మీకు సాహసయాత్ర చేయాలని ఉందా.. కొండలైనా.. గుట్టలైనా.. ఈజీ ఎక్కగల 5 డోర్ల SUVలు ఇవే!
కొత్త కారు కొనాలనుకునే వారికి ఆఫ్-రోడ్ SUVలంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఇవి సాధారణ రోడ్లపై సులభంగా వెళ్లగలగడమే కాకుండా, గుంతలు, దిబ్బలు, కొండ ప్రాంతాల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించేలా రూపొందించబడి ఉంటాయి. ఇక్కడ అత్యంత శక్తివంతమైన, ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ SUVలైన మహీంద్రా థార్ రాక్స్, మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా మోడళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx): ఇది ఒక పాపులర్ ఆఫ్-రోడ్ SUVగా నిలిచింది. భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. దీని పర్ఫామెన్స్‌కు వినియోగదారులు ఫిదా అయిపోతున్నారు. అందుకే కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఈ కారు రూ.13 లక్షల నుండి రూ.23 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉంది.

కొత్త మహీంద్రా థార్ రాక్స్, ధర ప్రకారం స్ట్రాంగ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ పొందింది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంది. ఇది లీటరుకు12.4 నుండి 15.2కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ SUVలో 5 సీట్లు ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny): ఇది కూడా ఒక ముఖ్యమైన ఆఫ్-రోడ్ SUV. అయితే, ఈ కారు అమ్మకాల్లో కంపెనీ అనేక ఒడిదుడుకులను చవిచూసింది. ప్రస్తుతం, దేశీయ వినియోగదారులకు జిమ్నీ SUV రూ.13 లక్షల నుండి రూ.15 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.

ఈ మారుతి సుజుకి జిమ్నీ పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు 16 నుండి 17 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో కూడా 4 సీట్ల ఎంపిక ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
ఫోర్స్ గూర్ఖా (Force Gurkha): ఈ ఆఫ్-రోడ్ SUV ఎక్కువ ప్రజాదరణ పొందింది. మహీంద్రా థార్ రాక్స్, మారుతి సుజుకి జిమ్నీకి స్ట్రాంగ్ పోటీదారుగా నిలిచింది. ఇది కూడా అందుబాటు ధరలో లభిస్తుంది. రూ.17 లక్షల నుండి రూ.18 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉంది.

కొత్త ఫోర్స్ గూర్ఖా SUV, 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికను పొందింది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు 9.5 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఏకంగా 7 సీట్లను కలిగి ఉంది. 9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ దృష్ట్యా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications