భారీగా డబ్బుల ఆదా, అధిక మైలేజ్ కావాలంటే సీఎన్జీ కార్లను మించినవి లేవు.. మరి పంచ్, మాగ్నైట్లలో ఏది బెస్ట్

కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా ? పెట్రోల్ ధరల బాధ లేకుండా డబ్బులను ఆదా చేసుకోవాలని భావిస్తున్నారా ? అయితే టాటా (Tata) కార్లు కావాలా లేక నిస్సాన్ (Nissan) ఏది కొనాలో అని గందరగోళంలో ఉన్నారా ? CNG కార్లలో సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్(Tata Motors) అద్భుతమైన పరిష్కారాన్ని చూపింది.

దీంతో CNG అంటే టాటానే అనేంతలా పేరు సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు నిస్సాన్ కూడా తమ మాగ్నైట్ (Magnite) మోడల్‌కు CNG ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మరి ఈ రెండు కార్లలో ఏది బెటర్? టాటా పంచ్ CNG (Tata Punch CNG), నిస్సాన్ మాగ్నైట్ CNG లను పోల్చి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది చూద్దాం.

Tata Punch CNG

సీఎన్జీ కార్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇంధన ధరలతో విసిగిపోయిన ప్రజలకు చాలా బ్రాండ్లు కొంత ఉపశమనం కలిగించగలిగాయి. కానీ CNG మోడళ్ల సేఫ్టీ మరో ఆందోళనగా ఉండేది. టాటా మోటార్స్ తమ CNG మోడళ్ల ద్వారా దానికి కూడా పరిష్కారం కనుగొంది. ఇప్పుడు CNG అంటే టాటానే అని మార్కెట్లో గుత్తాధిపత్యం కొనసాగుతోంది.

ఈ సమయంలో నిస్సాన్ తమ మాగ్నైట్ మోడల్‌కు CNGని ప్రవేశపెట్టింది. ఒకే మోడల్‌తో మార్కెట్‌లో నిలదొక్కుకుంటున్న నిస్సాన్ అద్భుతమైన ప్లాన్‌గా దీన్ని చూడాలి. మరి టాటా పంచ్ CNG మోడల్‌కు, నిస్సాన్ మాగ్నైట్‌కు మధ్య పోలికను ఈ వార్తలో తెలుసుకుందాం.

Nissan Magnite

భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో లభించే CNG SUV టాటా పంచ్. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల కంటే తక్కువే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన వాహనం కోసం చూస్తున్న వారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా.

నిస్సాన్ మాగ్నైట్ విషయానికి వస్తే.. ఇతర బ్రాండ్ల మాదిరిగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌కు భిన్నంగా మాగ్నైట్‌లో ప్రభుత్వం ఆమోదించిన రెట్రోఫిట్ CNG కిట్‌లను అందిస్తున్నారు. నిస్సాన్ కోసం ఈ కిట్‌లను మోటోసన్ (Motosun) అనే థర్డ్ పార్టీ కంపెనీ తయారు చేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన రెట్రోఫిట్ CNG కిట్ ధర రూ. 74,999.

Nissan Magnite

మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే CNG కిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రత్యేకంగా గమనించాలి. ఇంధన సామర్థ్యమే నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌కు CNG కిట్ అమర్చడానికి కారణం.

ఇక CNG మోడళ్ల ఫీచర్ల విషయానికి వస్తే, టాటా పంచ్‌లో ఒక సాధారణ వ్యక్తికి అవసరమైన అన్ని ఫీచర్లను టాటా అందిస్తుంది. టాటా పంచ్ CNGలో కొత్త మిడ్ వేరియంట్లు అడ్వెంచర్ S (Adventure S) మరియు అడ్వెంచర్+ S (Adventure+ S) సన్‌రూఫ్ వంటి సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ఇది వాహనం ఆకర్షణను పెంచడానికి టాటాకు వచ్చిన ఒక మంచి ఆలోచన.

ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే.. టాటా పంచ్ ఒక అడుగు ముందుందని చెప్పాలి. ముఖ్యంగా సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా వినూత్నమైన డ్యూయల్ సిలిండర్ CNG టెక్నాలజీని తీసుకువచ్చింది పంచ్. ఆ తర్వాతనే పంచ్ ప్రత్యర్థి అయిన ఎక్స్‌టర్ (Exter) లో హ్యుందాయ్ (Hyundai) ఇదే పద్ధతిని అనుసరించింది. పెద్ద CNG సిలిండర్ ట్యాంకులు బూట్ స్పేస్‌ను ఆక్రమించే సమస్య దీనితో పరిష్కరించబడింది.

టాటా పంచ్ CNGకి 210 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది CNG కారును రోజువారీ ఉపయోగాలకు చాలా అనుకూలంగా చేస్తుంది. 90-డిగ్రీల డోర్‌లు కారులోకి ఎక్కడం మరియు దిగడం సులభతరం చేస్తాయి. ఈ 5 సీటర్ కారు రెండవ వరుసలో ముగ్గురు వ్యక్తులు హాయిగా ప్రయాణించవచ్చు కాబట్టి, కుటుంబాలకు ఇది ఒక మంచి ఆప్షన్.

మాగ్నైట్ CNG ఫ్యూయెల్ కెపాసిటీ కిలోగ్రామ్‌కు 18 నుండి 22 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, CNG మోడ్‌లో పవర్, టార్క్, సర్టిఫైడ్ మైలేజ్ కోసం అధికారిక గణాంకాలను నిస్సాన్ ఇంకా విడుదల చేయలేదు. CNG ఇంధన లక్షణాలు, టర్బో ఆప్షన్ లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాహనం పెర్ఫార్మెన్స్‌లో చిన్నపాటి రాజీలు వచ్చే అవకాశాలను లేవని చెప్పలేం.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా పంచ్ CNG డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో ప్రాక్టికాలిటీ, సేఫ్టీని అందిస్తుండగా, నిస్సాన్ మాగ్నైట్ రెట్రోఫిట్ CNG కిట్‌తో తక్కువ ధరలో CNG ఆప్షన్‌ను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, May 30, 2025, 15:50 [IST]
English summary
Tata punch cng vs nissan magnite cng a detailed comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+