల్, ఫెండర్, బానెట్ మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో టాటా ఆల్ట్రోజ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.

Tata Altroz Mahindra thar collision

ఇక మహీంద్రా థార్ విషయానికి వస్తే... దాని ప్రంట్ యాక్సిల్, వీల్ మొత్తం విరిగిపోయాయి. అయితే.. దీని కేబిన్ కూడా ఏమాత్రం దెబ్బతినకుండా కనిపించింది. ఈ రెండు కార్లలోనూ ఏ- పిల్లర్ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంతేకాదు.. ఈ రెండు కార్లలో ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కూడా కాలేదు.

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్, టాటా ఆల్ట్రోజ్ రెండు కార్లు కూడా మంచి పనితీరు సొంతం చేసుకున్నాయి. మహీంద్రా థార్ 4- స్టార్ రేటింగ్ సాధించగా... ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్.. 5- స్టార్ రేటింగ్ సాధించింది. మొత్తానికి ఈ ప్రమాదం ద్వారా ఈ రెండు కార్లు కూడా బిల్డ్ క్వాలిటీలో ఉన్నతమైనవని నిరూపించాయి.

ఈ రెండు కార్ల బాడీ ప్యానెల్స్ అయితే ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. కానీ, వాటి ఫ్రేమ్స్, ఛాసిస్ మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఛాసిస్ స్ట్రాంగ్ లేనట్లయితే... దృఢంగా ఉన్నట్లు కనిపించే వాటి బాడీ ప్యానెల్స్‌తో పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి.. ఒక కారు బిల్డ్ క్వాలిటీని వాటి బాడీ ప్యానెల్స్ ఆధారంగా మాత్రమే నిర్ణయించలేం.

భారత్‌లో ప్రతిరోజు చాలా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలం. వాహనం నడుపుతున్న సమయంలో పూర్తి ధ్యాసంతా రోడ్డు మీదే ఉండాలి. అలాగే ప్యాసెంజర్స్.. తప్పకుండా సీట్ బెల్ట్స్ ధరించాలి. అప్పుడు మాత్రమే యాక్సిడెంట్ జరిగినా ప్రమాద స్థాయిని తగ్గించగలం.

More from DriveSpark

Article Published On: Saturday, January 25, 2025, 12:56 [IST]
English summary
Tata altroz mahindra thar collision viral video check crash impact and safety details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+