టాటా నెక్సాన్ 'డార్క్ రెడ్ సీఎన్‌జీ' వెర్షన్ విడుదల... ఈ బ్లాక్ బ్యూటీ ధర కేవలం రూ.12.70 లక్షలు మాత్రమే!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ మరో కొత్త మోడల్ కారుతో భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ సంస్థ నుంచి గతంలో వచ్చిన నెక్సాన్ ఎస్‌యూవీ భారత వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. దీని డైజన్, ఫీచర్లతో అందరికీ చేరువైంది. అందుబాటు ధరలో ఈ కారు ఉండడంతో సేల్స్ పరంగానూ ఈ కారు టాటా సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఇందులో ఇప్పుడు కొత్త మోడల్‌ను తీసుకువచ్చిందీ సంస్థ. ఇటీవల జరిగిన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో 'Nexon CNG Red Dark Edition' పేరుతో దీన్ని ప్రదర్శించగా... సోమవారం దీన్ని లాంఛ్ చేసింది. ఈ కారులో ఉండే ఫీచర్లు, దీని పర్ఫార్మెన్స్, మైలేజీ, ధర వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
టాటా నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీని సరసమైన ధరలో మార్కెట్లోకి టాటా సంస్థ తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇది రూ.12.70 లక్షల నుంచి రూ.13.69 లక్షల (ఎక్స్- షోరూమ్) ధరలో ఉంది. ఈ కారు Fearless Plus PS, Creative Plus PS, Creative Plus S వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ కొత్త నెక్సాన్ సీఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ కారు డిజైన్ రెగ్యులర్ నెక్సాన్ మోడల్ తరహాలోనే ఉంది. అయితే దీంట్లో కొన్ని 'కాస్మెటిక్ ఛేంజెస్' మాత్రం చేశారు. దీని ఎక్స్‌టీరియర్ కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో red accents తో ఉంటుంది. దీని ఇంటీరియర్.. piano black పెయింట్‌తో ఉంటుంది.
ఈ ఎస్‌యూవీలో అట్రాక్టివ్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇది 10.2- అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, జేబీఎల్- 8 స్పీకర్ సిస్టం, 360- డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉంటాయి. ఇది 5- సీటర్ ఆప్షన్‌తో వస్తుంది.
ఈ కొత్త నెక్సాన్ మోడల్ కారు.. శక్తిమంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌తో ఉంది. ఇది 1.2- లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్/సీఎన్‌జీ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 99 hp హార్స్ పవర్, 170 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6- స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో అనుసంధానించి ఉంటుంది. ఇది 24.08 కేఎంపీఎల్ మైలేజీ అందించగలదు.
ఈ నెక్సాన్ మోడల్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన టాటా నెక్సాన్ ఈవీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది రూ.12.49 లక్షల నుంచి రూ.17.19 లక్షల ఎక్స్- షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఇది 40.5 kilowatt (kWh), 46.08 kilowatt (kWh) బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్‌తో 390 నుంచి 489 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.
ఈ ఈవీ 5- సీట్ ఆప్షన్‌తో ఉంటుంది. దీంట్లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం సహా 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. దీంట్లో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ప్రయాణికుల రక్షణ కోసం ఇది రియర్ పార్కింగ్ సెన్సార్స్‌తో వస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








